Begin typing your search above and press return to search.

షర్మిళ విషయంలో చంద్రబాబు డైలామా ఇదే!?

ఈ నేపథ్యంలో వైఎస్ షర్మిళ ఎన్నికల్లో పోటీ చేస్తే టీడీపీకి లాభమా, వైసీపీకి ప్లస్సా అన్నది అర్థంకాక చంద్రబాబు డైలమాలో ఉన్నారని అంటున్నారు.

By:  Tupaki Desk   |   11 Jan 2024 4:51 AM GMT
షర్మిళ విషయంలో చంద్రబాబు డైలామా ఇదే!?
X

ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార విపక్షాలు ఎవరి వ్యూహాల్లో వారు నిమగ్నమైపోయారు. ఇన్ ఛార్జ్ లను మారుస్తూ, ఇంతకాలం తాను ప్రజలకు ఏమి చేసింది చెబుతూ, తన వల్ల కుటుంబానికి మేలు జరిగితేనే తనకు ఓటు వేయమని జగన్ చెప్పుకుంటున్నారు. మరోవైపు జగన్ వ్యతిరేక శక్తులన్నింటినీ ఏకం చేస్తూ చంద్రబాబు వివిధ కోణాల్లో కసరత్తులు చేస్తున్నారు. బహిరంగ సభల్లో జగన్ పై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఈ సమయంలో షర్మిళ టాపిక్ తెరపైకి వచ్చింది.

అవును... తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తానంటూ పార్టీని స్థాపించిన షర్మిళ... సరిగ్గా ఎన్నికల సమయానికి పోటీ నుంచి విరమించుకున్న సంగతి తెలిసిందే. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బయటనుంచి ఆమె మద్దతిచ్చారు. అనంతరం ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు! దీంతో... షర్మిళకు ఏపీసీసీ బాధ్యతలు ఇవ్వబోతున్నారని, వచ్చే ఎన్నికల్లో ఆమె కడప లోక్ సభ స్థానం నుంచి పోటీ చేస్తారని కథనాలొస్తున్నాయి.

అయితే ఆమె ఎంట్రీ అనేది చంద్రబాబు చేతుల్లో ఉందనే చర్చ తాజాగా తెరపైకి వచ్చింది. ప్రస్తుతం బీజేపీ కంటే కాంగ్రెస్ తోనే పొత్తు బెటర్ అనే మాటలు ఒకపక్క టీడీపీలో వినిపిస్తుండగా.. కాంగ్రెస్ పార్టీతో అనధికారిక పొత్తు, లోపాయకారీ ఒప్పందమే బెటరని మరికొందమంది అభిప్రాయపడుతున్నారంట. దీంతో చంద్రబాబు కాంగ్రెస్ పార్టీ విషయంలో సందిగ్ధంలో ఉన్నారని అంటున్నారు.

ఈ నేపథ్యంలో వైఎస్ షర్మిళ ఎన్నికల్లో పోటీ చేస్తే టీడీపీకి లాభమా, వైసీపీకి ప్లస్సా అన్నది అర్థంకాక చంద్రబాబు డైలమాలో ఉన్నారని అంటున్నారు. ఫలితంగా ప్రస్తుతానికి ఆమె ఎంట్రీ విషయంలో ఎలాంటి సంకేతాలు ఇవ్వడానికి ముందుకురాలేకపోతున్నారని తెలుస్తుంది. ఆమె ఎవరి ఓటు బ్యాంకు చీల్చుతుంది అనేది క్లారిటీ వచ్చేందుకు బాబు ప్రయత్నాలు షురూ చేశారని అంటున్నారు.

దీంతో... ఏపీలో షర్మిళ ఎంట్రీ, వివిద ఆప్షన్స్ తో ప్రస్తుతం సర్వే టీంలను రంగంలోకి దింపారంట చంద్రబాబు. ఫలితంగా... సర్వే ఫలితాలు వచ్చిన అనంతరం ఆమె ఎంట్రీ విషయంలో కాంగ్రెస్ కు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలున్నాయనే చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో బలంగా నడుస్తుంది.

మరి... ఆ సర్వే ఫలితాలు ఏమి చెబుతాయో.. చంద్రబాబు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో అనే విషయాలపై షర్మిళ పొలిటికల్ టర్న్ ఉంటుందని అంటున్నారు పరిశీలకులు. ఇదే సమయంలో ఆమెను పీసీసీ చీఫ్ గా చేస్తారా.. లేక, కేవలం ఎంపీగానే బరిలోకి దింపుతారా అనేది కూడా అప్పుడే తెలియొచ్చని అంటున్నారు!