Begin typing your search above and press return to search.

పెళ్లిచేసుకోమని వెంటపడుతున్న ప్రెసిడెంట్... కారణం చాలా పెద్దదే!

చైనాను ఇప్పుడు సరికొత్త సమస్య వెంటాడుతోంది. ఈ సమస్య ఇలానే కొనసాగితే దేశ భవిష్యత్తు ఏమైపోతుందనే టెన్షన్ నెలకొంది.

By:  Tupaki Desk   |   7 Nov 2023 6:54 AM GMT
పెళ్లిచేసుకోమని వెంటపడుతున్న ప్రెసిడెంట్... కారణం చాలా పెద్దదే!
X

చైనాను ఇప్పుడు సరికొత్త సమస్య వెంటాడుతోంది. ఈ సమస్య ఇలానే కొనసాగితే దేశ భవిష్యత్తు ఏమైపోతుందనే టెన్షన్ నెలకొంది. దీంతో ఆ దేశ అధ్యక్షుడు సరికొత్త రిక్వస్ట్ చేస్తున్నాడు. ఇందులో భాగంగా యువతూలను పెళ్లి చేసుకోమని వెంటాడుతున్నారు. దేశంలో వివాహాలు, సంతాన సాఫల్యత అనే నూతన సంస్కృతిని పెంపొందించాల్సిన అవసరం ఉందని అంటున్నారు.

అవును.. నిన్నమొన్నటివరకూ ప్రపంచంలో జనాభా విషయంలో అతిపెద్ద దేశం చైనా. అయితే ఇటీవల భారత్ ఆ స్థానాన్ని ఆక్రమించి, చైనాను వెనక్కి నెట్టింది. ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితులు ఇలానే కొనసాగితే భారత్ కాదు.. మరికొన్ని దేశాలు చైనాను జనాభా విషయంలో వెనక్కి నెట్టే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు చైనా అధ్యక్షుడు జీ జిన్‌ పింగ్‌! ప్రస్తుతం ఈ భయం పీక్స్ కి చేరిందని అంటున్నారు.

వివరాళ్లోకి వెళ్తే... చైనాను ఇప్పుడు అతిక్లిష్టమైన సమస్య వెంటాడుతోంది. అదే... శిశుజననాల రేటు బాగా తగ్గిపోవడం. మరోపక్క చైనా యువతులు పెళ్లికి దూరంగా ఉంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చైనా అధ్యక్షుడు జీ జిన్‌ పింగ్ ముందుకు వచ్చారు. ఇందులో భాగంగా... దేశంలో జనాభా పెరుగుదలను ప్రోత్సహించేందుకు వివిధ కార్యక్రమాలను చేపడుతున్నారు.

ఈ క్రమంలో తాజాగా ఆల్ చైనా ఉమెన్స్ ఫెడరేషన్ సమావేశంలో పాల్గొన్న ఆయన.. దేశంలో కుటుంబ వ్యవస్థను కాపాడటంతో మహిళలదే కీలకపాత్ర అని అన్నారు. ఇదే సమయంలో సమాజంలో సరికొత్త ఒరవడిని నెలకొల్పడంలో మహిళలు ముందుంటారని పేర్కొన్నారు. ఇదే క్రమంలో... ప్రస్తుతం దేశంలో వివాహాలు, సంతాన సాఫల్యత అనే నూతన సంస్కృతిని పెంపొందించాల్సిన అవసరం ఉందని తెలిపారు.

అయితే యువతులు ఇలా పెళ్లి-పిల్లలు విషయంలో దూరంగా ఉండటానికి గల కారణాలనూ పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇందులో భాగంగా... పిల్లల పెంపకానికి అ‍య్యే ఖర్చు, కెరీర్ సంక్షోభం, లింగ వివక్ష తదితర అంశాలు చైనా యువత పెళ్లికి దూరంగా ఉండటానికి కారణాలుగా నిలిచాయని చెబుతున్నారు. ఫలితంగా... శిశు జననాల రేటు భారీగా పడిపోయింది. ఈ సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకుని చైనా అధ్యక్షుడు దేశంలోని యువత పెళ్లి చేసుకుని పిల్లలను కనాలని పదేపదే విజ్ఞప్తి చేస్తున్నారు.

కాగా భవిష్యత్తులో చైనా వృద్ధాప్య దేశంగా మారిపోనుందని సర్వేలు చెబుతున్నాయి. ఇప్పటికే చైనాలో వృద్ధుల జనాభా అధికమయ్యింది. మరోవైపు చైనాలో కార్మికుల సంఖ్య తగ్గింది. వీటికితోడు శుశుజననాల రేటు భారీగా పడిపోయింది. ఫలితంగా ఉత్పత్తి వ్యయం అంతకంతకూ పెరుగుతోంది. దీంతో... చైనా అధ్యక్షుడు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు! మరి చైనా యువత అధ్యక్షుడి మాట వింటారా.. లేక, ప్రస్తుత ట్రెండ్ నే కొనసాగిస్తారా అనేది వేచి చూడాలి.