పార్క్ లో వేళాడుతున్న పెళ్లి రెజ్యూమెలు... కొత్తగా ఆలోచించారా?
అవును... తమ పిల్లల వివాహాల విషయంలో ఆందోళన చెందుతున్న తల్లితండ్రులు వారికి సరైన జోడీని కనుగొనడానికి వీకెండ్స్ లో పబ్లిక్ పార్కుల్లో కలుస్తారని స్థానిక మీడియా వెల్లడించింది.
By: Tupaki Desk | 29 Oct 2024 4:16 AM GMTసాధారణంగా గ్రామాల్లో బందువులతో సంబంధం కలుపుకోవడం, పెళ్లిల్ల పేరయ్యల్లు కుదిర్చిన సంబంధాలతో ఎక్కువగా పెళ్లిల్లు జరుగుతుంటాయి. ఇక పట్టణాల్లో అయితే మ్యాట్రిమొనీ సైట్లలో కుదిరిన సంబంధాలు సెట్ అవుతుంటాయి! రెండు ప్రాంతాల్లోనూ ప్రేమ వివాహాలు కామన్! అయితే... సరికొత్తగా ఆలోచించిన చైనీయులు... పార్క్ లో పెళ్లి రెజ్యూమెలు వేలాడదీస్తున్నారు.
అవును... తమ పిల్లల వివాహాల విషయంలో ఆందోళన చెందుతున్న తల్లితండ్రులు వారికి సరైన జోడీని కనుగొనడానికి వీకెండ్స్ లో పబ్లిక్ పార్కుల్లో కలుస్తారని స్థానిక మీడియా వెల్లడించింది. ఈ సమయంలో వారి వారి పిల్లల రెజ్యూమెలతో.. తల్లితండ్రులు ప్రతీ వారంతంలో మ్యాచ్ కోసం షాంఘై పీపుల్స్ పార్క్ లో కలుస్తారట. చైనాలోని చాలా పట్టణాల్లో ఈ తరహా వ్యవహారాలు నడుస్తున్నాయని అంటున్నారు.
ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే... పట్టణ చైనీస్ మహిళలు వివాహం చేసుకునే సగటు వయసు 1950ల్లో 20 ఏళ్ల లోపు మాత్రమే ఉండగా.. 1980 నాటికి అది 25ఏళ్లకు, ఇప్పుడు సుమారు 27 ఏళ్లకు పెరిగిందని అంటున్నారు. ఇక 30 ఏళ్లు పైబడిన స్త్రీలు వివాహం చేసుకోవాలనే తీవ్రమైన ఒత్తిడి గురవుతారని అంటున్నారు. దీంతో... వారి వారి తల్లితండ్రులు ఈ తరహా పార్క్ ప్రయత్నాలు చేస్తుంటారని అంటున్నారు!
మరోపక్క చాలా మంది చైనా మహిళలు ఒంటరిగా ఉండటాన్ని ఎంచుకుంటున్నారని అంటున్నారు. దీంతో... వారు పలు విమర్శలను ఎదుర్కోంటున్నారని చెబుతున్నారు. ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాలు అయితే వివాహం చేసుకోలేని పురుషులతో నిండి ఉన్నాయని నివేదిక వెల్లడించింది. దీనికి పలు బలమైన కారణాలు ఉన్నాయని చెబుతోంది.
ఇందులో భాగంగా... చాలా మంది మహిళలు నిజమైన ప్రేమ, డౌన్ టు ఎర్త్ అవకాశాలకు బదులుగా.. పెద్ద ఇళ్లు, లగ్జరీ కార్లు ఉన్న పురుషులను కనుగొనడంపైనే అధిక దృష్టి కేంద్రీకరిస్తున్నారని అరోపణలు వస్తున్నాయి. దీనికి చైనీస్ టైలివిజన్ లోని డేటింగ్ షో బలం చేకూర్చిందని చెబుతున్నారు.