చింతమనేని వర్సెస్ వైసీపీ.. రోడ్డున పడ్డారే!
టీడీపీ ఫైర్ బ్రాండ్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వర్సెస్ వైసీపీ మధ్య తలెత్తిన వివా దం తీవ్ర స్తాయికి చేరింది
By: Tupaki Desk | 31 Jan 2024 9:11 AM GMTటీడీపీ ఫైర్ బ్రాండ్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వర్సెస్ వైసీపీ మధ్య తలెత్తిన వివాదం తీవ్ర స్తాయికి చేరింది. తన నియోజకవర్గం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని దెందులూరులో అక్ర మాలు సాగనివ్వనంటూ.. చింతమనేని ఇటీవల కాలంలో నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఈ క్రమం లో ఇసుక్ర అక్రమాల వ్యవహారం గత రాత్రి నుంచి దుమారం రేపుతోంది. పెదవేగి మండలం లక్ష్మీపురం వద్ద మంగళవారం రాత్రి గ్రావెల్ అక్రమ త్రవ్వకాలను చింతమనేని ప్రభాకర్ అడ్డుకున్నారు.
చింతమనేని రాకతో లోడింగ్ పాయింట్ వద్దే టిప్పర్లు, జేసిబిలు వదిలేసిన మాఫియా అక్కడ నుంచి పరా రైంది. దీంతో ఈ అక్రమ గ్రావెల్ త్రవ్వకాలపై ఆర్డీవో కు సమాచారం ఇచ్చి చర్యలు తీసుకోవాలని చింత మనేని చెప్పారు. ఆ వెంటనే ఆయన వెళ్లిపోయారు. ఇంతలో ఘటనా ప్రాంతానికి చేరుకున్న పెదవేగి ఎస్సై స్వామి, రెవెన్యూ శాఖ సిబ్బంది వివరాలు నమోదు చేసుకుంటుండగా.. ఒక్కసారిగా దూసుకొచ్చిన సుమారు 300 మంది స్థానిక ఎమ్మెల్యే అనుచరులు.. పోలీస్ సమక్షంలోనే టీడీపీ నాయకులు, చింతమనేని అనుచరులపై కర్రలు, రాడ్లతో దాడికి తెగబడ్డారు.
ఈ దాడిలో టిడిపి సీనియర్ నాయకులు తాతా సత్యనారాయణ సహా పలువురు నాయకులు తీవ్రంగా గాయపడ్డారు. దాదాపు గంటన్నర పైగా సాగిన పరస్పర ఫైటింగ్ లో చింతమనేని వర్గం తీవ్రంగా గాయ పడింది. ఈ దాడిలో ధ్వంసమైన కార్లను తెల్లవారుజామున ఘటనా ప్రాంతం నుంచి పోలీసులు క్రేన్లతో తొలగించారు. కాగా. ఈ దాడి ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఎప్పుడు ఏం జరుగుతుందో అన్నట్టుగా పోలీసులు పహారాను పెంచారు. ఇదిలావుంటే.. ఎన్నికలకు ముందే ఇలా హీటెక్కితే.. వచ్చే ఎన్నికల నాటికి నియోజకవర్గం పరిస్థితి ఏంటనేది స్థానికుల మాట.