Begin typing your search above and press return to search.

చైనా పౌరులకు అధ్యక్షుడి హెచ్చరికలు.. యూఎస్, భారత్ ప్రస్తావన

చైనా తన 75వ జాతీయ దినోత్సవాన్ని మంగళవారం జరుపుకుంది. ఈ సందర్భంగా ప్రసంగించిన చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ కీలక వ్యాఖ్యలు చేస్తూ, దేశ పౌరులను హెచ్చరించారు.

By:  Tupaki Desk   |   2 Oct 2024 4:09 AM GMT
చైనా పౌరులకు అధ్యక్షుడి హెచ్చరికలు.. యూఎస్, భారత్  ప్రస్తావన
X

చైనా తన 75వ జాతీయ దినోత్సవాన్ని మంగళవారం జరుపుకుంది. ఈ సందర్భంగా ప్రసంగించిన చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ కీలక వ్యాఖ్యలు చేస్తూ, దేశ పౌరులను హెచ్చరించారు. బీజింగ్ లోని తియానన్ స్క్వేర్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రసంగించిన ఆయన... మున్ముందు గడ్డు పరిస్థితులు తప్పవని అన్నారు!

అవును... చైనా జాతీయ దినోత్సవం సందర్భంగా ఆ దేశ అధ్యక్షుడు భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా... అమెరికాతో ఉన్న తీవ్ర పోటీ, భారత్ సహా పొరుగు దేశాలతో పెరుగుతున్న ఉద్రిక్తతలు, ఆర్థికంగా ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో దేశం మున్ముందు గడ్డు పరిస్థితులు ఎదుర్కోనుందని పేర్కొన్నారు.

ఎన్నో సమస్యలు, అడ్డంకులు ఎదురుకావొచ్చని.. తీవ్ర ఒడుదుడుకులు, కఠిన సమయాలు ఉండోచ్చని అన్నారు. ఇలాంటి సమయాల్లోనే అప్రమత్తంగా ఉంటూ ముందుకు వెళ్లాలని సూచించారు. కమ్యునిస్టు పార్టీతో కలిసి మొత్తం సైన్యం, అన్ని వర్గాల ప్రజలు కలిసికట్టుగా ముందుకు వెళ్తే ఏ కష్టాలు కూడా చైనీయులను అడ్డుకోలేవని జిన్ పింగ్ పేర్కొన్నారు.

ఇదే సమయంలో... అంతర్గత సమస్యలు.. చైనా ఎలక్ట్రిక్ వాహనాలపై అమెరికా, ఈయూ అధిక సుంకాలు విధించడంతోపాటు చైనా స్థిరాస్థి మార్కెట్ తిరోగమనం కారణంగా బిలియన్ డాలర్ల నష్టాలు వచ్చాయ్యని.. ఈ సవాళ్లను చైనా ఎదుర్కొంటోందని అన్నారు. ఈ నేపథ్యంలోనే.. దేశ ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవానికి పలు సంస్కరణలు అవసరమని తెలిపారు.

ఈ సందర్భంగా తైవాన్ ప్రస్థావాన్ని తీసుకొచ్చిన జిన్ పింగ్... తైవాన్ స్వాతంత్రాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు. తైవాన్ తమ ఆధీనంలో భాగమని.. జలసంధికి ఈరువైపులా ఉన్న ప్రజల మధ్య రక్తసంబంధం ఉందని తెలిపారు.

కాగా చైనాకు ఇతర దేశాలతో చాలా సమస్యలు ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... యూఎస్ తో శత్రుత్వంతో పాటు దక్షిణ చైనా సముద్రంలో ఎక్కువ భాగంపై ఫిలిప్పీన్స్ తో సంఘర్షణకు దారితీశాయి. ఈ సమయంలో.. ఫిలిప్పిన్స్ తో పాటు మలేషియా, వియాత్నాం, బ్రూనై, తైవాన్ లు కూడా కౌంటర్ క్లెయింలు కలిగి ఉన్నాయి.

ఇదే క్రమంలో... తూర్పు చైనా సముద్రంపై జపాన్ తో ఉద్రిక్తతల నేపథ్యంలో టోక్యో తన భద్రతా దళాలను పెంచడానికి భారీగా పెట్టుబడులు పెట్టేలా చేసింది. ఇక తూర్పు లడఖ్ లో భారత్ - చైనా సైనిక ప్రతిష్టంభన కొనసాగుతోంది.

ఇక.. మావో జెడాంగ్ నేతృత్వంలోని కమ్యునిస్టులు అంతర్యుద్ధంలో అధికారాన్ని చేజిక్కించుకున్న తర్వాత 1949లో పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా ఏర్పడింది. ఇప్పుడు.. పార్టీ, సైన్యం, ప్రెసిడెన్సీకి అధిపతిగా ఉన్న 71ఏళ్ల జిన్ పింగ్... ప్రస్తుతం మూడోసారి ఐదేళ్ల పదవీకాలంలో ఉన్నారు.