Begin typing your search above and press return to search.

ఏఐతో అడల్ట్ డాల్స్... ప్రత్యేకతలివే!

ఈ క్రమంలో తాజాగా చైనాలో వీటిని అడల్ట్ డాల్స్ తయారీలోనూ వాదేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తుంది.

By:  Tupaki Desk   |   22 Jun 2024 3:53 AM GMT
ఏఐతో అడల్ట్  డాల్స్... ప్రత్యేకతలివే!
X

ఈ తరంలో సాంకేతిక విప్లవం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రస్తుతం సుమారు అన్ని రంగాల్లోనూ ఎంట్రీ ఇస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా చైనాలో వీటిని అడల్ట్ డాల్స్ తయారీలోనూ వాదేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తుంది. ఈ మేరకు అడల్ట్ డాల్స్ తయారు చేసే స్టార్ పెరీ టెక్నాలజీ అనే సంస్థ సొంతంగా ఓ ఏఐ మోడల్ డిజైన్ చేస్తోంది.

అవును... కాదేదీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు అసాధ్యం అన్నట్లుగా పరిస్థితి మారిపోయిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో అడల్ట్ డాల్స్ లోనూ ఏఐని వాడేందుకు ప్రత్యనాలు జరుగుతున్నాయి. ఈ మేరకు స్టార్ పెరీ టెక్నాలజీ అనే సంస్థ ఓ ఏఐ మోడల్ ని డిజైన్ చేస్తోంది. ఆగస్టులో ఈ మోడల్ ఓ కొలిక్కి రావొచ్చని తెలిపింది.

ఈ డాల్స్ యూజర్లతో సులువుగా మాట్లాడటంతో పాటు భౌతికంగా ఇంటరాక్ట్ కాగలిగే విధంగా రూపొందిస్తున్నట్లు సంస్థ తెలిపింది. చైనీస్ శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు సెక్స్ రోబోట్ లకు చాట్ జీపీటీ వంటి సాంకేతికతను వర్తింపచేస్తున్నారు. ఈ క్రమంలోనే సాంకేతిక, నైతిక సవాళ్లను ఎదుర్కొంటూ ఇంటరాక్టివ్, ఏఐ శక్తితో కూడిన సహచరులను సృష్టించే లక్ష్యంతో ఉన్నారు.

తాజాగా ఈ విషయాలపై స్టార్ పెరీ టెక్నాలజీ సంస్థ స్పందించింది. ఇందులో భాగంగా... మేము నెక్స్ట్ జనరేషన్ సెక్స్ట్ డాల్స్ ను అభివృద్ధి చేస్తున్నాము.. ఇది వినియోగదరులతో మాటతోనూ, శారీరకంగానూ సంభాషించగలదు.. ఈ సంవత్సరం ఆగస్టు నాటికి ప్రోటోటైప్ లు ఎక్స్ పెక్ట్ చేయొచ్చని ఆ సంస్థ సీవో ఇవాన్ లీ తెలిపారు.