Begin typing your search above and press return to search.

ఉద్యోగులెవరూ 'డీప్ సీక్' ఇన్ స్టాల్ చేసుకోవద్దు... కారణం ఇదే!

దీంతో.. ఏఐ విషయంలో ఇప్పటివరకూ బాస్ గా ఉన్న యూఎస్ కు బిగ్ షాక్ తగిలిందనే చర్చ నడిచింది.

By:  Tupaki Desk   |   1 Feb 2025 4:16 AM GMT
ఉద్యోగులెవరూ డీప్  సీక్ ఇన్  స్టాల్  చేసుకోవద్దు... కారణం ఇదే!
X

చైనాకు చెందిన డీప్ సీక్ స్టార్టప్ సంస్థ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) లో సంచలనం సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. ప్రధానంగా... అతి తక్కువ ఖర్చుతో అధునాతన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ ను ఆవిష్కరించి ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీంతో.. ఏఐ విషయంలో ఇప్పటివరకూ బాస్ గా ఉన్న యూఎస్ కు బిగ్ షాక్ తగిలిందనే చర్చ నడిచింది.

ఈ డీప్ సీక్ ఇటీవల అమెరికా టెక్ పరిశ్రమను కుదిపేసింది. ఇందులో భాగంగా... ప్రీ మార్కెట్ ట్రేడ్ లో మైక్రోసాఫ్ట్ షేరు 7శాతం, మెటా షేరు 5శాతంతో పాటు ఎన్విడియా షేరు 14శాతం చొప్పున నష్టల్లో పతనమయ్యాయి. ఇదే సమయంలో.. నాస్ డాక్ కూడా 4శాతం మేర కుంగిన పరిస్థితి. మరోపక్క యాపిల్ యాప్ స్టోర్ లో డీప్ సీక్ యాప్ అగ్రస్థానంలో ఉంది.

అటు గూగుల్ ప్లే స్టోర్ లోనూ ఇదే నంబర్ వన్ స్థానంలో నిలిచిందని చెబుతున్నారు. అమెరికాలోనే కాకుండా సుమారు 51 దేశాల్లోని ప్లే స్టోర్స్ లో ఇదే అగ్రస్థానంలో ఉంది. ఈ సమయంలో.. అమెరికా కాంగ్రెస్ ఆసక్తికర నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా.. ఉద్యోగులెవరూ డీప్ సీక్ ఇన్ స్టాల్ చేసుకోవద్దని తెలిపింది.

అవును... అమెరికా అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) మార్కెట్ ని చైనా డీప్ సీక్ షేక్ చేస్తొన్న వేళ అమెరికా కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా.. ఉద్యోగులు ఎవరు డీప్ సీక్ ను ఇన్ స్టాల్ చేసుకోవద్దని అమెరికా కాంగ్రెస్ తన ఆఫీసులకు ఆదేశాలు జారీ చేసింది. ఇది కాంగ్రెస్ భద్రత, పరిపాలనలకు సవాల్ గా నిలుస్తుందని పేర్కొంది.

చైనీస్ చాట్ బాట్ కావడంతో అత్యంత విలువైన సమాచారాన్ని తస్కరించే అవకాశం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలోనే దీన్ని ఉద్యోగులు ఎవరూ అధికారిక ఫోన్లు, కంప్యూటర్లు, ట్యాబ్ లలో ఇన్ స్టాల్ చేయకూడదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అయితే.. చీఫ్ అడ్మినిట్రేటివ్ ఆఫీసర్ మాత్రమే డీప్ సీక్ వాడతారని తెలిపింది.

కాగా... ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగాన్ని చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ అధికారికి మాత్రమే పరిమితం చేయడం ఇదే తొలిసారి కాదు. 2023లో చాట్ జీపీటీ విషయంలో కూడా పరిమితులు విధించారు. ఇదే సమయంలో గత ఏప్రిల్ లో సిబ్బంది మైక్రోసాఫ్ట్ కోపైలెట్ ఉపయోగించకుండా నిషేధించారు. ఇక.. డీప్ సీక్ చైనాది కావడంతో అమెరికా మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది!