Begin typing your search above and press return to search.

మూత్రం తాగితే దుష్టశక్తులు దూరమవుతాయట.. ఎక్కడో తెలుసా?

ఆ దేశంలో మనిషి తినని జీవి ఉండదని అంటుంటారు. ఈ క్రమంలో మూత్రం తాగితే కలిగే ప్రయోజనాలు అనే అంశం తెరపైకి వచ్చింది.

By:  Tupaki Desk   |   16 Sep 2024 7:30 PM GMT
మూత్రం తాగితే దుష్టశక్తులు దూరమవుతాయట.. ఎక్కడో తెలుసా?
X

మూత్రం తాగితే దుష్టశక్తులు దూరమవుతాయని.. మూత్రంలో గుడ్లు ఉడకబెట్టుకుని తింటే రక్తప్రసరణ సరిగా జరుగుతుందని.. బాలురి మూత్రంలో వివిధ ఆధ్యాత్మిక శక్తులు ఉన్నాయని చాలా కాలంగా చైనీయులు నమ్ముతున్నారట. ఆ దేశంలో మనిషి తినని జీవి ఉండదని అంటుంటారు. ఈ క్రమంలో మూత్రం తాగితే కలిగే ప్రయోజనాలు అనే అంశం తెరపైకి వచ్చింది.

అవును... ఆహారం, పానియాల విషయంలో ప్రపంచంలోని ఇతర దేశాల కంటే చాలా భిన్నంగా ఉంటుందనే పేరు చైనాకు ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఓ షాకింగ్ ఘటన తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా.. 10 ఏళ్ల లోపు వయసున్న అబ్బాయిల మూత్రాన్ని సేకరిస్తున్నారంట.

పైగా నవజాత అబ్బాయికి ఒక నెల వయసు వచ్చె ఓక రోజు ముందు మూత్రం అత్యంత విలువైనదిగా భావిస్తున్నారట. ఈ సంప్రదాయం చైనాలో ఎప్పటి నుంచో ఉందని చెబుతున్నారు. ఈ క్రమంలోనే బాలురి మూత్రంలో వివిధ ఆధ్యాత్మిక శక్తులు ఉన్నాయని చైనీయులు చాలా కాలంగా నమ్ముతున్నారంట.

ఈ బాలురి మూత్రంలో జ్వరాన్ని తగ్గించే శక్తితో పాటు.. యౌవ్వనాన్ని పెంచే శక్తి ఉంతుందని వారు నమ్ముతారట. ఇదే క్రమంలో... దుష్టశక్తులను దూరంగా ఉంచే శక్తి కూడా బాలురి మూత్రానికి ఉందని నమ్ముతారట. ఇక మింగ్ రాజవంశానికి చెందిన చక్రవర్తి 13వ శతాబ్ధంలో నిత్య జీవితం కోసం అమృతం తయారు చేయడంలో దీన్ని ఉపయోగించారని చెబుతున్నారు.

ఇక జియాంగ్ లో మూత్రంతో ఏకంగా వంటనే చేస్తారంట. ఈ క్రమంలోనే డాంగ్ యాంగ్లో అనే ప్రాంతాల్లో 10ఏళ్ల లోపు బాలురి మూత్రంలో ఉడకబెట్టిన గుడ్లను తింటారట. వీటితో ప్రత్యేక ఆహార పదార్ధాలను చేస్తారంట. వీటిని విర్గిన్ బోయ్ ఎగ్గ్ అనే పేరుతో తెగ తినేస్తారంట చైనీయులు. ఈ డిష్ చాలా ఫేమస్ అంట.

ఇలా బాలురి మూత్రంతో ఉడకబెట్టిన గుడ్లు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చైనీయులు బలంగా నమ్ముతారట. ఇందులో భాగంగా... ఈ ఆహార పదార్థాలను తినడం వల్ల రక్త ప్రసరణ సరిగా జరిగేలా చుస్తుందని.. ఆస్తమా తగ్గుతుందని.. శరీరంలో వేడిని తగ్గించడంలోనూ వీటి పాత్ర కీలకం అని చైనీయులు నమ్ముతారంట.