Begin typing your search above and press return to search.

'సారీ బాబూ'... కేశినేని నానీ కామెంట్స్ పై చిన్ని రియాక్షన్!

ఇదే సమయంలో ఇటీవల కేశినేని నానీ ఈ విషయాలపై తన వాయిస్ ని బలంగానే వినిపిస్తున్నాయి.

By:  Tupaki Desk   |   11 Jan 2024 6:55 AM GMT
సారీ బాబూ... కేశినేని నానీ  కామెంట్స్  పై చిన్ని రియాక్షన్!
X

నిన్నమొన్నటి వరకూ జిల్లాల్లో తప్ప పెద్దగా బయట ప్రపంచానికి తెలియని కేశినేని అన్నాతమ్ముళ వ్యవహారం గతకొన్ని రోజులుగా పూర్తిగా పబ్లిక్ ప్లాట్ ఫాం మీదకు వచ్చేసిన సంగతి తెలిసిందే! ఈ క్రమంలో తన బాబాయ్ కేశినేని చిన్ని గురించి మీడియా ప్రశ్నిస్తే... కొంతమంది గురించి స్పందించి తన విలువ తగ్గించుకోనంటూ కేశినేని నాని కుమార్తె శ్వేత స్పందించిన సంగతి తెలిసిందే.

ఇదే సమయంలో ఇటీవల కేశినేని నానీ ఈ విషయాలపై తన వాయిస్ ని బలంగానే వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో తాజాగా వైసీపీ అధినేత జగన్ తోనూ భేటీ అయ్యారు. అనంతరం మీడియా ముందు సంచలన విషయాలు వెల్లడించారు. ఈ నేపథ్యంలో కేశినేని చిన్ని రియాక్ట్ అయ్యారు. ఇందులో భాగంగా పలు కీలక విషయాలు వెల్లడించారు.

అవును... కేశినేని నానీ చేసిన వ్యాఖ్యలపై తాజాగా ఆయన తమ్ముడు చిన్ని స్పందించారు. ఇందులో భాగంగా... కుటుంబ విషయాలూ, పార్టీ విషయాలు కలపకూడదనే ఉద్దేశ్యంతోనే ఇప్పటివరకూ మీడియా ముందు ఈ విషయాలు మాట్లాడలేదని అన్నారు. తన భార్య, కుమారుడి విషయంలో కూడా ఎన్నో ఇబ్బందులు పెట్టారని.. అయినా కూడా తానెప్పుడు ఫ్యామిలీ విషయాలు బయటకు తేలేదని అన్నారు.

ఇదే సమయంలో తమ కుటుంబంలో ఉన్న సమస్యలకు చంద్రబాబు కారణం అంటూ నానీ చేసిన వ్యాఖ్యలకు ఈ సందర్భంగా తాను క్షమాపణలు చెబుతున్నట్లు చిన్ని వెల్లడించారు. ఇదే సమయంలో ఒక మాజీ ముఖ్యమంత్రి మనవడు, ఒక మాజీ ముఖ్యమంత్రి తనయుడు అనేది లోకేష్ స్థాయి అని... తమ కుటుంబ స్థాయి లోకేష్ స్థాయి గురించి విమర్శించేటంతది కాదని చిన్ని తెలిపారు.

అనంతరం... చంద్రబాబుని, లోకేష్ ని, టీడీపీ కార్యకర్తలను విమర్శిస్తే తప్పకుండా తగిన శాస్తి అనుభవిస్తారని.. ఇప్పటికైనా ఇలాంటి వ్యాఖ్యలు చేయరాదని విన్నవించుకుంటున్నట్లు చిన్ని తెలిపారు. ఇదే సమయంలో తమ కుటుంబానికి 1999 నుంచి సమస్యలు ఉంటూనే ఉన్నాయని.. వాటికీ చంద్రబాబుకు ఎలాంటి సంబంధం లేదని చిన్ని పునరుధ్గాటించారు.

ఇదే క్రమంలో... పార్టీనుంచి మహా మహులు బయటకు వెళ్లిపోతేనే టీడీపీ ఖాళీ అవ్వలేదని, 2019 నుంచి ఎన్నో కేసులు, మరెన్నో దాడులు జరుగుతునే ఉన్నాయని.. అయినప్పటికీ కార్యకర్తలు పార్టీని ముందుండి నడిపిస్తున్నరని అన్నారు.