డ్రాగన్ తోక తొక్కితే.. తైవాన్ పీక నొక్కుతుంది.. మరో యద్ధమే..
దాదాపు మూడేళ్ల కిందట అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ తైవాన్ పర్యటనకు వెళ్తేనే నానా హంగామా చేసింది చైనా. ఇప్పుడు మళ్లీ తైవాన్ అధ్యక్షుడు లాయ్ చింగ్ తె అమెరికా పర్యటనను సాకుగా చూపి.. డ్రాగన్ చిందులేస్తోంది.
By: Tupaki Desk | 11 Dec 2024 5:30 PM GMTతైవాన్..ప్రపంచచిప్ రాజధాని.. చిన్న ద్వీపమే.. కానీ, చాలా కీలకమైనది.. మరీ ముఖ్యంగా చైనాకు.. తైవాన్ తనదే అనేది చైనా వాదన.. ‘వన్ చైనా’ (ఒకే చైనా) అనేది దాని నినాదం.. అందుకే ఎవరైనా తైవాన్ గురించి మాట్లాడితే చాలు డ్రాగన్ తోక తొక్కినట్లే.. దాదాపు మూడేళ్ల కిందట అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ తైవాన్ పర్యటనకు వెళ్తేనే నానా హంగామా చేసింది చైనా. ఇప్పుడు మళ్లీ తైవాన్ అధ్యక్షుడు లాయ్ చింగ్ తె అమెరికా పర్యటనను సాకుగా చూపి.. డ్రాగన్ చిందులేస్తోంది.
30 ఏళ్లలో ఎన్నడూ లేనివిధంగా
తైవాన్ ను తరచూ భయపెడుతుంటుంది చైనా. చుట్టూ సైనిక విన్యాసాలు నిర్వహిస్తూ వస్తుంటుంది. తాజాగా తైవాన్ చుట్టుపక్కల భారీ సైనిక మోహరింపులు చేసింది. ఇలా 30 ఏళ్లలో ఎన్నడూ లేనివిధంగా చైనా నౌకాదళం తైవాన్ చుట్టూ కమ్మేసిందట. మరోవైపు తైవాన్ తమది స్వతంత్ర దేశం అటుంటుంది. గత ఏడాది ఎన్నికైన తైవాన్ నాయకత్వం చైనాకు వ్యతిరేకం. దీంతో చైనా మరింత కఠిన వైఖరి అవలంబిస్తోంది. తైపీ వేర్పాటువాదాన్ని సహించబోమని చెబుతోంది. వాస్తవానికి గత రెండేళ్లతో పోలిస్తే తైవాన్ ద్వీపం చుట్టూ డ్రాగన్ దూకుడు చూపుతోంది.
సార్వభౌమత్వాన్ని కాపాడుకునేందుకే
తమ సార్వభౌమత్వాన్ని కాపాడుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని చైనా చెబుతోంది. తైవాన్ ను ఉద్దేశిస్తూ.. వేర్పాటువాద కార్యకలాపాలను సహించమని పేర్కొంటోంది. లాయ్ చింగ్ తె అమెరికాలోని హవాయి ద్వీపాల పర్యటనకు వెళ్లారు. దీనిని ఉద్దేశిస్తూ.. బయటి శక్తులతో కుమ్మక్కయ్యే చర్యలపై అత్యంత అప్రమత్తంగా ఉన్నామని చైనా వ్యాఖ్యానించింది. తైవాన్ జలసంధిలో సుస్థిరత కోసం అన్ని చర్యలు తీసుకొంటాం అని వివరించింది. కాగా, తైవాన్ అధ్యక్షుడు అమెరికాకు చెందిన హవాయి, గువామ్ లలో పర్యటించారు. ఇది చైనాకు మంట పుట్టించింది. మరోవైపు త్వరలో కొలువుదీరనున్న ట్రంప్ ప్రభుత్వానికి ఇది చైనా పంపుతున్న రాజకీయ సందేశం అని అంటున్నారు. తైవాన్ పై 70 రోజులపాటు చైనా సైన్యం ప్రణాళిక చేసి మోహరింపులు చేపట్టినట్లు సమాచారం.
ఉక్రెయిన్-రష్యా, ఇజ్రాయెల్-హమాస్ యుద్ధాలతో ప్రపంచం సతమతం అవుతోంది.ఇలాంటి సమయంలో తైవాన్-చైనా ఉద్రిక్తతలు పెరిగితే మరో యుద్ధం సంభవిస్తే.. ఇక సంక్షోభమే