మస్క్‌కు సవాల్‌గా మారిన చైనా.. 'ఈవీ'ల్లో అద్భుతం!
కాగా, సరికొత్త 2025 జీక్ర్ '007 సెడాన్' వచ్చేవారం నుంచి అందుబాటులోకి రానుంది. దీనిలో ఈ సరికొత్త బ్యాటరీ అమర్చినట్లు పేర్కొంది.
By: Tupaki Desk | 15 Aug 2024 5:30 AM GMTఎలక్ట్రానిక్ వెహికల్స్(ఈవీ) కార్లలో తమకు తిరుగులేదని భావిస్తున్న ప్రపంచ కుబేరుడు, ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్‌కు చైనా భారీ షాకిస్తోంది. ఇప్పటి వరకు తమదే ఆధిపత్యంగా భావిస్తున్న మస్క్ కంపెనీ టెస్లాకు దిమ్మతిరిగే షాకిస్తూ.. అత్యంత వేగంగా చార్జింగ్ ఎక్కే బ్యాటరీలను చైనాకు చెందిన ప్రముఖ కంపెనీ జీక్ర్ సంస్థ ఆవిష్కరించింది. ఈ బ్యాటరీలు.. 15 నిమిషాల్లోనే ఫుల్లుగా చార్జింగ్ అయిపోతాయని కంపెనీ తెలిపింది. ఇప్పటి వరకు ఇంత వేగంగా చార్జింగ్ ఎక్కే బ్యాటరీలను సృష్టించక పోవడంతో ఇప్పుడు మస్క్ కంపెనీ టెస్లా ఆలోచనలో పడింది.
ఏం జరిగింది?
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కర్బన ఉద్గారాలను తగ్గించాలన్న లక్ష్యంతో దేశాలు ముందుకు సాగుతున్నాయి. ఈ క్రమంలో పెట్రోల్, డీజిల్ ఆధారిత వాహనాల వినియోగాన్ని 2030 నాటికి తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో ఈవీ వాహనాల దిశగా ప్రపంచ దేశాలు అడుగులు వేస్తున్నారు.దీంతో మస్క్ నేతృత్వంలోని టెస్లా.. దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈవీ వాహనాల తయారీలో దూకుడుగా ఉంది. ఈ వాహనాల్లో వినియోగించే బ్యాటరీలను కూడా అధునాతనంగా తయారు చేస్తున్నారు. అయితే.. ఇప్పటి వరకు తమదే పైచేయి అని టెస్లా చెబుతోంది. అంతేకాదు, టెస్లాకు చెందిన మోడల్ 3లో వాడే బ్యాటరీలకు 15 నిమిషాల సమయం పడుతుందని పేర్కొంది. ఇవి 282 కిలోమీటర్ల రేంజ్ ఇస్తాయని సంస్థ పేర్కొంది.
చైనా పోటీ..
కానీ, ఇప్పుడు ఈవీ వాహనాల బ్యాటరీల తయారీలోను, చార్జింగ్‌లోనూ.. చైనాకు చెందిన జీక్ర్ సంస్థ ముందుకు దూసుకుపోతోంది. ఈ సంస్థ అప్‌గ్రేడ్ చేసిన బ్యాటరీలు 10శాతం నుంచి 80శాతం ఛార్జింగ్‌కు కేవలం 15 నిమిషాల సమయం మాత్రమే పడుతున్నట్టు సంస్థ తెలిపింది. అంతేకాదు.. మరో చిత్రం ఏంటంటే మైనస్ 10 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలోనూ తమ బ్యాటరీలు ఏమాత్రం తగ్గకుండా పనిచేస్తాయని చెబుతోంది. కాగా, సరికొత్త 2025 జీక్ర్ '007 సెడాన్' వచ్చేవారం నుంచి అందుబాటులోకి రానుంది. దీనిలో ఈ సరికొత్త బ్యాటరీ అమర్చినట్లు పేర్కొంది.