Begin typing your search above and press return to search.

అంత‌ర్జాతీయ గాయ‌కుడు `జై శ్రీ‌రామ్` నినాదం

శనివారం సాయంత్రం నవీ ముంబైలోని డివై పాటిల్ స్టేడియంలో క్రిస్ మార్టిన్ అతడి బ్యాండ్ కోల్డ్‌ప్లే తమ అద్భుతమైన ప్రదర్శనతో ప్రేక్షకులను ర‌క్తి క‌ట్టించారు.

By:  Tupaki Desk   |   19 Jan 2025 3:29 PM GMT
అంత‌ర్జాతీయ గాయ‌కుడు `జై శ్రీ‌రామ్` నినాదం
X

ఓవైపు ప్ర‌యాగ్ రాజ్- మ‌హాకుంభ‌మేళాలో విదేశీ సాధువులు హ‌ల్‌చ‌ల్ చేస్తుంటే, మ‌రోవైపు కోల్డ్ ప్లే క్రిస్ మార్టిన్ ముంబైలో అడుగుపెట్టి నానా ర‌చ్చ చేస్తున్నాడు. త‌మ ఫేవ‌రెట్ రాక‌తో ఇండియ‌న్ ఫ్యాన్స్ ఊగిపోతున్నారు. నెమ్మ‌దిగా సంక్రాంతి మూడ్ నుంచి బ‌య‌ట‌ప‌డిన దేశం ఇప్పుడు కోల్డో ప్లే క్రిస్ మార్టిన్ విన్యాసాల‌ గురించే ముచ్చ‌టించుకుంటోంది.

శనివారం సాయంత్రం నవీ ముంబైలోని డివై పాటిల్ స్టేడియంలో క్రిస్ మార్టిన్ అతడి బ్యాండ్ కోల్డ్‌ప్లే తమ అద్భుతమైన ప్రదర్శనతో ప్రేక్షకులను ర‌క్తి క‌ట్టించారు. బ్యాండ్ ఫ్రంట్ మ్యాన్ క్రిస్ మార్టిన్ హిందీలో మాట్లాడుతూ వేదిక‌కు ఊపు తెచ్చాడు. అత‌డి ఆటా పాట‌కు ఫ్యాన్స్ ఉర్రూత‌లూగారు. మ‌ధ్య‌లో ఒక పాట‌ను పూర్తి చేసిన తర్వాత, ప్రేక్షకులకు సుక్రియా (ధన్యవాదాలు) అంటూ అభివాదం చేసాడు. ఆస‌క్తిక‌రంగా అక్క‌డ ఊహించ‌ని మెమ‌ర‌బుల్ మూవ్ మెంట్.. క్రిస్ అభిమానుల ప్లకార్డుపై హిందీ వచనాన్ని చదివి `జై శ్రీ రామ్` అని నిన‌దించ‌డం అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది.

జై శ్రీ‌రామ్ అంటే అర్థం ఏమిటో తెలుసుకునేందుకు క్రిస్ ఎంతో ఆస‌క్తిని క‌న‌బ‌రిచాడు. త‌న అభిమానులను అడిగి మ‌రీ తెలుసుకున్నాడు. క్రిష్ హిందీలో మాట్లాడాడు. ``అందరికీ శుభ సాయంత్రం. ఆప్ సబ్ కా బోహోత్ స్వాగత్ హై. ముంబై మే ఆకర్ హుమేన్ బోహోత్ ఖుషి హో రహీ హై`` అని వ్యాఖ్యానించాడు. మా మొద‌టి నిజ‌మైన ప్ర‌ద‌ర్శ‌న‌... న‌మ‌స్తే అని ఉల్లాసంగా చెప్పాడు క్రిష్‌.

క్రిస్ మార్టిన్‌ ఆకట్టుకునే హిందీకి ఫ్యాన్స్ పుల‌కించిపోయారు. క్రిస్ మార్టిన్ పర్యటనకు ముందు భాగస్వామి డకోటా జాన్సన్‌తో ముంబైకి చేరుకున్నారు. వెంట‌నే హిందూ ఆల‌యాల్లో వారి ఆధ్యాత్మిక యాత్ర మొద‌లైంది. డకోటా జాన్సన్, క్రిస్ ముంబైలోని శ్రీ బాబుల్‌నాథ్ ఆలయాన్ని సందర్శించారు. నిమిషాల్లోనే వారి వీడియోలు, ఫోటోలు వైరల్ అయ్యాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వీడియోలో క్రిస్ -డకోటా ఆలయం లోపల నిలబడి ఉన్నారు. డకోటా నంది విగ్రహం వైపు నడుస్తూ కనిపించింది. ఆమె పుల‌కించిపోతూ నంది చెవుల్లో గుసగుసలాడింది.

ముంబైలోని ప్ర‌ఖ్యాత సిద్ధివినాయక ఆలయాన్ని సందర్శించిన డకోటా జాన్స‌న్ ఫోటోలు వైర‌ల్ అయ్యాయి. ఇన్‌స్టాలో షేర్ చేసిన‌ వీడియోలలో డకోటాతో పాటు బాలీవుడ్ హీరోయిన్‌ సోనాలి బింద్రే, గాయత్రి జోషి ఆలయంలోకి ప్రవేశిస్తూ క‌నిపించారు. ఆలయ ప్రాంగణాన్ని అన్వేషిస్తూ ముగ్గురూ కూడా కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటున్న వీడియోలు వైర‌ల్ అయ్యాయి. భార‌త‌దేశంలో భార‌తీయ సాంప్ర‌దాయాలు, ఆధ్యాత్మిక‌త‌ను భార‌తీయులను మించి విదేశీయులు గుర్తిస్తున్నారు. వారిలో ఆధ్యాత్మిక చింత‌న పెరుగుతున్న వైనం స్ప‌ష్ఠంగా క‌నిపిస్తోంది.