Begin typing your search above and press return to search.

జగన్ టెబుల్ పై చిత్తూరు లిస్ట్... రోజాకు పిలుపు!!

ఈ క్రమంలో భారీ లిస్ట్ ఫైనల్ అయిపోతుందని తెలుస్తుంది.

By:  Tupaki Desk   |   2 Jan 2024 6:53 AM GMT
జగన్  టెబుల్  పై చిత్తూరు లిస్ట్... రోజాకు పిలుపు!!
X

ఏపీ రాజకీయాల్లో.. ప్రధానంగా అధికారపార్టీలో అత్యంత ఆసక్తికరమైన విషయాల్లో ఇన్ ఛార్జ్ ల మార్పు ప్రధానమైనదిగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారని.. మొహమాటాలకు వెళ్లడం లేదని.. గెలుపే ప్రాతిపదికగా నిర్ణయాలు తీసుకుంటున్నారని.. కథనాలొస్తున్న వెళ ఇప్పటికే 11 మంది ఇన్ ఛార్జ్ లను మారుస్తూ జగన్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో భారీ లిస్ట్ ఫైనల్ అయిపోతుందని తెలుస్తుంది.

అవును... గతంలో ఎన్నడూ లేనివిధంగా... సర్వే ఫలితాలు, కార్యకర్తల సూచనలు, ప్రజానికం అభిప్రాయాలు, సామాజిక సమీకరణలు ప్రాతిపదికగా వైఎస్ జగన్ పలు నియోజకవర్గాల్లో ఇన్ ఛార్జ్ లను మారుస్తున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఇప్పటికే ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాల్లోనూ ఈ మార్పులు చేర్పుల కార్యక్రమం ముగిసిందని... ఇక అధికారిక ప్రకటనే తరువాయని తెలుస్తుంది.

ఇందులో భాగంగా పలువురు ఎమ్మెల్యేలకు స్థానచలనాలు ఉండగా.. మరికొంతమంది సిట్టింగులకు "బెటర్ లక్ నెక్స్ట్ టైం" అని చెప్పినట్లు తెలుస్తుంది! ఇదే సమయంలో కొంతమంది ఎంపీలకు ఈసారి ఎమ్మెల్యే టిక్కెట్లు దక్కుతుండగా.. మరికొంతమంది మంత్రులను పార్లమెంటుకు పంపే అవకాశాలూ ఉన్నాయని అంటున్నారు. ఈ మేరకు ఒక్కో జిల్లాకు, ఒక్కో ప్రాంతానికీ ఒక్కోసారి కాకుండా... సంక్రాంతిలోపు మొత్తం రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన మార్పుల చేర్పుల వివారాలు ఒకేసారి వెల్లడించే అవకాశం ఉందని అంటున్నారు.

ఇందులో భాగంగా ఇప్పటికే కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర జిల్లాల్లోని ఇన్ ఛార్జ్ ల మార్పుల విషయంలో పని ఆల్ మోస్ట్ పూర్తయ్యిందని.. ఫైనల్ లిస్ట్ రెడీ అయ్యిందని అంటున్నారు. ఇదే సమయంలో రాయలసీమలో అనంతపురం జాబితా ఇప్పటికే ఫైనల్ అయ్యిందని.. కొత్త అభ్యర్థులను రంగంలోకి దింపుతున్నారని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో... తాజాగా చిత్తూరు జిల్లా జాబితాపై జగన్ కసరత్తులు చేస్తున్నారని సమాచారం. ఈ సమయంలో... మంత్రి రోజాకు జగన్ నుంచి పిలుపువచ్చిందని అంటున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 50మంది ఇన్ ఛార్జ్ లను మారుస్తారనే ప్రచారం జరుగుతున్న వేళ తాజాగా చిత్తుర్రు జిల్లా ఫైల్స్ పై జగన్ దృష్టిపెట్టారని అంటున్నారు. వాస్తవానికి... చిత్తూరు జిల్లాలోని నగరి నియోజకవర్గానికి ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న మంత్రి రోజాకు కూడా ఈసారి టిక్కెట్ ఉండకపోవచ్చని.. నియోజకవర్గం మారుస్తారని గత కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో... ఆమెకు తాడేపల్లి నుంచి పిలుపు వచ్చిందని అంటున్నారు. దీంతో ఇవాళ, రేపట్లో రోజా సీఎం ముందు హాజరవుతారని తెలుస్తుంది.

అయితే... ఎమ్మెల్యేలకు స్థాన చలనాలు కలిగినా, ఈదఫా టిక్కెట్ దక్కకపోయినా అందులో జగన్ తప్పేమీ లేదని... చిన్నపిల్లకు చెప్పినట్లుగా సుమారు ఏడాది క్రితం నుంచే ఎమ్మెల్యేలకు వారి వారి పెర్ఫార్మెన్స్ పై జగన్ సూచనలు, సలహాలు, హెచ్చరికలు ఇస్తూనే ఉన్నారని ఇటీవల రోజా వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో తాడేపల్లి నుంచి పిలుపువచ్చినట్లు తెలుస్తున్న నేపథ్యంలో... రోజా నియోజకవర్గం మారుస్తారా.. లేక, నగరిలోనే కంటిన్యూ చేస్తారా.. అదీగాక మరో మాట ఏమైనా చెబుతారా అనేది వేచి చూడాలి!