మార్స్ పై మహాసముద్రం గుర్తించిన చైనీస్ ఝరాంగ్ రోవర్..
ఖగోలాల గురించి.. ఇతర గ్రహాలలో వాతావరణాల గురించి తెలుసుకోవడానికి అధ్యయనాలు ఎన్నో సాగుతున్నాయి.
By: Tupaki Desk | 8 Nov 2024 5:11 AM GMTమనం ఉన్న ఈ భూమి అనంత విశ్వంలో ఓ చిన్న అణువుతో సమానం. మనకు తెలియని రహస్యాలు అంతరిక్షంలో ఎన్నో దాక్కుని ఉన్నాయి. కొన్ని సంవత్సరాలుగా ఈ రహస్యాలను ఛేదించడానికి అన్ని దేశాలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఖగోలాల గురించి.. ఇతర గ్రహాలలో వాతావరణాల గురించి తెలుసుకోవడానికి అధ్యయనాలు ఎన్నో సాగుతున్నాయి. మన సౌర మండలంలో కేవలం భూమి మీద మాత్రమే జల నిలవలు ఉన్నాయి అన్న మాటను శాస్త్రవేత్తలు ఎప్పటినుంచో ఖండిస్తున్నారు. తాజాగా చైనా అంగారకుడిపై కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం ఉన్న మహా సముద్రం ఆనవాళ్లను కనుగొన్నామని పేర్కొంటుంది.
పురాతన చైనీస్ ఖగోళ శాస్త్రాల ప్రకారం మార్స్ ప్లానెట్ ను ఫైర్ స్టార్ అని పిలుస్తారు. మనం ఈ ప్లానెట్ను అంగారకుడు అంటాం. ఈ రెడ్ ప్లానెట్ కు సంబంధించి ఎన్నో మిస్టరీస్ ఇప్పటికీ సాల్వ్ కాలేదు. ఎన్నో దేశాలు డజన్ల కొద్ది అంతరిక్ష నౌకలను అంగారక గ్రహం పై పంపారు.. ఇప్పటికీ పంపుతూనే ఉన్నారు. ఎంత ప్రయత్నించినా అంగారక గ్రహానికి సంబంధించిన రహస్యాలు ఇంకా ఛేదించలేకపోతున్నాము.
అయితే తాజాగా చేయనా కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం ఈ అంగారక గ్రహం పై ఒక మహా సముద్రం ఉండేది అని తన పరిశోధనలతో తేల్చి చెప్పింది. చైనా అంగారకుడు పైకి పంపిన ఝరాంగ్ రోవర్ దీనికి సంబంధించిన కొన్ని ఆధారాలను సేకరించినట్లు వాళ్లు వెల్లడిస్తున్నారు. మార్టిన్ ఉత్తర అర్ధగోళంలోని ఉటోపియా ప్రాంతంలో ఈ రోవర్ 20201లో ల్యాండ్ అయింది. అప్పటినుంచి ఇది మార్టిన్ ఉపరితలాన్ని పరిశీలిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ రోవర్ పంపిన కొంత డేటా అక్కడ కొన్ని సంవత్సరాల క్రితం ఇంకిపోయిన సముద్రాన్ని సూచిస్తున్నట్లుగా శాస్త్రవేత్తలు గుర్తించారు.
మార్స్ పై ఉన్న ఉటోపియా ప్లానిషియా అనే ప్రాంతంలో ఓ పురాతన మహాసముద్రం ఉండేది అని తమ ఝరాంగ్ రోవర్ గుర్తించినట్లు చెబుతున్నారు. సుమారు 3.42 బిలియన్ల సంవత్సరల క్రితం కొన్ని తెలియని కారణాలవల్ల ఆ సముద్రం ఎండిపోయి ఇంకిపోయిందట. అంతేకాదు ఆ సముద్రం ఉన్న సమయంలో అక్కడ సూక్ష్మజీవులు కూడా ఉండే అవకాశం ఉంది అని వారు తెలుపుతున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తామని.. ఇంకా దీనిపై పరిశోధన కొనసాగుతోందని చైనా పేర్కొంటుంది.