టీవీలో చూసేవరకూ తెలియదు... సివిల్స్ విజేత పేరెంట్స్ కామెంట్స్ వైరల్!
ఈ సమయంలో నాలుగో ర్యాంక్ సాధించిన కేరళకు చెందిన పీకే సిద్ధార్థ్ రామ్ కుమార్ వ్యవహారం ఆసక్తిగా మారింది.
By: Tupaki Desk | 17 April 2024 7:45 AM GMTఆల్ ఇండియా సర్వీసుల్లో నియామకాల కోసం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించిన సివిల్స్ - 2023 తుది ఫలితాలు విడుదలవ్వగా.. ఆ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు. మహబూబ్ నగర్ కు చెందిన అనన్య రెడ్డి జాతీయ స్థాయిలో మూడో ర్యాంకుతో మెరిశారు. ఈ సమయంలో నాలుగో ర్యాంక్ సాధించిన కేరళకు చెందిన పీకే సిద్ధార్థ్ రామ్ కుమార్ వ్యవహారం ఆసక్తిగా మారింది.
అవును... తాజాగా విడుదలైన సివిల్స్ - 2023 ఫలితాల్లో నాలుగో ర్యాంక్ సాధించారు కేరళకు చెందిన పీకే సిద్ధార్థ్ రామ్ కుమార్. అయితే సిద్ధార్థ్ పేరు మీడియాలో వచ్చేవరకు ఆయన పరీక్ష రాసిన విషయం కుటుంబసభ్యులకు కూడా తెలియకపోవడం గమనార్హం. అతను సివిల్స్ కి ప్రిపేర్ అవుతున్నట్లు కానీ.. పరీక్ష రాస్తున్నట్లు కానీ ఇంట్లో తెలియదని పేరెంట్స్ చెప్పడం వైరల్ గా మారింది.
ఈ సందర్భంగా స్పందించిన సిద్ధార్థ్ తల్లి... తమ కుమారుడు ఈసారి సివిల్స్ పరీక్ష రాసిన సంగతి తమకు తెలియదని అన్నారు. ఇదే సమయంలో అతడు పాసై, ఇంటర్వ్యూకు వెళ్లిన సంగతి తమకు చెప్పలేదని తెలిపారు. తాజాగా టీవీలో అతని పేరు కనిపించినప్పుడే ఈ విషయం అంతా తమకు తెలిసిందని వెల్లడించారు. ఇంటికి వచ్చి పరీక్షలు రాసినా.. తమకు ఆ విషయం తెలియనివ్వలేదని చెప్పారు!
ఈ సమయంలో తన ర్యాంకు గురించి తాజాగా ఫోన్ చేసి చెప్పి కొద్దిసేపే మాట్లాడాడని ఆమె వెల్లడించారు. ఇదే క్రమంలో... ప్రస్తుతం తన కుమారుడు ఐపీఎస్ ను వీడి ఐఏఎస్ లో చేరతారని ఆమె తెలిపగా.. ఇది తాము అసలు ఊహించలేదని.. ఇలాంటి అనూహ్య సంఘటనలు జరిగితే ఆనందం రెట్టింపు అవుతుందని సిద్ధార్థ్ తండ్రి సంతోషం వ్యక్తంచేశారు!
టాప్ 10 ర్యాంకర్లు వీళ్లే!:
ఆదిత్య శ్రీవాస్తవ - 1
అనిమేష్ ప్రధాన్ - 2
దోనూరు అనన్య రెడ్డి - 3
పీకే సిద్ధార్థ్ రామ్ కుమార్ - 4
రుహాని - 5
సృష్టి దబాస్ - 6
అన్ మోల్ రాఠోర్ - 7
ఆశీష్ కుమార్ - 8
నౌషీన్ - 9
ఐశ్వర్యం ప్రజాపతి - 10