అమెరికాకు ప్లాన్ చేస్తున్నారా? జర జాగ్రత్త చైనా వార్నింగ్
ఇప్పటివరకు ఆ దేశానికి వెళ్లొద్దు.. ఈ దేశానికి వెళ్లొద్దంటూ అమెరికాతో పాటు.. యూరోప్ దేశాలు తరచూ తమ దేశ ప్రజలను అలెర్టు చేస్తుంటాయి.
By: Tupaki Desk | 10 April 2025 4:30 AMఇప్పటివరకు ఆ దేశానికి వెళ్లొద్దు.. ఈ దేశానికి వెళ్లొద్దంటూ అమెరికాతో పాటు.. యూరోప్ దేశాలు తరచూ తమ దేశ ప్రజలను అలెర్టు చేస్తుంటాయి. ట్రావెల్ అడ్వైజరీ విడుదల చేస్తుంటాయి. అలాంటిది తాజాగా ఆ పని చేసింది డ్రాగన్ దేశం. అమెరికాకు వెళ్లాలన్న ప్లాన్ ఉన్న చైనీయులకు తాజాగా వార్నింగ్ ఇచ్చింది ఆ దేశం. అమెరికాలో పరిణామాలు సరిగా లేవని.. అందుకే అమెరికాకు వెళ్లాలనుకునే వారంతా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేసింది.
ఇంతకాలం ఆ దేశానికి వెళ్లొద్దు.. ఈ దేశానికి వెళ్లొద్దని చెప్పే దేశానికి అస్సలే వెళ్లొద్దంటూ చైనా చేసిన ఈ ప్రకటన ఇప్పుడు సంచలనంగా మారింది. అమెరికాకు వెళ్లాలనుకునే వారు అక్కడ ఎదురయ్యే సవాళ్ల మీద ముందుగానే అంచనా వేసుకోవాలని స్పష్టం చేసింది. అమెరికాలో చదువుకోవాలనుకునే విద్యార్థులను ఉద్దేశిస్తూ చైనా టూరిజం శాఖ కీలక వ్యాఖ్యలు చేసింది.
చైనా - అమెరికా వాణిజ్య సంబంధాలు క్షీణించిన వేళ.. అమెరికాలో భద్రతా పరిస్థితుల నేపథ్యంలో.. అమెరికా టూర్ కు ముందు అక్కడ ఎదురయ్యే సమస్యల్ని ముందుగా అంచనా వేసుకోవాలి స్పష్టం చేసింది. ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్లే చైనా విద్యార్థులు..యూఎస్ లోని కొన్ని రాష్ట్రాల్లో చైనీయులకు సంబంధించి ప్రతికూల నిబంధనలు ఉన్న విషయాన్ని స్పష్టం చేసింది. అంతేకాదు.. చైనీయులకు అమెరికాలో స్థానికంగా ఎదురయ్యే సమస్యల మీద అవగాహన పెంచుకోవాలని.. తొందరపడి అమెరికాకు ప్లాన్ చేయొద్దంటూ చేస్తున్న హెచ్చరిక రోటీన్ కు కాస్తంత భిన్నంగా ఉందని చెప్పాలి.