Begin typing your search above and press return to search.

బాబోయ్ ఇదేం కక్కుర్తి.. తిని వదిలేసిన ఫుడ్ తో ఆయిల్ తయారీ

ఒక వినియోగదారుడు ఇచ్చిన ఫిర్యాదును తీసుకున్న చైనా అధికారులు సదరు రెస్టారెంట్ మీద దాడి చేసి.. తనిఖీలు నిర్వహించారు.

By:  Tupaki Desk   |   3 Jan 2025 6:30 AM GMT
బాబోయ్ ఇదేం కక్కుర్తి.. తిని వదిలేసిన ఫుడ్ తో ఆయిల్ తయారీ
X

విన్నంతనే వికారంగా అనిపించే ఈ దారుణం చైనాలో చోటు చేసుకుంది. ఊహించేందుకే మనసు రాని ఈ దారుణాన్ని సదరు రెస్టారెంట్ కొన్ని నెలలుగా విజయవంతంగా ఈ విధానాన్ని అమలు చేస్తున్న వైనం వెలుగు చూసి విస్తుపోయేలా చేస్తోంది. కస్టమర్లు మిగిల్చిన ఆహారం నుంచి నూనెను సేకరిస్తున్న సదరు రెస్టారెంట్.. ఆ నూనెతో కొత్త కస్టమర్లకు వండే ఆహారంలో వినియోగిస్తున్న అరాచకం వెలుగు చూసింది.

ఒక వినియోగదారుడు ఇచ్చిన ఫిర్యాదును తీసుకున్న చైనా అధికారులు సదరు రెస్టారెంట్ మీద దాడి చేసి.. తనిఖీలు నిర్వహించారు. అనంతరం సదరు రెస్టారెంట్ యజమాని తాను చేస్తున్న తప్పును ఒప్పుకోవటంతో ఈ వ్యవమారం ఇప్పుడు షాకింగ్ గా మారింది. ఎందుకిలా? చేస్తున్నావన్న ప్రశ్నకు సదరు హోటల్ యజమాని సమాధానం షాక్ కు గురి చేస్తోంది. తానీ పనంతా.. ఫుడ్ ఫ్లేవర్ కోసమే చేస్తున్నట్లుగా పేర్కొన్నాడు. ఇంతకీ ఈ ఆరాచక ఘటనకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది సిచువాన్ ప్రావిన్సులోని ఒక ప్రముఖ రెస్టారెంట్ కావటం గమనార్హం.

కస్టమర్లు మిగిల్చిన చిల్లీ ఆయిల్ సూప్స్జ. ఇతర ఆహార పదార్థాలను రీసైక్లింగ్ చేస్తోంది. దీంతో నూనెను సేకరించి.. సూప్స్ లోనూ.. ఇతర ఆహార పదార్థాల్లోనూ వినియోగిస్తోంది. ఈ విషయాన్ని గుర్తించిన ఒక కస్టమర్ అధికారులకు ఫిర్యాదు చేయటంతో అసలు విషయం వెలుగు చూసింది. ఈ తరహా ఆయిల్ కు సదరు రెస్టారెంట్ ఒక పేరు కూడా పెట్టేసింది. అదేమిటో తెలుసా? సలైవా ఆయిల్. ఇంత దారుణంగా నూనెలు సేకరించే విషయాన్ని అంగీకరించిన రెస్టారెంట్ యజమాని తాము గత సెప్టెంబరు నుంచి ఇలా చేస్తున్నట్లుగా పేర్కొన్నాడు.

కొత్త ఆయిల్ తో కలిపి వంటలు చేస్తున్నామని.. బిజినెస్ తగ్గిపోవటంతో వంటకాల రుచిని పెంచేందుకు ఇలా చేస్తున్నట్లు చెప్పిన అతగాడి మాటలు విన్నంతనే ఒళ్లు మండే పరిస్థితి. రీ సైకిల్ చేసిన ఆయిల్ ను సీజ్ చేసిన అధికారులు.. తదుపరి దర్యాప్తుకోసం స్థానిక పోలీసులకు కేసు బదిలీ చేశారు. ఈ తరహాలో గతంలోనూ కొన్ని దారుణ ఘటనలు వెలుగు చూశాయి. దీంతో.. ఇలాంటి వాటికి చెక్ పెట్టేందుకు 2009లో చైనా ఫుడ్ సేఫ్టీ చట్టాన్ని తీసుకొచ్చి.. భారీ జరిమానా.. జైలుశిక్షలు విధిస్తామని చెప్పినా.. ఈ తరహా ఘటనలు వెలుగు చూడటం ఇప్పుడు సంచలనంగా మారింది.