Begin typing your search above and press return to search.

బాబు నుంచి నో ఆన్సర్... సీఐడీ ఏం చేస్తుంది...?

టీడీపీ అధినేత చంద్రబాబును రెండు రోజుల పాటు కస్టడీలోకి తీసుకుని ఏపీ సీఐడీ స్కిల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ స్కాం లో ప్రశ్నించారు.

By:  Tupaki Desk   |   24 Sep 2023 2:57 PM GMT
బాబు నుంచి నో ఆన్సర్... సీఐడీ ఏం చేస్తుంది...?
X

టీడీపీ అధినేత చంద్రబాబును రెండు రోజుల పాటు కస్టడీలోకి తీసుకుని ఏపీ సీఐడీ స్కిల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ స్కాం లో ప్రశ్నించారు. ఈ రెండు రోజులలో దాదాపుగా పదకొండు గంటల పాటు బాబుని విచారించినట్లుగా తెలిసింది.

సీఐడీ డీఎస్పీ ధనుంజయుడు తొమ్మిది మంది అధికారుల బృందం బాబుని విచారించింది. ఈ సందర్భంగా ముప్పయి అంశాలకు సంబంధించి 120 ప్రశ్నలను చంద్రబాబుని అడిగి జవాబులు రాబట్టే ప్రయత్నం చేశారు అని అంటున్నారు.

అయితే చాలా మటుకు ప్రశ్నలకు చంద్రబాబు సమాధానాలు చెప్పలేదని అంటున్నారు. అడిగిన ప్రశ్నలకు ఆయన జవాబు చెప్పకుండా దాటవేసే ధోరణితో వ్యవహరించారు అని అంటున్నారు. దీంతో చంద్రబాబుని విచారించి కీలక అంశాలు తెలుసుకోవాలని సీఐడి చేసిన ప్రయత్నాలు ఏ మేరకు ఫలించాయి అన్నది చూడాలని అంటున్నారు.

మరో వైపు చూస్తే తాము కోరుకున్న విధంగా చంద్రబాబు నుంచి జవాబులు రాకపోవడంతో మరోసారి కస్టడీకి తీసుకుని విచారించాలని ఏపీ సీఐడీ భావిస్తోంది. ఈ మేరకు మెమోను ఏసీబీ కోర్టులో వేసింది. ఏసీపీ కోర్టు బాబును రెండవ మారు కస్టడీకి ఇచ్చే విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంది అంటున్నారు.

ఇదిలా ఉండగా చంద్రబాబు తన మీద ఏపీ సీఐడీ దాఖలు చేసిన ఎఫ్ ఐ ఆర్ ని కొట్టివేయాలని కోరుతూ సుప్రీం కోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఇది సోమవారం విచారణకు రానుంది. సుప్రీం కోర్టు బాబు క్వాష్ పిటిషన్ లో ఏమి చెబుతుంది అన్నది చూడాలని అంటున్నారు.

అయితే బాబు ఇప్పటికే పదిహేను రోజులు రిమాండ్ లో ఉన్నందువల్ల కేసు విచారణ ఒక వైపు జరుగుతున్నందువల్ల అవినీతి మీద పెట్టిన కేసు కావడం వల్ల క్వాష్ పిటిషన్ మీద సుప్రీం కోర్టు లో ఏ రకమైన తీర్పు వస్తుంది అన్నది ఉత్కంఠగా ఉంది.

ఒక వేళ బాబుకు అనుకూలంగా తీర్పు వస్తే మాత్రం ఆయన ఈ కేసు నుంచి పూర్తి స్థాయిలో విముక్తులు అవుతారు. కానీ ఒకవేళ ప్రతికూలంగా తీర్పు వస్తే మాత్రం కష్టాలు మొదలైనట్లే అంటున్నారు. ఇక బాబు అపుడు బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవాల్సి ఉంటుంది అని అంటున్నారు. ఏది ఏమైనా బాబుకు ఈ సోమవారం అంటే సెప్టెంబర్ 25 బిగ్ టెస్టింగ్ డే గా మారనుంది అంటున్నారు.