విడాకులడిగిన భార్యను కోర్టు నుంచి ఎత్తుకెళ్లిన భర్త.. నెక్స్ట్ బిగ్ ట్విస్ట్!
దీంతో... అంతా చూస్తుండగానే కోర్టులోనే ఆమెను భూజంపై ఎత్తుకుని బయటకు పరుగెత్తాడు. ఆ తర్వాత బిగ్ ట్విస్ట్ నెలకొంది.
By: Tupaki Desk | 3 Oct 2024 4:38 AM GMTనైరుతి చైనాలోని ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. తన భర్తతో విడాకులు కావాలని కోరుతూ కోర్టు కెళ్లిన భార్య కు ఊహించని అనుభవం ఎదురైంది. తనకు ఎక్కడ విడాకులు ఇచ్చేస్తుందో అనే భయం, ఆందోళన భర్తకు పట్టుకున్నట్లుంది. దీంతో... అంతా చూస్తుండగానే కోర్టులోనే ఆమెను భూజంపై ఎత్తుకుని బయటకు పరుగెత్తాడు. ఆ తర్వాత బిగ్ ట్విస్ట్ నెలకొంది.
అవును.. చైనాలోని సుచువాన్ ప్రావిన్స్ కు చెందిన చెన్ అనే ఆమెకు, లీ అనే వ్యక్తితో సుమారు 20 ఏళ్ల క్రితం వివాహమైంది. షాంఘై మార్నింగ్ పోస్ట్ ప్రకారం.. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. ఈ క్రమంలో ఇటీవల... లీ నుంచి విడాకులు కావాలంటూ చెన్ కోర్టును ఆశ్రయించింది.
ఈ సందర్భంగా లీ మద్యం మత్తులో తనతో హింసాత్మకంగా వ్యవహరిస్తున్నాడని.. గృహ హింస కారణంగా తమ సంబంధం పూర్తిగా విచ్చిన్నమైందని ఫిర్యాదులో పేర్కొంది. దీంతో... ఈ పిటిషన్ పై విచారణ ప్రారంభించిన న్యాయస్థానం... ఈ జంట ఇప్పటికీ లోతైన భావోద్వేగ బంధాన్ని కలిగి ఉన్నారని భావిస్తూ విడాకులు ఇవ్వలేదు.
అయితే ఈ తీర్పుపై చెన్ అసంతృప్తి చెంది మరోసారి అప్పీల్ చేసింది. ఈ రెండో విచారణ సమయంలో లీ... కోర్టు హాలులో ఉన్న తన భార్య చెన్ ను ఎత్తుకుని, వీపుపై మోస్తూ కోర్టు గది నుంచి బయటకు పరుగెత్తాడు. ఈ సమయంలో ఆమెను వదలడం ఇష్టం లేదంటూ గట్టిగా అరవడం మొదలుపెట్టాడని అంటున్నారు.
ఈ సమయంలో... న్యాయాధికారులు వెంటనే జోక్యం చేసుకుని లీ ని మందలించారు. దీంతో... తన మితిమీరిన చర్యలను అంగీకరిస్తూ, అలాంటి ప్రవర్తన రిపీట్ కాదని ప్రామిస్ చేస్తూ క్షమాపణ లేఖ రాశాడు. దీంతో కోర్టు అతనిని మన్నించింది.. ఇది పునరావృతం అయితే చర్యలు తప్పవని హెచ్చరించింది.
అయితే తన భర్తకు తనను విడిచిపెట్టడం, తనకు విడాకులివ్వడం ఇష్టం లేదని గ్రహించిందో.. లేక, తన భర్త ప్రేమ అప్పుడు అర్ధమైందో.. అదీగాక అప్పటికి తత్వం బోధపడిందో ఏమో కానీ... విడాకుల పిటిషన్ ను చెన్ వెనక్కి తీసుకుంది. తిరిగి తన భర్తతో కలిసి ఉండటానికి అంగీకరించింది.