సీఎం రిలీఫ్ ఫండ్ వ్యవహారం... హరీశ్ పీఎ అరెస్ట్ పై క్లారిటీ ఇదిగో!
అవును... సీఎం రిలీఫ్ ఫండ్ గోల్ మాల్ వ్యవహారంలో నలుగురిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 28 March 2024 5:38 AM GMTగత బీఆరెస్స్ ప్రభుత్వ హయాంలో సీఎం రిలీఫ్ ఫండ్ కు సంబంధించిన చెక్కుల జారీలో అవకతవకలు జరిగాయని.. ఈ వ్యవహారంలో నలుగురిని అరెస్ట్ చేశారని.. అందులో ఒకరు హరీశ్ రావు పీఏ అని వార్తలొస్తున్న సంగతి తెలిసిందే. అయితే... ఈ విషయంపై హరీశ్ రావు కార్యాలయం స్పందించింది. ఇందులో భాగంగా ఒక ప్రెస్ నోటి రిలీజ్ చేసింది!!
అవును... సీఎం రిలీఫ్ ఫండ్ గోల్ మాల్ వ్యవహారంలో నలుగురిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే... ఆ నలుగురిలో ఒకరు హరీశ్ రావు పీఏ అని కథనాలు వైరల్ గా మారాయి. దీంతో... ఈ అంశంపై హరీశ్ రావు కార్యాలయం వెంటనే స్పందించింది. ఇందులో భాగంగా... ఆ వార్తలను, ఆ ప్రచారాన్ని ఖండిస్తున్నట్లు పేర్కొంది. ఈ మేరకు పూర్తి వివరాలను ట్విట్టర్ లో రాసుకొచ్చింది.
ఇందులో భాగంగా... నరేష్ అనే వ్యక్తి హరీశ్ రావు వద్ద పీఏ కాదని, అతను ఒక కంప్యూటర్ ఆపరేటర్ గా, తాత్కాలిక ఉద్యోగిగా హరీశ్ ఆఫీసులో పనిచేసే వారని తెలిపింది. ఆర్థిక, ఆరోగ్య మంత్రిగా పదవీకాలం పూర్తయిన తర్వాత, ప్రభుత్వ ఆదేశాలు లేఖ నెం. 2290 తేదీ 05-12-2023 ఆదేశాల ప్రకారం.. మంత్రి ఆఫీసు మరుసటి రోజు 06-12-2023న మూసివేసి, సిబ్బందిని పంపియ్యడం జరిగిందని స్పష్టం చేసింది!
అయితే... ఆఫీసు మూసివేసే క్రమంలో ఎటువంటి సమాచారం లేకుండా కొన్ని సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను నరేష్ తన వెంట తీసుకెళ్లినట్లు తమ దృష్టికి వచ్చిందని.. దీంతో, వెంటనే తమ కార్యాలయం స్పందించిందని, ఇందులో భాగంగా అతనిపై 17-12-2023న నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదూ చేయడం అరిగిందని.. ఆ వ్యక్తితో హరీశ్ రావుకి కానీ, ఆయన కార్యాలయానికి కానీ ఎలాంటి సంబంధం లేదని వెల్లడించింది.
దీంతో... సీఎం రిలీఫ్ ఫండ్ గోల్ మాల్ వ్యవహారంలో నలుగురు అరెస్ట్ అయిన మాట వాస్తవమే కానీ... వారిలో ఒకరు హరీశ్ రావు పీఏ అనే విషయం మాత్రం సత్యదూరం అని కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు!