Begin typing your search above and press return to search.

బిగ్ బ్రేక్ త్రూ... చనిపోయిన మెదడును తిరిగి బ్రతికించారు!

చనిపోయిన మెదడును 50 నిమిషాల తర్వాత బ్రతికించిన అరుదైన ఘటన తాజాగా జరిగింది.

By:  Tupaki Desk   |   25 Oct 2024 4:25 AM GMT
బిగ్ బ్రేక్ త్రూ... చనిపోయిన మెదడును తిరిగి బ్రతికించారు!
X

శాస్త్రం ఊహించని స్థాయిలో అభివృద్ధి చెందుతుందనే మాటలు ఈ శతాబ్ధంలో బలంగా వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. మనిషికి చావులేకుండా చేయడం మినహా మిగిలినవన్నీ సాధ్యమే అనే స్థాయిలో సైన్స్ డెవలప్ అవుతుందని అంటున్నారు. ఈ సమయంలో... చనిపోయిన మెదడును 50 నిమిషాల తర్వాత బ్రతికించిన అరుదైన ఘటన తాజాగా జరిగింది.

అవును... చైనా పరిశోధకులు సరికొత్త ఘనతను సాధించారు. గుండెపోటు తర్వాత రోగులకు పునరుజ్జీవనం అందించడంలో సహాయపడే ప్రయోగంలో ఓ అడుగు ముందుకు వేశారు! ఇందులో భాగంగా.. ఓ ప్రయోగంలో చనిపోయిన తర్వాత పంది మెదడును తొలగించి.. సుమారు ఓ గంట తర్వాత దానిని పునఃప్రరంభించినట్లు చైనా శాస్త్రవేత్తలు చెప్పారు.

గుండెపోటు వల్ల మెదడు దెబ్బతినడాన్ని సరిచేసే ప్రక్రియలో కాలేయం కీలక పాత్ర పోషిస్తుందని పరిశోధన హైలైట్ చేస్తుందని తెలిపారు. గ్యాంగ్ జౌ లోని సన్ యాట్ సేన్ యూనివర్శిటీ అనుబంధ ఆసుపత్రి పరిశోధకులు.. పంది మెదడులోని నాడీ కార్యకలాపాలను శరీరం నుంచి తొలగించిన తర్వాత పునరుద్దరించడానికి లైఫ్ సపోర్ట్ సిస్టం ను ఉపయోగించారు.

ఈ హాస్పిటల్ లోని అవయువ మార్పిడి కేంద్ర డైరెక్టర్ హే జియోషున్ నేతృత్వంలో జరిగిన ఈ పరిశోధనలో... జర్మన్ ట్రాన్స్ ప్లాంటేషన్ సొసైటీ మాజీ ప్రెసిడెంట్ జోయెర్న్ నాషన్, క్లీవ్ ల్యాండ్ క్లీనిక్ లోని ఇమ్యునిటీ స్పెషలిస్ట్ ఆండియా వంటి అంతర్జాతీయ సహకారులు పాల్గొన్నారు.

లివర్ అసిస్టెడ్ బ్రెయిన్ నార్మోథర్మిక్ మెషిన్ పెర్ఫ్యూజన్ (ఎన్.ఎం.పీ) అని పిలిచే "ఎక్స్ వివో బ్రెయిన్ మెయింటినెన్స్" సాంకేతికతను ఈ బృందం అభివృద్ధి చేసింది. ఇది.. కృత్రిమ గుండె, ఊపిరితిత్తులను కలిగి ఉండటమే కాకుండా.. పంది కాలేయాన్ని రక్తప్రసరణలో అనుసంధానిస్తుంది.

ఈ నేపథ్యంలో పరిశోధకులు పందులకు మత్తుమందు ఇచ్చి వాటి మెదడులను వేరు చేయడాని ఆపరేషన్ చేశారు. ఈ సమయంలో మెదడు మాత్రమే ఎన్.ఎం.పీ. కి కనెక్ట్ చేయబడింది. ఈ సమయంలో మెదడు తరంగాలు శరీరం నుంచి తొలగించబడిన 50 నిమిషాల తర్వాత.. ఆ తరంగాలు తిరిగి మెదడుకు వచ్చినట్లు వెల్లడించారు!

ఈ సందర్భంగా స్పందించిన ప్రధాన పరిశోధకుడు జిన్ హువా.. ఈ అధ్యయనం గుండెపోటు రోగులను పునరుద్ధరించడానికి కొత్త వ్యూహాలను సూచిస్తుందని.. మెదడు శాస్త్ర పరిశోధన కోసం కొత్త మార్గాలను అందిస్తుందని.. మార్పిడి చేయబడిన అవయువాల మనుగడను మెరుగుపరిచే పద్దతులను సమర్థవంతంగా మెరుగుపరుస్తుందని అన్నారు.