యూస్ బ్యాలెట్ లో చైనీస్ బాట్ ల ఎఫెక్ట్... మైక్రోసాఫ్ట్ వార్నింగ్!
ఈ సమయంలో తాజాగా అమెరికా అధ్యక్ష ఎన్న్నికల విషయంలోనూ మరోసారి ఈ విషయం చర్చకు వచ్చింది.
By: Tupaki Desk | 24 Oct 2024 4:02 AM GMTప్రపంచంలో ఎక్కడైనా ఏదైనా సమస్య వచ్చిందంటే.. అందులో కచ్చితంగా చైనా పేరు ప్రస్థావనకు వస్తుందని.. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఆ దేశం ప్రపంచంపై ఆ స్థాయిలో ప్రభావం చూపిస్తుంటుందని అంటుంటారు. ఈ సమయంలో తాజాగా అమెరికా అధ్యక్ష ఎన్న్నికల విషయంలోనూ మరోసారి ఈ విషయం చర్చకు వచ్చింది.
అవును.. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎన్నికల్లో చైనీస్ నియంత్రణలో ఉన్న సోషల్ మీడియా బాట్ సైన్యం ఓటర్లను ప్రభావింతం చేయడానికి ప్రయత్నిస్తోందని అంటున్నారు. ఇందులో భాగంగా... అలబామా, టెన్నస్సీ, టెక్సాస్ లోని ఓటర్లను ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తోందని మైక్రోసాఫ్ట్ ప్రచురించిన తాజా పరిశోధన వెల్లడించింది.
ఈ ఆపరేషన్ డౌన్ బ్యాలెట్ రేసులకు వ్యతిరేకంగా సమన్వయ జోక్యానికి చేస్తున్న ప్రయత్నాన్ని సూచిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ సందర్భంగా... ఇందులో ఉన్న ఫేక్ అకౌంట్స్.. అలబామా ప్రతినిధి బారీ మూరు, టేన్నసీ సెనేటర్ మార్షా బ్లాక్ బర్న్, టెక్సాస్ ప్రతినిధి మైఖేల్ మెక్ కాల్ తో పాటు రిపబ్లికన్స్ అందరినీ కించపరుస్తుందని అంటున్నారు.
దీనికి బాధ్యత వహించే సమూహాన్ని "తాజీ ఫ్లడ్" అని పిలుస్తారని.. ఇది గతంలో చైనా పబ్లిక్ సెక్యూరిటీ మంత్రిత్వ శాఖతో సంబంధం కలిగి ఉందని.. ప్రధానంగా చైనీస్ ప్రభుత్వ విధానాలను ఖండించిన చట్టసభ సభ్యులే లక్ష్యంగా ఇది పనిచేస్తుందని పరిశోధకులు చెబుతున్నారని తెలుస్తొంది!
అయితే... ఈ కామెంట్స్ పై వాషింగ్టన్ లోని చైనా రాయబార కార్యాలయం వెంటనే స్పందించలేదు. ఈ సమయంలో బాట్ లు... ఇజ్రాయెల్ కు మూర్ మద్దతును విమర్శించారు. ఇదే సమయంలో... రూబియో ఆర్థిక అవినీతి పథకంలో భాగమని మరో గ్రూప్ పేర్కొంది. ఇదే సమయంలో.. బ్లాక్ బర్న్ ప్రత్యర్థికి ఈ బాట్ లు తమ మద్దతును పెంచారు.
ఇందులో భాగంగా... ఆమె ఫార్మా కంపెనీల నుంచి డబ్బులు తీసుకున్నట్లు ప్రచారం చేస్తున్నారు. అదేవిధంగా... కెక్ కాల్ ఇన్ సైడర్ ట్రేడింగ్ లో నిమగ్నమై ఉన్నారంటూ కథనాలను వైరల్ చేస్తున్నారు. దీంతో... ఈ బాట్ ల వ్యవహారం ఇప్పుడు వైరల్ గా మారింది. అయితే... సంబంధిత పోస్టులను ఎంతమంది అమెరికన్లు వీక్షించారనే విషయంపై ఎటువంటి నివేదిక అందించలేదు.