Begin typing your search above and press return to search.

పాతికేళ్ల లోపు పెళ్లి చేసుకుంటే బంపరాఫర్!

ఇందులో భాగంగా... 25 లేదా అంతకంటే తక్కువ వయసులో వివాహం చేసుకునే యువతులకు దానిని అందించనుంది

By:  Tupaki Desk   |   29 Aug 2023 11:30 AM
పాతికేళ్ల లోపు పెళ్లి చేసుకుంటే బంపరాఫర్!
X

ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న దేశాల విషయంలో భారత్ - చైనాలు పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా జననాల రేటు బాగా తగ్గిపోతుందని చైనా తెగ ఫీలైపోతుంది. ఈ సమయంలో సరైన వయసులో పెళ్లి చేసుకుంటే.. బోలెడన్ని ఆఫర్లు ప్రకటిస్తుంది.

అవును... చైనా యువత పెళ్లిపై ఆసక్తిని రోజు రోజుకీ తగ్గించేసుకుంటున్నారంటూ కథనాలొస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ విషయంలో పలు రకాల అనాలసిస్ లు వెలుగులోకి వచ్చాయి. ఈ సమయంలో చైనాలో జననాల రేటు గణనీయంగా తగ్గుతుండటంతో స్థానిక యంత్రాంగాలు కీలక చర్యలు చేపడుతున్నాయి.

ఇందులో భాగంగా... తాజాగా 25 లేదా అంతకంటే తక్కువ వయసులో వివాహం చేసుకునే యువతులకు రివార్డు అందించాలని ఫిక్సయ్యిందని తెలుస్తుంది. జెజియాంగ్ రాష్ట్రంలోని చాంగ్షాన్‌ కౌంటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ రివార్డ్ అనంతరం అయినా చైనా లో యువతులు పెళ్లిపై ఆసక్తి చూపిస్తారని ప్రభుత్వం నమ్ముతుంది.

వాస్తవానికి చైనాలో స్త్రీ, పురుషుల కనీస వివాహ వయసు 20, 22గా ఉంది. ప్రజలు చిన్న కుటుంబాలకు అలవాటు పడటం, జీవన వ్యయాలు పెరగడం, సాంస్కృతిక మార్పులు వంటి కారణాలతో పెళ్లి చేసుకునే జంటల సంఖ్య తగ్గిపోతోంది. పైగా ఈ మధ్యకాలంలో చైనాలో గృహ హింసలు పెరగడంతో యువతులు వివాహానికి ఆసక్తి చూపించడం లేదని అంటున్నారు.

దీంతో చైనా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2022లో చైనా పౌర సంబంధాల వ్యవహారాల మంత్రిత్వశాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం 2021తో పోలిస్తే.. 2022లో వివాహం చేసుకునే వారి సంఖ్య 10.5 శాతం తగ్గిపోయింది. ఇది చాలా ఎక్కువ శాతం అని చైనా ఆందోళన వ్యక్తం చేస్తుంది.

అవును... 140 కోట్లకు పైగా జనాభా కలిగిన చైనా ప్రస్తుతం తగ్గిపోతున్న జననాల రేటుతో కలవరపడుతోంది. ఈ క్రమంలోనే యువతులు తగిన వయసులో వివాహం చేసుకునే, పిల్లలను కనేలా ప్రోత్సహించే చర్యల్లో భాగంగా చాంగ్షాన్‌ నగదు ప్రోత్సాహకాన్ని తీసుకువచ్చింది.

ఇందులో భాగంగా... 25 లేదా అంతకంటే తక్కువ వయసులో వివాహం చేసుకునే యువతులకు దానిని అందించనుంది. ఈ క్రమంలో... నగదు పథకం కింద వెయ్యి యువాన్లు ఇస్తుంది. ఆ తర్వాత కూడా పిల్లల సంరక్షణ, విద్య విషయంలోనూ సబ్సీడీలు ఇచ్చి జంటలకు ఆర్థికంగా సహకరించనుంది.