Begin typing your search above and press return to search.

శ్రీవారి సేవలో చంద్రబాబు ఫ్యామిలీ.. దేవాంశ్ బర్త్ డే స్పెషల్ ఇదే!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మనవడు నారా దేవాంశ్ పుట్టినరోజును పురస్కరించుకుని కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారి సేవలో పాల్గొన్నారు.

By:  Tupaki Desk   |   21 March 2025 12:10 PM IST
శ్రీవారి సేవలో చంద్రబాబు ఫ్యామిలీ.. దేవాంశ్  బర్త్  డే స్పెషల్  ఇదే!
X

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మనవడు నారా దేవాంశ్ పుట్టినరోజును పురస్కరించుకుని కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారి సేవలో పాల్గొన్నారు. అంతకుముందు ఆలయ మహాద్వారం వద్ద టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, అర్చకులు.. ముఖ్యమంత్రి చంద్రబాబుకు లాంఛనంగా స్వాగతం పలికారు.


ఈ సందర్భంగా శ్రీవారి దర్శనం అనంతరం వేదపండితులు రంగనాయకుల మండపంలో ఆశీర్వచనాలిచ్చారు. ఇదే సమయంలో స్వామివారి చిత్రపటం, తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా... నుదుటున నామం, సంప్రదాయ వస్త్ర ధారణతో చంద్రబాబు శీవారి దర్శనానికి వచ్చారు. స్వామివారి దర్శనార్ధం వైకుంఠ క్యూ కాంప్లెక్స్ గుండా ఆలయంలోకి ప్రవేశించారు.


అవును... సీఎం చంద్రబాబు శ్రీవారి సేవలో పాల్గొన్నారు. మనవడు దేవాంశ్ పుట్టినరోజు కావటంతో కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి సేవలో పాల్గొన్నారు! ఈ సందర్భంగా అన్నదాన కేంద్రంలో ప్రసాదాల పంపిణీకి ఒకరోజు అయ్యే ఖర్చును దేవాంశ్ పుట్టిన రోజు సందర్భంగా టీటీడీ అన్నదాన ట్రస్టుకు చంద్రబాబు విరాళంగా అందజేశారు.

కాగా... నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు.. ఈ దఫా సీఎం హోదాలో రెండోసారి తిరుమల పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా.. వెంగమాంబ సత్రంలో దేవాంశ్ పేరుతో అన్నదానం నిర్వహించారు. ఈ క్రమంలో చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులు స్వయంగా వడ్డించారు.