Begin typing your search above and press return to search.

'డ్రాగన్' దూకుడు.. సెకనులో 100 జీబీ డేటా!

చైనాకు చెందిన చాంగ్ గ్వాంగ్ శాటిలైట్ టెక్నాలజీ సెకనుకు 100 గిగాబైట్ల డేటాను ట్రాన్స్ మిట్ చేసేలా అత్యాధునిక హైరిజల్యూషన్ స్పేస్ టు గ్రౌండ్ లేజర్ ట్రాన్స్ మిషన్ టెక్నాలజీని డెవలప్ చేసింది.

By:  Tupaki Desk   |   3 Jan 2025 11:30 AM GMT
డ్రాగన్ దూకుడు.. సెకనులో 100 జీబీ డేటా!
X

జీబీల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన రోజులు పోయి చాలానే రోజులయ్యాయి. స్మార్ట్ ఫోన్ విప్లవం.. అందునా జియో ఎంట్రీ ఇచ్చిన తర్వాత.. వాళ్లు.. వీళ్లు అన్న తేడా లేకుండా వయసుతోనే పెద్ద పని లేకుండానే డిజిటల్ భాషను చాలా మందే మాట్లాడేస్తున్నారు. అత్యాధునిక సాంకేతికతో తనకు సాటి మరెవరూ లేరన్నట్లుగా దూసుకెళుతోంది డ్రాగన్ దేశం. తాజాగా ఆ దేశం అత్యంత వేగంగా భారీ పరిమానంలోని డేటాను సెకను వ్యవధిలో పంపటం ద్వారా కొత్త హిస్టరీని క్రియేట్ చేసినట్లైంది. అంతేకాదు.. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కు చెందిన స్టార్ లింక్ ను కూడా అధిగమించినట్లుగా చెబుతున్నారు.

ఈ విషయాన్నితాజాగా డ్రాగన్ దేశానికి చెందిన 'చైనా మార్నింగ్ పోస్టు' వెల్లడించింది. చైనాకు చెందిన చాంగ్ గ్వాంగ్ శాటిలైట్ టెక్నాలజీ సెకనుకు 100 గిగాబైట్ల డేటాను ట్రాన్స్ మిట్ చేసేలా అత్యాధునిక హైరిజల్యూషన్ స్పేస్ టు గ్రౌండ్ లేజర్ ట్రాన్స్ మిషన్ టెక్నాలజీని డెవలప్ చేసింది. ఈ ప్రయోగంలో భాగంగా జిలిన్ 1 శాటిలైట్ నుంచి ట్రక్ ను అమర్చిన గ్రౌండ్స్టేషన్ కు ఈ డేటాను కేవలం సెకను వ్యవధిలో పంపటం గమనార్హం.

ఇప్పటివరకు ఉన్న రికార్డులకు ఇది పది రెట్ల వేగంతో ప్రయాణించటం విశేషం. స్టార్ లింక్ 6జీ టెక్నాలజీని డెవలప్ చేస్తున్నది అధికారిక సమాచారం కాదని.. ఆ విషయంలో తమ సాంకేతికత ఎలాన్ మస్క్ కు చెందిన స్టార్ లింక్ కంపెనీని అధిగమించినట్లుగా చాంగ్ గ్యాంగ్ సంస్థ లేజర్ గ్రౌండ్ కమ్యూనికేషన్ల అధిపతి వాంగ్ హాంగ్ హాంగ్ వెల్లడించారు. అంతేకాదు.. స్టార్ లింక్ శాటిలైట్ టు గ్రౌండ్ కమ్యూనికేషన్ ను ఇప్పటివరకు వాడలేదని.. కానీ తాము ఇప్పటికే భారీ స్థాయిలో ఆ సాంకేతికతను వాడటం మొదలు పెట్టినట్లుగా పేర్కొన్నారు.

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 5జీ కమ్యూనికేషన్ వాడుకలో ఉండటం తెలిసిందే. దీని తర్వాతి వెర్సన్ 6జీ. దీన్ని అత్యధిక ఫ్రీక్వెన్సీ బ్యాండ్ల వద్ద వినియోగిస్తారు. తాజాగా చైనా 5జీ ఆధారిత అత్యాధునిక మొబైల్ స్టేషన్ ను డెవలప్ చేసినట్లుగా ప్రకటించింది. దీని ప్రత్యేకత ఏమంటే.. యుద్ధ వాతావరణంలోనూ మూడు కిలోమీటర్ల పరిధిలో పదివేల మంది వరకు అత్యంత సురక్షితంగా.. వేగంగా డేటాను పంపిస్తుంది. దీన్ని చైనా మొబైల్ కమ్యునికేషన్స్ గ్రూపు.. చైనాఆర్మీ సంయుక్తంగా డెవలప్ చేశాయి. ఏమైనా.. రోజు రోజుకు సాంకేతికంగా డ్రాగన్ దేశం దూసుకెళుతున్న తీరు ఇప్పుడు సంచలనంగా మారుతోంది.