'మీ కృషి, తపన హర్షణీయం'... లోకేష్ కు చిరు బర్త్ డే విషెస్!
ఇందులో భాగంగా ఎక్కడికక్కడ అన్నదాన కార్యక్రమాలు ఏర్పాట్లు చేసినట్లు చెబుతున్నారు.
By: Tupaki Desk | 23 Jan 2025 6:34 AM GMTఈ రోజు (జనవరి 23) టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ ఐటీ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ కార్యకర్తలు, ఆయన అభిమానులు సెలబ్రేషన్స్ చేస్తున్నారు. ఇందులో భాగంగా ఎక్కడికక్కడ అన్నదాన కార్యక్రమాలు ఏర్పాట్లు చేసినట్లు చెబుతున్నారు. ఈ సమయంలో చిరంజీవి నుంచి లోకేష్ కు విషెస్ వచ్చాయి.
అవును... లోకేష్ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇందులో భాగంగా... "తాత ఎన్టీఆర్ కు తగ్గ మనవడు, తండ్రి చంద్రబాబును మించిన తనయుడు మంత్రి నారా లోకేష్" అంటూ ఎక్స్ లో విషెస్ చెప్పింది టీడీపీ. ఇదే సమయంలో... చిరంజీవి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పొస్ట్ చేశారు.
ఇందులో భాగంగా... తెలుగు ప్రజలకు సేవ చేయాలనే మీ నిర్విరామ కృషి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం మీ తపన ఎంతో హర్షణీయం. మీ ప్రయత్నాలన్నీ విజయం సాధించాలని కోరుకంటున్నా.. పుట్టినరోజు శుభాకాంక్షలు డియర్ లోకేష్" అని టాలీవుడ్ అగ్రకథానాయకుడు, మెగాస్టార్ చిరంజీవి విషెస్ తెలిపారు.
కాగా... ప్రస్తుతం దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో నారా లోకేష్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ ని కలిసి మాట్లాడిన ఆయన.. అపోలో టైర్స్ వైస్ ఛైర్మన్ నీరజ్ కన్వర్ తోనూ భేటీ అయ్యారు. ఇదే సమయంలో పలువురు పారిశ్రామికవేత్తలతో చర్చించారు.