Begin typing your search above and press return to search.

భార్య కోసం రోజూ వందల కి.మీ. ప్రయాణం.. కేరింగ్ కారణం!

వివరాళ్లోకి వెళ్తే... చైనాకు చెందిన లిన్ షు అనే వ్యక్తి తాను డైలీ ఇంటి నుంచి ఆఫీసుకు 320 కిలోమీటర్లు ప్రయాణిస్తున్నట్లు సోషల్ మీడియాలో వెల్లడించాడు.

By:  Tupaki Desk   |   20 July 2024 3:30 PM GMT
భార్య కోసం రోజూ వందల కి.మీ. ప్రయాణం.. కేరింగ్  కారణం!
X

"ప్రేమ ఏమైనా చేయిస్తుంది.. ఎంత దూరమైనా తీసుకెళ్తుంది".. అంటున్నాడు ఓ భర్త. సాధారణంగా ప్రేమలో ఉన్నప్పుడు ప్రేమ చాలా బాగుంటుంది.. పెళ్లిగా మారిన తర్వాత ఒకరిపై ఒకరికి ప్రేమ తగ్గిపోతుంది అనే మాటలకు ఇతడు పూర్తి వ్యతిరేకం.. అది పూర్తిగా నిజం కాదని చెప్పడానికి ఇతడొక తాజా ఉదాహరణ కూడా!

అవును... టీనేజ్ లో ఉన్నప్పుడు ప్రేమించిన అమ్మాయి కోసం ప్రేమికుడు ఏమైనా చేసేస్తుంటాడు.. అప్పుడు ఏదీ అతనికి అసాధ్యం అనిపించదు.. సముద్రాన్ని ఈదేస్తానని.. ఎవరెస్టును ఎక్కేస్తానని.. చెబుతుంటాడు కానీ... పెళ్లి అయ్యాక మాత్రం మాటలు, చేతలూ మారిపోతుంటాయని చెబుతుంటారు పలువురు!! అయితే ఇప్పుడు చెప్పుకోబోయే వ్యక్తి మాత్రం భార్య క్షేమం కోసం చేసే పని ఔరా అనిపించకమానదు.

వివరాళ్లోకి వెళ్తే... చైనాకు చెందిన లిన్ షు అనే వ్యక్తి తాను డైలీ ఇంటి నుంచి ఆఫీసుకు 320 కిలోమీటర్లు ప్రయాణిస్తున్నట్లు సోషల్ మీడియాలో వెల్లడించాడు. ఈ సందర్భంగా అతడు ఓ వీడియోను షేర్ చేశాడు. అందులో.. అతడు ఉదయం 5 గంటలకు నిద్రలేచి ఇంటి నుంచి 5:20కి బయలుదేరతాడు. అలా స్టార్ట్ అవుతుంది అతని రోజు!

అలా 5:20కి ఇంటి నుంచి బయలుదేరి 6:15కి రైల్వే స్టేషన్ కు చేరుకుంటానని తెలిపాడు. అక్కడ నుంచి 7:46 గంటలకు కింగ్ డావోకు చేరుకొని అక్కడ నుంచి 15 నిమిషాల పాటు భూగర్భ సబ్ వేలో ప్రయాణించి ఆఫీసుకు చేరుకుంటానని వెల్లడించారు. ఈ విధంగా 320 కి.మీ. ప్రయాణిస్తున్నట్లు చెప్పాడు. అందుకు ఓ బలమైన కారణం ఉందని తెలిపాడు.

ఇందులో భాగంగా... ఏడేళ్లుగా ప్రేమించిన అమ్మాయిని ఇటీవల వివాహం చేసుకున్నాడట లిన్ షు. వారు నివసిస్తున్న ఫ్లాట్ వైఫాంగ్ లో ఉందంట. అయితే.. అది ఆమె స్వస్థలం కావడంతో అక్కడ ఆమె భద్రంగా ఉంటుందనే ఆలోచనతో ఈ సుదీర్ఘమైన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు.

అయితే.. తన భార్య కింగ్ డావోలో జాబ్ వెతుకుతున్నందున తన ప్రయాణం కొన్ని రోజులే అని చెబుతున్నాడు. ఇలా తన స్టోరీ మొత్తం చెబుతూ లిన్ షు చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతూ.. అతడిని అభినందిస్తున్నారు.. "ప్రేమ"ను పొగుడుతున్నారు.

ఇందులో భాగంగా... "ప్రేమ ఏమైనా చేయిస్తుంది.. ఎంత దూరమైనా తీసుకెళ్తుంది" అని ఒకరంటే... "ఇటువంటి త్యాగశీల ప్రేమికులు చాలా మందే ఉంటుంటారు" అని మరొకరు స్పందించారు. "పెళ్లికి ముందు సంగతి సరే... పెళ్లి అయిన తర్వాత ఇలా ప్రేమిస్తున్నాడు.. ఆమె చాలా లక్కీ"... మరికొంతమంది నెటిజన్ల రియాక్షన్!