Begin typing your search above and press return to search.

మైక్రోసాఫ్ట్.. గూగుల్.. మెటా.. అమెజాన్ ను తలదన్నే డీప్ సీక్ తెలుసా?

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విషయంలో అమెరికా ఆధిపత్యం కొనసాగుతోన్న వేళ చైనాకు చెందిన స్టార్టప్ సంస్థ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

By:  Tupaki Desk   |   28 Jan 2025 4:31 AM GMT
మైక్రోసాఫ్ట్.. గూగుల్.. మెటా.. అమెజాన్ ను తలదన్నే డీప్ సీక్ తెలుసా?
X

ఇప్పుడు ప్రపంచం మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) గురించిన చర్చ విపరీతంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ రంగంలో ఎంత ముందుకు వెళ్తే.. ఆ దేశం అంత అభివృద్ధి చెందుతుందని, ముందు ముందు ప్రపంచాన్ని శాసించే అవకాశాలున్నాయని అంటున్నారు. ఈ విషయంలో ఇప్పటివరకూ అమెరికానే బిగ్ బాస్!

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను రూపొందించిన ఓపెన్ ఏఐ సంస్థ అనతికాలంలోనే ప్రాచుర్యం పొందడం.. గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, మెటా వంటి సంస్థలు ఈ రంగంలోకి ఎంట్రీ ఇవ్వడంతో ఏఐలో అమెరికా ఆధిపత్యం చలాయిస్తూ వస్తోంది. ఈ సమయంలో ఒక్కసారిగా తెరపైకి వచ్చి, సంచలనంగా మారుతుంది డీప్ సీక్.

అవును... ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విషయంలో అమెరికా ఆధిపత్యం కొనసాగుతోన్న వేళ చైనాకు చెందిన స్టార్టప్ సంస్థ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దీంతో... అసలు ఏమిటీ డీప్ సీక్, అమెరికా సంస్థలకు ఎందుకు ఆందోళన కలిగిస్తుంది.. ఒక్కసారిగా ఈ డీప్ సీక్ ఫుల్ ఫేమస్ అవ్వడానికి కారణం ఏమిటి ఇప్పుడు చూద్దామ్!

చైనాలో 2023లో లియాంగ్ వెన్ ఫెంగ్ అనే వ్యక్తి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీసెర్చ్ సంస్థ ‘డీప్ సీక్’ ను ప్రారంభించారు. ఈ క్రమంలో... తమ దేశంలో ఉన్న ప్రముఖ యూనివర్సిటీల నుంచి గ్రాడ్యుయేట్లతో ఓ టీమ్ ని ఏర్పాటు చేసుకున్న ఈ సంస్థ.. తాజాగా ‘ఆర్1’ పేరిట ఏఐ మోడల్ ను ఆవిష్కరించింది. ఇక్కడ మరో విషయం ఏమిటంటే.. ఇది పూర్తిగా ఉచితం.

మిగిలిన ఏఐ సంస్థలైన ఓపెన్ ఏఐ, క్లాడ్ సోనెట్ వంటి సంస్థలు ఏఐ మోడల్ ను వినియోగించడం కోసం సబ్ స్క్రిప్షన్ రూపంలో కొంత మొత్తాన్ని వసూల్ చేస్తుండగా.. అలాంటిది ఏమీ లేకుండానే, పెద్దగా పరిమితులు, షరతులు పెట్టకుండానే ఈ డీప్ సీక్ పూర్తి ఉచితంగా సర్వీస్ అందిస్తోంది. దీంతో.. ఇది ఒక్కసారిగా వైరల్ అయిపోయింది.

ఇది ఎంట్రీతోనే అమెరికా టెక్ పరిశ్రమను కుదిపేసిందని అంటున్నారు. దీని ఫలితంగా... ప్రీ మార్కెట్ ట్రేడ్ లో మైక్రోసాఫ్ట్ షేరు 7 శాతం, మెటా షేరు 5 శాతంతో పాటు ఎన్విడియా షేరు 14 శాతం చొప్పున నష్టల్లో పతనమయ్యాయి. ఇదే సమయంలో.. నాస్ డాక్ కూడా నాలుగు శాతం మేర కుంగింది! దీంతో.. ఇది అమెరికాకు బిగ్ షాక్ అని అంటున్నారు!

ఇక ఈ ఏఐ చాట్ బాట్ ను వినియోగించాలనుకునేవారు.. చాట్.డీప్ సిక్.కామ్ వెబ్ సైట్ లోకి వెళ్లి, ఇ-మెయిల్ ఐడీతో లాగిన్ అయితే సరిపోతుంది! వెంటనే డాల్ఫిన్ లోగోతో కూడిన చాట్ పేజీ ఓపెన్ అవుతుంది. ఇంటర్ ఫేస్ పరంగా అచ్చం చాట్ జీపీటీని పోలి ఉండే దీనిలో తెలుగులోనూ చాట్ చేయొచ్చు!