Begin typing your search above and press return to search.

మేటర్ సీరియస్... "పిల్లల్ని కనండి.. డబ్బులు సంపాదించండి"!

చైనాలో జనాభా రోజు రోజుకీ తగ్గిపోతుందనే ఆందోళన ఇటీవల అక్కడ ఎక్కువైపోయిన సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   14 March 2024 3:44 AM GMT
మేటర్  సీరియస్... పిల్లల్ని కనండి.. డబ్బులు సంపాదించండి!
X

చైనాలో జనాభా రోజు రోజుకీ తగ్గిపోతుందనే ఆందోళన ఇటీవల అక్కడ ఎక్కువైపోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో దంపతులకు చైనా ప్రభుత్వం పిల్లల్ని కనే విషయంలో పలు ప్రోత్సాహకాలను ఇస్తుంది. ఇదే సమయంలో పలు కంపెనీలు కూడా పెద్ద మొత్తంలో ఆఫర్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో సరోగసీ ద్వారా అయినా తల్లులుగా మారండి.. డబ్బులు సంపాదించండి అంటూ ఒక కంపెనీ తాజాగా ప్రకటించింది. దీంతో ఈ విషయం అక్కడ సీరియస్ గా మారింది.

అవును... చైనాలోని హెవెన్ ప్రావిన్స్ కి చెందిన ఒక హౌస్ కీపింగ్ కంపెనీ మహిళల కోసం ఒక ప్రకటన ఇచ్చింది. ఇందులో భాగంగా... "పిల్లల్ని కనండి.. డబ్బులు సంపాదించండి" అని పేర్కొంది. అందుకోసం 30,000 డాలర్లకు పైగా ఆఫర్ చేస్తుంది. ఇదే సమయంలో... 28ఏళ్ల కంటే తక్కువ వయసున్నవారు సరోగేట్ ద్వారా తల్లులుగా మారి ఈ మొత్తాన్ని బహిమతిగా అందుకోమని తెలిపింది! 30,000 డాలర్లు అంటే సుమారుగా భారత కరెన్సీలో 25 లక్షలన్నమాట!

ఈ నేపథ్యంలో సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదిక ప్రకారం... హుచెన్ హౌస్ కీపింగ్ కంపెనీ ప్రధాన కార్యాలయం హెవెన్ ప్రావిన్స్ లో ఉండగా.. అక్కడ నుంచి ఆన్ లైన్ వేదికగా ఒక ప్రకటన పోస్ట్ చేయబడింది! సరోగేట్ ద్వారా పిల్లల్ని కనడం ద్వారా పెద్ద మొత్తంలో బహుమతి అందుకోవచ్చనేది ఆ ప్రకటన సారాంశం. దీంతో ఈ విషయంపై ప్రభుత్వం సీరియస్ అవ్వగా... స్థానిక హెల్త్ కమిషన్ ఈ విషయంపై దర్యాప్తు చేస్తుంది!

ఈ సమయంలో ఈ ప్రకటనపై ప్రజల నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత వస్తుందని తెలుస్తుంది. ఇందులో భాగంగా... ఇది చట్టవిరుద్ధమైన ప్రకటన అని ఒకరంటే... ఇది అనుమతించబడితే, ఎవరైనా మానవ అక్రమ రవాణాకు బాధితుడు కావొచ్చని మరొకరు తెలిపారు. ఇదే క్రమంలో... దయచేసి స్త్రీలను పునరుత్పత్తి సాధనాలుగా ఉపయోగించుకోకండి అని ఇంకొకరు స్పందించారు.

కాగా... చైనాలో జననాల రేటు స్థిరంగా క్షిణిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గతంలో ఉన్న వన్ చైల్డ్ పాలసీని రివర్స్ చేయడానికి చైనా తీవ్రంగా ప్రయత్నిస్తుందని తెలుస్తుంది. ఈ క్రమంలో ఇటువంటి ప్రకటనలు తెరపైకి రావడం చర్చనీయాంశం అవుతుంది. చైనాలో సరోగసీ చట్టవిరుద్ధం!!