Begin typing your search above and press return to search.

అందగత్తెలు కాదు.. మోసగత్తెలు.. చైనా యూత్ పాలిట చురకత్తులు

టెక్నాలజీ ఎంత పెరుగుతున్నదో అంత మోసం జరుగుతోంది.. ఒకప్పుడు ఇళ్లలోకి చొరబడి.. దారికాచి దోపిడీలకు పాల్పడేవారు.. ఇప్పుడు దొంగలు రూపం మార్చుకున్నారు

By:  Tupaki Desk   |   4 Sep 2024 11:30 PM GMT
అందగత్తెలు కాదు.. మోసగత్తెలు.. చైనా యూత్ పాలిట చురకత్తులు
X

టెక్నాలజీ ఎంత పెరుగుతున్నదో అంత మోసం జరుగుతోంది.. ఒకప్పుడు ఇళ్లలోకి చొరబడి.. దారికాచి దోపిడీలకు పాల్పడేవారు.. ఇప్పుడు దొంగలు రూపం మార్చుకున్నారు. అంతా ఆన్ లైన్.. స్మార్ట్ ఫోన్లలోకి చొరబడి.. లింకులు పంపి.. డబ్బులు కొట్టేయడమే.. ఎక్కడో ఉండి దొంగతనాలు చేయడం సులువైపోయింది. వీటినే ఆన్ లైన్ మోసాలుగా చెబుతున్నారు. అయితే, ఇందులో ఇంకో రకం మోసం..అందమైన అమ్మాయిలు అవతలి వారికి కాల్స్ చేసి.. న్యూడ్ గా రికార్డు చేసి.. డబ్బులు డిమాండ్ చేయడం. కాగా, చైనా యువతకు మరో రకం సమస్య వస్తోందట. అదేమంటే..

వారు గూఢచారులు జాగ్రత్త

‘మీరు ఏ అమ్మాయితోనైనా అబ్బాయితోనైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి’.. అంటూ చైనా తమ యువకులను హెచ్చరిస్తోంది. వారు అమ్మాయిలు కాదని.. అంతకుమించిన ప్రమాదకార గూఢచారులని చెబుతోంది. ఈ మేరకు అటు అమ్మాయిలు, అబ్బాయిలకు హెచ్చరికలు జారీ చేయడం గమనార్హం. ఇలాంటి వ్యవహారాలకు దూరంగా ఉండాలని కోరుతోంది.

మనపై నిఘా కన్ను..

చైనా విద్యార్థులను కొన్ని విదేశీ నిఘా సంస్థలు లక్ష్యంగా చేసుకున్నాయట. వారిని ఆకట్టుకునేందుకు ఎత్తులు వేస్తున్నాయట. ఇది డ్రాగన్ అనుమానం. దీనికోసం ‘రొమాన్స్‌ ట్రాప్‌’ లను ఎంచుకుంటున్నట్లు చెబుతున్నాయి. ‘మీకు ఉద్యోగం ఆశ చూపుతారు.. ఆన్‌ లైన్‌ డేటింగ్‌ చేద్దామంటారు. ఆ వలలో పడ్డారో ఖతం.. దేశ సున్నిత, రహస్య సమాచారం చెప్పేలా చేస్తారు’’ అంటూ యువతను హెచ్చరిస్తోంది చైనా ప్రభుత్వం.

డేటా విద్యార్థులే కీలకం.. విచాట్ తోనే..?

గూఢచారులు.. ముఖ్యంగా రీసెర్చ్‌ డేటా గురించి తెలిసిన విద్యార్థులను లక్ష్యంగా చేసుకుంటారని చైనా ప్రభుత్వం అప్రమత్తం చేస్తోంది. ఆన్‌ లైన్‌ లో పేర్లు, ముఖాలు మార్చుకుని వలపు వలలోకి లాగుతారని.. అందమైన అబ్బాయిలు, అమ్మాయిలకు దూరంగా ఉండండని హెచ్చరించింది. కాగా, తమ విద్యార్థులపై వల వేస్తున్నది ఎవరో చైనా చెప్పకపోవడం గమనార్హం. అయితే, చైనా భద్రతా మంత్రిత్వ శాఖ నిరుడు వి-చాట్‌ అకౌంట్ తెరిచింది. అప్పటినుంచి విదేశీ గూఢచారుల గురించి హెచ్చరికలు చేస్తోంది.

కన్నేసింది బ్రిటన్?

బ్రిటన్ నిఘా సంస్థ.. తమపై కన్నేసిందని, ప్రభుత్వంలో పనిచేసే జంటను గూఢచర్యం కోసం నియమించుకుందంటూ మూడు నెలల కిందట ఆరోపించింది. అయితే, చైనా, పశ్చిమ దేశాల మధ్య గూఢచర్య ఆరోపణలు సహజంగా మారాయి. చైనా ఏజెంట్‌ గా పనిచేసినట్లు అనుమానాలు ఉన్నాయంటూ న్యూయార్క్‌ గవర్నర్ ఆఫీసులో పనిచేసిన మాజీ ఉద్యోగిని పోలీసులు అరెస్టు చేశారు.