పుట్టుకతోనే 32 పళ్లు... శిశువు వీడియో వైరల్!
అయితే... ఇప్పుడు చెప్పుకోబోయే శిశువు రూటే సెపరేటూ అన్నట్లుగా ఉంది.
By: Tupaki Desk | 21 July 2024 2:30 AM GMTశిశువులు పుట్టిన తర్వాత బోసి నోటితో పాలు తాగుతుంటారు. రోజులు గడిచే కొద్దీ బోసి నవ్వులతో మురిపిస్తుంటారు. అలా నెలలు గడిచిన కొద్దీ ఒక్కొక్కటిగా పాలదంతాలు వస్తుంటాయి. తర్వాత అవి ఊడిపోవడం.. తర్వత మళ్లీ దంతాలు రావడం జరుగుతుంటుంది. అయితే... ఇప్పుడు చెప్పుకోబోయే శిశువు రూటే సెపరేటూ అన్నట్లుగా ఉంది. పుట్టికతోనే 32 పళ్లు కలిగి ఉంది.
అవును... పాల దంతాలు, మధ్యలో పిప్పి పళ్లు, అవి ఊడిపోవడాలు, వాటిని గ్రామాల్లో చాలామంది మట్టిలో కప్పెట్టడాలు వంటి రొటీన్ ప్రొసీజర్ ఏమీ లేకుండా ఓ చిన్నారి పుట్టినప్పుడే 32 పళ్లను కలిగి ఉంది. ఇలా పుట్టినప్పుడే నోటి నిండా దంతాలు ఉండటంతో అది చూసి తల్లితండ్రులు షాక్ అయ్యారు.
దీనికి సంబంధించిన వీడియోను ఆ చిన్నారి తల్లి ఆన్ లైన్ వేదికగా షేర్ చేసింది. ప్రస్తూతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియోలో కనిపిస్తోన్న దృశ్యాల్లో పాప పుట్టుకతోనే నోటి నిండా పళ్లు ఉన్నాయి. ఇదే సమయంలో పాప ఎదుగుతున్న కొద్దీ ఆ పళ్లతో ఎలా ఉందో అందులో చూపించారు. ఈ పరిస్థితిని "నాటల్ టీత్" అంటారని అంటున్నారు!
అయితే ఈ ఆరోగ్య పరిస్థితి వల్ల బిడ్డకు అంతగా ప్రమాదం లేకపోయినా.. పాలిచ్చే సమయంలో తల్లికి మాత్రం ఇబ్బందిగా ఉంటుందని అంటారు. ఇదే సమయంలో తెలిసీ తెలియని ఆ వయసులో ఏదైనా పన్ను పొరపాటున విరిగితే.. అది ఆ చిన్నారి మింగేసే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ వీడియోకు వ్యూస్ భారీగా ఉన్నాయి!