Begin typing your search above and press return to search.

అంబానీ ఇంట పెళ్లికి మించిన లగ్జరీ మ్యారేజ్ అక్కడ

ఈ వివరాలన్ని తెలిసిన తర్వాత అనిపించేది ఒక్కటే.. లగ్జరీ అన్న మాటకు సరికొత్త అర్థాన్ని ఇచ్చేలా ఈ పెళ్లి వేడుక ఉంటుందని చెప్పక తప్పదు.

By:  Tupaki Desk   |   30 Jun 2024 12:30 PM GMT
అంబానీ ఇంట పెళ్లికి మించిన లగ్జరీ మ్యారేజ్ అక్కడ
X

అత్యంత విలాసవంతమైన పెళ్లి వేడుకగా ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్న రిలయన్స్ ఇంట పెళ్లి వేడుకకు సంబంధించిన ఏర్పాట్లు.. ఈ వివాహ వేడుకకు హాజరయ్యే వారికి కల్పించే వసతుల గురించి తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే. ఈ వివరాలన్ని తెలిసిన తర్వాత అనిపించేది ఒక్కటే.. లగ్జరీ అన్న మాటకు సరికొత్త అర్థాన్ని ఇచ్చేలా ఈ పెళ్లి వేడుక ఉంటుందని చెప్పక తప్పదు.

వీరింటి పెళ్లి వేడుకలో హాలీవుడ్.. బాలీవుడ్ ప్రముఖులు మ్యూజికల్ షో చేయటం.. పెళ్లికి వచ్చిన అతిధుల్ని అలరించటంతో పాటు.. పెళ్లికి ముందు రెండు ప్రీ వెడ్డింగ్ ఈవెంట్లను వందల కోట్లు ఖర్చు చేసి నిర్వహించటం.. అసలుసిసలు పెళ్లి వేడుకకు డబ్బుల్ని మంచినీళ్ల కంటే ఎక్కువ రేంజ్ లో ఖర్చు చేసేస్తున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే విలాసవంతమైన పెళ్లి అనే మాటకు కొత్త అర్థాన్ని చెప్పేలా అంబానీ ఇంట జరుగుతున్న చిన్న కొడుకు పెళ్లి వేడుక ఉంది. అయితే.. దీనికి మించిన లగ్జరీ పెళ్లి వేడుక ఒకటి చైనాలో జరిగినట్లుగా చెబుతున్నారు.

హైప్రొఫైల్ ఇళ్లలో జరిగే పెళ్లిళ్లలో అత్యంత లగ్జరీయస్ వేడుక అంబానీ ఇంట జరిగే వేడుకగా చెప్పినప్పటికీ.. దానికి మించిన వేడుక చైనాలో జరిగిందని.. దానికి సంబంధించిన ఆసక్తికర విషయాల్ని ప్రస్తావిస్తున్నారు. సినిమాల్లో చూపించే స్థాయిలో రియల్ గా ఖర్చు చేసినట్లుగా చెప్పటమే కాదు.. దీనికి సంబంధించిన ఒక వీడియో వైరల్ గా మారింది. ఈ పెళ్లి వేడకకు హాజరైన అతిధులు అంత తేలిగ్గా తమ జీవితంలో మర్చిపోలేని రీతిలో పెళ్లి వేడుకను నిర్వహించినట్లుగా చెబుతున్నారు.

ఐదు రోజుల పాటు ఫైవ్ స్టార్ హోటల్లో బస చేసేలా ఏర్పాట్లు.. వారి రవాణా కోసం రోల్స్ రాయిస్.. బెంట్లీ కార్లను వాడారు. పెళ్లి డెకరేష్ సైతం అవాక్కు అయ్యేలా ప్లాన్ చేశారు. చైనా సంప్రదాయం ప్రకారం పెళ్లి వేడుకకు హాజరయ్యే వారు.. రెడ్ కలర్ పాకెట్స్ లో డబ్బును గిఫ్టుగా ఇస్తారు. అందుకు భిన్నంగా.. ఈ పెళ్లికి వెళ్లిన అతిధులకే రివర్సుతో రెడ్ కలర్ పాకెట్స్ లో రూ.66వేల చొప్పున రిటర్న్ గిప్టును ఇవ్వటం ఒక హైలెట్ అంశంగా చెబుతారు. పెళ్లికి వచ్చినప్పుడే కాదు తిరిగి వెళ్లే వేళలోనూ ఫ్లైట్లను బుక్ చేశారు. ఈ పెళ్లి గురించి.. దాని లగ్జరీ గురించి అందరూ ఇప్పుడు ఆసక్తికరంగా మాట్లాడుకుంటున్నారు.