Begin typing your search above and press return to search.

జనసేన తరఫున రాజ్యసభకు చిరంజీవి... కేంద్ర మంత్రి కూడా ?

అదేంటి అంటే మెగాస్టార్ కి రాజ్యసభ ఇస్తారు అని. ఆ మీదట ఆయనను కేంద్ర మంత్రి మండలిలో తీసుకుంటారు అని. ఏపీ నుంచి రాజ్యసభ అంటే రెండేళ్ళ కాలం పడుతుంది.

By:  Tupaki Desk   |   13 Jun 2024 1:51 PM GMT
జనసేన తరఫున  రాజ్యసభకు చిరంజీవి... కేంద్ర మంత్రి కూడా ?
X

ఈ ప్రచారం ఇపుడు పెద్ద ఎత్తున సాగుతోంది. నిజానికి మోడీ చంద్రబాబు సీఎం గా ప్రమాణ స్వీకార సభకు వచ్చి మరో సెన్సేషన్ క్రియేట్ చేసి వెళ్ళిపోయారు. వేదిక మీద మెగాస్టార్ చిరంజీవిని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని చేరో వైపు ఉంచుకుని ఇద్దరి చేతులు పైకి లేపుతూ విజయ సంకేతాన్ని జనాలకు చూపించారు.

అంతే కాదు ఇద్దరినీ దగ్గరగా హత్తుకున్నారు. వారితోనే ముచ్చట్లు పెట్టారు. దీనిని చూసిన వారు అంతా ఏపీ రాజకీయ తెర మీద సరికొత్త వ్యూహానికి బీజేపీ రెడీ అవుతోందా అన్నది చర్చిస్తున్నారు. ఇవన్నీ ఇలా ఉంటే దేశంలో అత్యున్నత పౌర పురస్కారాన్ని మెగాస్టార్ కి కేంద్రంలోని బీజేపీ ఇచ్చింది. అలాగే రెండేళ్ల క్రితం జరిగిన అల్లూరి 125వ జయంతి ఉత్సవాలకు గౌరవ అతిధిగా పిలిచి మర్యాద చేసింది.

ఇక పవన్ కళ్యాణ్ విషయం చూస్తే చెప్పాల్సింది లేదు. మోడీ ఆయన మీద పుత్ర వాత్సల్యమే చూపిస్తూంటారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన ఎన్డీయే పక్షాల సమావేశంలో పవన్ కాదు తుఫాను అని కీర్తించారు కూడా. ఇంతలా మోడీతో మెగానుబంధం పెనవేసుకున్న వేళ మరో ప్రచారం జోరుగా సాగుతోంది

అదేంటి అంటే మెగాస్టార్ కి రాజ్యసభ ఇస్తారు అని. ఆ మీదట ఆయనను కేంద్ర మంత్రి మండలిలో తీసుకుంటారు అని. ఏపీ నుంచి రాజ్యసభ అంటే రెండేళ్ళ కాలం పడుతుంది. కానీ బీజేపీకి దేశంలో చాలా చోట్ల అవకాశాలు ఉన్నాయి. పైగా ఇటీవల లోక్ సభకు కొంతమంది రాజ్యసభ సభ్యులు ఎన్నిక అయ్యారు. ఆయా చోట్ల ఖాళీలు ఏర్పడ్డాయి. అలా పది దాకా ఖాళీలు రాజ్యసభకు వస్తున్నాయి.

వాటిలో బీజేపీ వాటా కూడా ఉంది. ఇక మెగాస్టార్ చిరంజీవినిని పెద్దల సభలో ఎంపీని చేసి వెను వెంటనే కేంద్ర మంత్రివర్గంలో కేబినెట్ ర్యాంక్ హోదాతో తీసుకోవాలని ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. చిరంజీవి గతంలో రాజ్యసభకు నెగ్గి ఇండిపెండెంట్ చార్జీతో కేంద్ర మంత్రిగా పనిచేశారు. దాంతో ఆయనకు ఈసారి ఇస్తే కచ్చితంగా కేంద్ర మంత్రి పదవి ఇస్తారని అంటున్నారు

ఇక కేంద్రంలో మోడీ మంత్రి వర్గం 72 దగ్గర ఆగింది. ఇంకా తొమ్మిది మందిని తీసుకునే చాన్స్ ఉంది. అందులో జనసేన కోటా కూడా ఉంది. అలా కేంద్ర మంత్రిగా చిరంజీవిని తొందరలో చూడవచ్చునా అంటే అవును అని అంటున్నారు. ఒక వేళ అలా కాకపోతే మాత్రం రెండేళ్ళ పాటు ఆగాలి. 2025 జూన్ లో ఏపీలో నాలుగు రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతాయి. అవన్నీ కూడా టీడీపీ కూటమికే వస్తాయి.

వాటిలో ఒకదానిని చిరంజీవికి కేటాయించడం ద్వారా ఆయనను పెద్దల సభకు పంపీంచి కేంద్రమంత్రిని చేస్తారు అని అంటున్నారు. మెగాస్టార్ కి కేంద్ర మంత్రి పదవి రాజ్యసభ అంటే చంద్రబాబు కూడా పూర్తి సుముఖంగా ఉంటారు అని అంటున్నారు. మెగానుబంధాన్ని మరింతగా గట్టి పరచుకోవడానికి టీడీపీ కూడా సిద్ధంగా ఉంది అని అంటున్నారు.

మరి ఈ వార్తలు అయితే ఇపుడు ప్రచారంలోకి వచ్చి దుమారాన్నే రేపుతున్నాయి. తాను రాజకీయాలకు దూరం అని చిరంజీవి అంటున్నా అవి ఆయనను వీడడం లేదు. పైగా ఇంట్లోనే ఉన్నాయి. సొంత తమ్ముడే ఒక పార్టీ అధినేతగా ఉన్నారు. ఉప ముఖ్యమంత్రిగా ఉంటున్నారు మరి చిరంజీవికి ఆ విధంగా చూస్తే రాజకీయాలు ఒక అడుగు దూరంలోనే ఉన్నాయని అంటున్నారు. తాను ఏ రంగంలోనూ ఫెయిల్ అనిపించుకోవడం ఇష్టపడను అని కూడా చిరంజీవి చెబుతూ వస్తారు. మరి రాజకీయ రంగంలో ఆయన సెకండ్ ఇన్నింగ్స్ సరైన సమయంలోనే మొదలవుతాయని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.