బాబు అరెస్ట్ కేసులో బీజేపీని ఇరికించిన కాంగ్రెస్ నేత
ఇక చంద్రబాబుకు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించడం పట్ల కూడా ఆయన కొన్ని కామెంట్స్ చేశారు
By: Tupaki Desk | 14 Sep 2023 12:08 PM GMTకాంగ్రెస్ పార్టీకి ఏపీకి లో ఉన్న నాయకులలో ఒకరు కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్. ఆయన ఏపీలో వైసీపీని కేంద్రంలో బీజేపీని సరిసమానంగా విమర్శిస్తూంటారు. కేంద్రంలో ఏపీలో అధికారంలోకి వచ్చేది పక్కాగా కాంగ్రెస్ అని నొక్కి వక్కాణిస్తూంటారు. ఆయన తరచూ సంచలన ప్రకటనలే చేస్తారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు అరెస్ట్ వెనక ఢిల్లీ హస్తం ఉందని డైరెక్ట్ గా ఆరోపించారు ఒక మాజీ ముఖ్యమంత్రిని వేకువ జామున అరెస్ట్ చేయడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదని అన్నారు.
ఢిల్లీ వారి సపోర్ట్ లేకపోతే ఇది జరగదని ఆయన తేల్చేసారు. చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ కేసులో అసలు నిందితుడే కాదని కూడా ఆయన అంటున్నారు. చంద్రబాబు ఏ తప్పూ చేయరని చింతా తానుగా చెప్పేశారు. అలాంటివే స్కాములుగా తీసుకుంటే ఎవరూ ముఖ్యమంత్రులుగా అసలు పనిచేయలేరని కూడా ఆయన అంటున్నారు.
ఇక చంద్రబాబుకు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించడం పట్ల కూడా ఆయన కొన్ని కామెంట్స్ చేశారు. తీర్పు దారుణంగా ఉందని సరిగ్గా లేదని ఆయన అంటున్నారు. చంద్రబాబుకు సుప్రీం కోర్టులో న్యాయం తప్పకుండా జరుగుతుంది అని ఆయన అంటున్నారు.
కాగా ఇటీవల కాలంలో వస్తున్న కొన్ని తీర్పులు సరిగ్గా ఉండడం లేదని చింతా మోహన్ అనడం విశేషం. వీటి మీద ప్రజలలో కూడా అనుమానాలు ఉన్నాయని ఆయన చెబుతున్నారు. ఇక చూస్తే పార్లమెంట్ కి అసెంబ్లీకి కలిపి ఒకేసారి డిసెంబర్ లో ఎన్నికలు వస్తాయని ఏపీ అసెంబ్లీ రద్దు చేసి జగన్ ఎన్నికలకు వెళ్లవచ్చు అని చింతా అంటున్నారు.
అంతే కాదు డిసెంబర్ లో జరిగే అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతుందని కూడా ఆయన జోస్యం చెబుతున్నారు. మొత్తం మీద చూస్తే కాంగ్రెస్ నేతగా కేంద్ర మంత్రిగా చింతా మోహన్ చేసిన ఈ కామెంట్స్ ఆసక్తికరంగా ఉన్నాయి. ఏపీలో బీజేపీని లేకుండా చేసి ఇండియా కూటమి కాలూనడానికి చేసే ప్రయత్నంలో భాగంగా చింతా ఈ వ్యాఖ్యలు చేశారా అన్న చర్చ వస్తోంది.
ఇక ఏపీలో టీడీపీ జనసేన ఇప్పటికే పొత్తులు పెట్టుకున్నాయి. బీజేపీ కలవకపోతే ఈ కూటమిలో కమ్యూనిస్టులు చేరే అవకాశాలు మెండుగా ఉంటాయి. అపుడు కాంగ్రెస్ కూడా కలిస్తే ఏపీలో ఇండియా కూటమి రెడీ అయినట్లే. మొత్తానికి ఫ్యూచర్ యాక్షన్ ప్లాన్ ఏదైనా ఉండబట్టే కాంగ్రెస్ చింతా మోహన్ చేత ఈ కామెంట్స్ చేయించిందని ఫలితంగా టీడీపీకి దగ్గర కావాలని చూస్తోంది అని అంటున్నారు చూడాలి మరి చింతా చేసిన ఈ కామెంట్స్ ఏపీ రాజకీయాలలో ఎలా మార్పులు తెస్తాయో.