Begin typing your search above and press return to search.

‘నాయకుడొచ్చాడన్న నమ్మకం బలపడింది’... పవన్ పై చిరు కామెంట్స్ వైరల్!

పిఠాపురం నియోజకవర్గంలోని చిత్రాడ గ్రామం వద్ద 50 ఎకరాల ప్రాంగణంలో "జయకేతనం" పేరుతో జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభ జరిగిన సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   15 March 2025 10:25 AM IST
‘నాయకుడొచ్చాడన్న నమ్మకం బలపడింది’... పవన్ పై చిరు కామెంట్స్ వైరల్!
X

పిఠాపురం నియోజకవర్గంలోని చిత్రాడ గ్రామం వద్ద 50 ఎకరాల ప్రాంగణంలో "జయకేతనం" పేరుతో జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభ జరిగిన సంగతి తెలిసిందే. ఈ సభలో అశేషంగా తరలివచ్చిన జనసైనికులను ఉద్దేశించి ఆ పార్టీ అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాన్ ప్రసంగించారు. ఈ సందర్భంగా పార్టీ ప్రస్థానం గురించి, రాష్ట్ర రాజకీయాల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

అవును... పిఠాపురంలో శుక్రవారం నిర్వహించిన జనసేన పార్టీ ఆవిర్భావ సభలో అశేషంగా తరలివచ్చిన పార్టీ కార్యకర్తలను, అభిమానులను ఉద్దేశించి పవన్ కల్యాణ్ ప్రసంగించారు. ఈ సందర్భంగా పలు సంచలన వ్యాఖ్యలే చేశారు. ఇందులో భాగంగా... పదకొండేళ్ల జనసేన ప్రస్థానాన్ని, ఎదుర్కొన్న కష్టాలను, పార్టీని నిలబెట్టిన విధానాన్ని వివరించారు.

ప్రధానంగా... సామాజిక, రాజకీయ అంశాలపై అవగాహన లేకుండానే పార్టీ పెట్టేస్తామా? అని మొదలుపెట్టిన పవన్... పార్టీ పెట్టాలంటే తండ్రి ముఖ్యమంత్రి అయ్యుండాలా? బాబాయ్ ని చంపించి ఉండాలా? దశాబ్ధంపాటు ఒంటరిగా పార్టీని మోయాలంటే ఎన్ని తిట్లు, ఎన్ని అవమానాలు భరించాలి? ఎంత జ్వలించాలి? అంటూ ప్రశ్నించిన విధానం హైలైట్ గా నిలిచిందని అంటున్నారు!

ఈ స్థాయిలో పిఠాపురంలో జరిగిన పార్టీ 12వ ఆవిర్భావ సభలో పవన్ కల్యాణ్ ప్రసంగం సాగింది. తనదైన ఆవేశంతో, తనదైన శైలి పద ప్రయోగాలతో జనసేన కార్యకర్తలను ఉత్సాహ పరుస్తూ, ఆలోచింప చేస్తూ జనసేన అధినేత ప్రసంగం ఆధ్యాంతం ఆసక్తిగా మారింది. ఈ సమయంలో పవన్ ప్రసంగానికి జనసైనికులే కాదు తాను ఫిదా అయ్యానంటూ చిరు స్పందించారు.

అవును... పిఠాపురం వేదికగా ఆధ్యాంతం అత్యంత ఆసక్తిగా, రసవత్తరంగా సాగిన పవన్ కల్యాణ్ ప్రసంగంపై మెగాస్టార్, మాజీ కేంద్రమంత్రి, పవన్ కల్యాణ్ పెద్ద అన్నయ్య చిరంజీవి స్పందించారు. సభకు వచ్చిన అశేష జనసంద్రం లాగానే పవన్ కల్యాణ్ స్పీచ్ కు తాను కూడా మంత్రముగ్దుడినయ్యానని ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు.

నా ప్రియమైన సోదరుడు పవన్ కల్యాణ్... అని మొదలుపెట్టిన చిరంజీవి.. జనసేన జయకేతన సభలో నీ స్పీచ్ కి మంత్రముగ్ధుడినయ్యాను.. సభ కొచ్చిన అశేష జన సంద్రంలానే నా మనసు ఉప్పొంగింది.. ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చే నాయకుడొచ్చాడన్న నమ్మకం మరింత బలపడింది.. ప్రజా సంక్షేమం కోసం ఉద్యమస్ఫూర్తితో నీ జైత్రయాత్ర నిర్విఘ్నంగా కొనసాగాలని ఆశీర్వదిస్తున్నాను.. అని చిరు ట్వీట్ చేశారు.