Begin typing your search above and press return to search.

కేసీఆర్ పిటీషన్ .. సీజేఐ కీలక వ్యాఖ్యలు !

దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్లగా దానిపై ఈ రోజు నిర్వహించిన విచారణలో ఇరువర్గాల వాదనలు విన్న సీజేఐ చంద్రచూడ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

By:  Tupaki Desk   |   16 July 2024 8:20 AM GMT
కేసీఆర్ పిటీషన్ .. సీజేఐ కీలక వ్యాఖ్యలు !
X

బీఆర్ఎస్ పాలనలో విద్యుత్ కొనుగోళ్లు, భద్రాచలం, దామరచర్ల పవర్ ప్లాంట్ల నిర్మాణాలపై తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ నరసింహారెడ్డి కమీషన్ రద్దు చేయాలన్న కేసీఆర్ పిటీషన్ ను హైకోర్టు తోసిపుచ్చిన విషయం తెలిసిందే.

దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్లగా దానిపై ఈ రోజు నిర్వహించిన విచారణలో ఇరువర్గాల వాదనలు విన్న సీజేఐ చంద్రచూడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కమిషన్ చైర్మన్ నరసింహారెడ్డి ప్రెస్ మీట్ పెట్టడాన్ని తప్పు పట్టారు.

కమిషన్ చైర్మన్ గా ఉండి ప్రెస్ మీట్ ఎలా పెడతారు ? కమిషన్ చైర్మన్ ఎలా తన అభిప్రాయాలు వ్యక్తం చేస్తారు ? న్యాయమూర్తి న్యాయం చెప్పడమే కాకుండా, నిష్పక్షపాతంగా కనపడాలి. ఆయన స్థానంలో మరొక చైర్మన్ ను నియమించడానికి అవకాశం ఇస్తున్నాం అని సీజేఐ చంద్రుడి వెల్లడించారు. దీంతో మధ్యాహ్నం 2 గంటలకు కొత్త చైర్మన్ పేరు వెల్లడిస్తామని ప్రభుత్వ న్యాయవాది సింఘ్వీ తెలిపారు.

అంతకుముందు కేసీఆర్ తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు.

విద్యుత్ విచారణ కమిషన్ నియామకంలో పరిధిని అతిక్రమించారని, ట్రిబ్యునల్స్ ఉండగా, విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై ఎలా న్యాయ విచారణ ఎలా వేస్తారని ?, కొత్త రాష్ట్రం ఏర్పడిన నేపథ్యంలో విద్యుత్ సంక్షోభం నేపథ్యంలో విద్యుత్ కొనుగోలు చేశారని తెలిపారు. మార్కెట్ రేట్ కంటే తక్కువగా యూనిట్ 3.90 రూపాయలకి మాత్రమే కొనుగోలు చేశారని, దీనిపై ప్రస్తుత ముఖ్యమంత్రి అనేకసార్లు ఆర్టీఐ పిటీషన్లు వేశారని తెలిపారు.

విచారణకు ముందే దోషిగా తేలుస్తున్నారని, ఇది కక్ష సాధింపు చర్య అని, ఈ ఆర్ సి ఉండగా, మళ్లీ విచారణ కమిషన్ అవసరం లేదని, మేము రాష్ట్ర ప్రభుత్వము నుంచే విద్యుత్ కొనుగోలు చేశామని, ప్రభుత్వ సంస్థల ద్వారానే భద్రాద్రి థర్మల్ కు సబ్ క్రిటికల్ టెక్నాలజీ వాడామని ముకుల్ తెలిపారు.