తెలంగాణలో భారీ స్కాం... ఆస్పత్రులపై సీఐడీ మెరుపు దాడులు!
అవును... ఫేక్ బిల్లులు పెట్టి ముఖ్యమంత్రి సహయ నిధి (సీ.ఎం.ఆర్.ఎఫ్.) నిధులను మింగేశారనే ఆరోపణలపై కొన్ని ఆసుపత్రులకు తెలంగాణ నేర పరిశోధన విభాగం (సీఐడీ) షాకిచ్చింది.
By: Tupaki Desk | 26 Aug 2024 10:40 AM GMTతెలంగాణలో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. సీ.ఎం.ఆర్.ఎఫ్. నిధుల కోసం నకిలీ బిల్లులు సృష్టించి సర్కారుకు టోపీ పెట్టారనే విషయం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. దీంతో... ఈ వ్యవహారంపై సీరియస్ అయిన ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించింది. దీంతో... సీఐడీ మెరుపు దాడులకు దిగిందని తెలుస్తొంది!
అవును... ఫేక్ బిల్లులు పెట్టి ముఖ్యమంత్రి సహయ నిధి (సీ.ఎం.ఆర్.ఎఫ్.) నిధులను మింగేశారనే ఆరోపణలపై కొన్ని ఆసుపత్రులకు తెలంగాణ నేర పరిశోధన విభాగం (సీఐడీ) షాకిచ్చింది. ఇందులో భాగంగా... 28 ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులపై విస్తృతదాడులు నిర్వహించింది. ఈ సందర్భంగా ఆసుపత్రులపై కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది.
సుమారు గత దశాబ్ధ కాలంగా ముఖ్యమంత్రి సహాయ నిధి దరఖాస్తుల్లో గణనీయమైన వ్యత్యాసాలను ఆడిట్ వెలికితీసిన తర్వాత సీఐడీ ఈ దాడులు ప్రారంభించిందని తెలుస్తోంది. పలువురు ఏజెంట్ల సహకారంతో సీ.ఎం.ఆర్.ఎఫ్. నిధులను మోసపూరితంగా పొందేందుకు నకిలీ పత్రాలను రూపొందించినట్లు విచారణలో తేలిందని అంటున్నారు.
దీంతో... ఈ వ్యవహారంపై విచారణ చేపట్టిన సీఐడీ.. సంబంధిత ఆస్పత్రి యాజమాన్యాలపై కేసులు నమోదు చేసిందని తెలుస్తోంది. విచారణలో భాగంగా... రంగారెడ్డి, కరీంనగర్, వరంగల్, మెదక్ సహా పలు జిల్లాల్లో వేగంగా దాడులు నిర్వహించారని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటివరకూ ఆరు ఎఫ్.ఐ.ఆర్.లు నమోదయ్యాయని సమాచారం.
వాస్తవనికి తెలంగాణ సచివాలయంలోని రెవెన్యూ శాఖలో పనిచేసే సెక్షన్ ఆఫీసర్ ఫిర్యాదుతో ఈ దర్యాప్తు ప్రారంభమైందని అంటున్నారు. ఇందులో భాగంగా... చాలా మంది ఆస్పత్రుల్లో ఎలాంటి చికిత్సా చేయించుకోకున్నా.. చేయించుకున్నట్లు బిల్లులు సృష్టించారని.. ఆ నకిలీ బిల్లులతో సీ.ఎం.ఆర్.ఎఫ్. కొసం దరఖాస్తు చ్చేస్తుకున్నారని అంటున్నారు.
ఈ వ్యవహారంలో ఆయా ఆస్పత్రి యాజమాన్యాలు, అక్కడ పనిచేసే సిబ్బంది తో పాటు స్థానిక ప్రజా ప్రతినిధులు సహకరించారని తెలుస్తోంది. ఈ వ్యవహారం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థికంగా భారీ నష్టం కలిగిందని అధికారులు చెబుతున్నారు!