Begin typing your search above and press return to search.

జ‌ర్న‌లిస్టుతో అక్ర‌మ సంబంధం- కేంద్ర మంత్రిని చంపేశారా? చైనాలో ఏం జ‌రిగింది?

చైనాకే చెందిన అమెరికా పౌరురాలు(ఎన్నారై మాదిరిగా)తో చిన్‌గాంగ్‌కు వివాహేత‌ర సంబంధం ఉంద‌ని

By:  Tupaki Desk   |   25 July 2023 10:25 AM GMT
జ‌ర్న‌లిస్టుతో అక్ర‌మ సంబంధం- కేంద్ర మంత్రిని చంపేశారా?  చైనాలో  ఏం జ‌రిగింది?
X

అక్ర‌మ సంబంధాలు(వివాహేత‌ర‌) ఏ స్థాయిలో ఉన్నా.. ప్ర‌మాద‌మే. కింది స్థాయి నుంచి పై స్థాయి వ‌ర‌కు ఎవ‌రూ కూడా వీటి జోలికి వెళ్ల‌కుండా ఉంటేనే బెట‌ర్ అంటారు మేధావులు. ముఖ్యంగా మ‌న దేశంలో అయితే.. స‌రే.. కోర్టులు, విచార‌ణ‌లు.. త‌ర్వాత చ‌ర్య‌లు. కానీ, చైనా, ఉత్త‌ర‌కొరియా, ర‌ష్యా వంటి క‌మ్యూనిస్టు ప్ర‌భావిత దేశాల్లో అక్ర‌మ సంబంధాల‌ను తీవ్రంగా ప‌రిగ‌ణిస్తారు. ఉత్త‌ర కొరియాలో అయితే.. అక్ర‌మ సంబంధం పెట్టుకున్న‌వారికి విధించే ఏకైక శిక్ష‌.. సైనిక కుక్క‌ల‌కు వారిని దిగంబ‌రంగా ఆహారంగా వేయ‌డ‌మే!

ఇక‌, చైనాలోనూ ఇంత శిక్ష లేక‌పోయినా.. ఈ దేశంలోనూ క‌ఠినంగానే శిక్షిస్తున్నారు. అయితే.. చంపేస్తున్నార నే వాద‌న అయితే బ‌లంగా వినిపిస్తోంది. ఇప్ప‌టివ‌ర‌కు అక్ర‌మ సంబంధాలు పెట్టుకున్న‌వారిని పోలీసులు బ‌లవంతంగా అప‌హ‌రించ‌డం వ‌ర‌కే తెలుసు. త‌ర్వాత‌.. వారు క‌నిపించ‌డం లేదు.

దీనిని బ‌ట్టి అంత‌ర్జాతీ య సంస్థ‌లు వీరిని చంపేస్తున్నారా? అనే సందేహాలు వ్య‌క్తం చేస్తున్నాయి. తాజాగా చైనా విదేశాంగ మంత్రి కూడా.. గ‌త నెల రోజులుగా క‌నిపించ‌డం లేదు. వాస్త‌వానికి విదేశాంగ మంత్రి ఎప్పుడూ ఏదో ఒక సంద‌ర్భంలో మీడియా ముందుకు వ‌స్తారు.

అలాంటిది.. చైనా విదేశాంగ‌ మంత్రి 58 ఏళ్ల‌ చిన్‌గాంగ్ నెలరోజులుగా కనిపించటం లేదు. అనారోగ్యం కార‌ణంగా ఆయ‌న బ‌య‌ట‌కు రావ‌డం లేద‌ని కొంద‌రు చెబుతున్నా.. అస‌లు విష‌యం అదికాదంటూ .. తాజాగా అంత‌ర్జాతీయ మీడియా వెల్ల‌డించింది. చైనాకే చెందిన అమెరికా పౌరురాలు(ఎన్నారై మాదిరిగా)తో చిన్‌గాంగ్‌కు వివాహేత‌ర సంబంధం ఉంద‌ని.. వీరికి ఒక చిన్నారి కూడా ఉన్నాడ‌ని.. ఈ క్ర‌మంలోనే ఈ కుటుంబం కుంటుంబం కూడా క‌నిపించ‌డం లేద‌ని.. వీరిని చంపేసి ఉంటార‌ని మీడియా వ్యాఖ్యానిస్తోంది.

చిన్‌గాంగ్ కు అమెరికా పౌరసత్వమున్న చైనా జర్నలిస్టు ఫు షియోన్‌తో వివాహేతర బంధం ఉంది. 2022 మార్చిలో ఆమె చిన్‌గాంగ్‌నూ ఇంటర్వ్యూ చేశారు. అదే ఆమె చివరి ఇంటర్వ్యూ అని అంటారు. ఫు చైనాలో పుట్టినా అమెరికా పౌరురాలు. చిన్‌గాంగ్‌ ద్వారా ఈమెకు ఒక కుమారుడు జన్మించినట్లు మీడియా పేర్కొంది. ఫు, ఆమె కుమారుడు కూడా కొద్దికాలంగా కనిపించటం లేదు. వివాహేతర సంబంధాలను చైనా కమ్యూనిస్టు పార్టీ అనుమతించదు. ఎంతటివారైనా చైనాలో మాయమవుతుండటం సహజమ‌ని అంత‌ర్జాతీయ మీడియా పేర్కొంది. ఈ క్ర‌మంలో అటు విదేశాంగ మంత్రిని, ఇటు పు, ఆమె కుమారుడిని కూడా చంపేసి ఉంటార‌ని అనుమానిస్తున్నారు. ఏదేమైనా..ఇ ప్ప‌టికైతే అంతార‌హ‌స్యంగా ఉంది.