వీడియో: కుంభమేళాలో మోనాలిసా.. ఉజ్జయినీలో 'చోటీ మోనాలిసా'!
ఈ సమయంలో తాజాగా చోటీ మోనాలిసా వీడియో హల్ చల్ చేయడం మొదలుపెట్టింది. .
By: Tupaki Desk | 23 March 2025 11:40 PM ISTఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో మహా కుంభ మేళా జరిగిన సంగతి తెలిసిందే. ఇక్కడ సాధువులు, సన్యాసులు, అఘోరీలు ప్రత్యక ఆకర్షణగా నిలిచి, వారు కూడా నెట్టింట వైరల్ అయ్యారు. ఇదే కుంభమేళాలో ఓ అమ్మాయి సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఆమెను కుంభమేళా మోనాలిసాగా నెటిజన్లు అభివర్ణించారు.
దీంతో.. మహా కుంభంఏళాలో దండలు అమ్మే అమ్మాయి మోనాలిసా వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యింది. ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళాలో ఇండోర్ కు చెందిన ఆమె దండలు విక్రయిస్తూ ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ వీడియో నెట్టింట హల్ చల్ చేసింది.. ఆమె ఇటీవల ఓ బాలీవుడ్ సినిమాకు సంతకం చేసింది!
ప్రధానంగా ఆమె డస్కీ స్కిన్ టోన్ తో పాటు పెద్ద పెద్ద కళ్లు, మనోహరమైన ముఖం, అమాయకత్వంతో కూడిన చిరునవ్వు నెటిజన్లను బాగా అట్రాక్ట్ చేసింది. ఆమె నిజంగా నేచురల్ బ్యూటీ అంటూ కామెంట్లు నెటిజన్లు కామెంట్స్ పెట్టారు. ఈ సమయంలో తాజాగా చోటీ మోనాలిసా వీడియో హల్ చల్ చేయడం మొదలుపెట్టింది. .
అవును... మహాకుంభమేళాలో మోనాలిసా భోంస్లే తన ప్రత్యేకమైన రూపం, అందమైన కళ్లతో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో తాజాగా చోటీ మోనాలిసా కొత్త వీడియో వైరల్ అవుతోంది.. ఈ వీడియో నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. ఈమెను కుంభమేళా మోనాలిసా ‘మినీ వెర్షన్’ అంటున్నారు నెటిజన్లు.
మహాకుంభ అమ్మాయి మోనాలిసా భోంస్లే తన ప్రత్యేకమైన రూపం - నల్లటి చర్మం మరియు కాషాయ కళ్ళు – వైరల్ అయిన తర్వాత, ' ఛోటీ మోనాలిసా' తో కూడిన కొత్త వీడియో వైరల్ అయి, నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. ఈ వీడియోలో.. మోనాలిసా పోలిక ఉన్న ఆ చిన్నారితో ఓ వ్యక్తి మాట్లాడుతున్నట్లు కనిపించింది.
ఈ సందర్భంగా... చోటీ మోనాలిసా అని ఆ వ్యక్తి చెబుతుండగా.. ఆ అమ్మాయి సరదాగా నేను మీ మొబైల్ పగలగొడతాను అని అంటోంది! ఆ అమ్మాయి కూడా మోనాలిసా భోంస్లే లాగా అందమైన ముక్కు పుడక ధరించి కనిపించింది.. ఆమె అందమైన నల్లటి చర్మ, పెద్ద కళ్లు ఆమెను మోనాలిసా మినీ వెర్షన్ అని అనేలా చేశాయని అంటున్నారు.