Begin typing your search above and press return to search.

ఆడబడుచులకు జగనన్న కట్నం... ఒకేసారి 5 లక్షల గృహాల ప్రారంభం!

ఎన్నికల సమయంలో వాగ్ధానాలు ఇవ్వడం.. కుర్చీ ఎక్కాక ఆ హామీలు గాలికి వదిలేయడం ఇంతకాలం చూసిన రాజకీయం!

By:  Tupaki Desk   |   12 Oct 2023 5:01 AM GMT
ఆడబడుచులకు జగనన్న కట్నం... ఒకేసారి 5 లక్షల గృహాల ప్రారంభం!
X

ఎన్నికల సమయంలో వాగ్ధానాలు ఇవ్వడం.. కుర్చీ ఎక్కాక ఆ హామీలు గాలికి వదిలేయడం ఇంతకాలం చూసిన రాజకీయం! ఆ జమానాకు కాలం తీరింది! ఎన్నికల్లో ఇచ్చిన హామీలు మొత్తాన్ని నెరవేర్చడంతో పాటు.. నాడు ఇవ్వలేని హామీలను కూడా పరిస్థితులకు తగ్గట్లుగా ఎంచుకుని అమలు చేయడం నేటి జమానా.. అది వైఎస్ జగన్ జమానా అని చెప్పినా ఆశ్చర్యం లేదు.. అతిశయోక్తి కాదు! ఈ క్రమంలో తాజాగా ఆడపడుచులకు జగనన్న 5 లక్షల గృహాలు ప్రారంభం అవుతున్నాయి.

అవును... రాష్ట్రంలో సొంత ఇల్లు లేనివాళ్లు ఉండరాదన్నది సీఎం వైఎస్ జగన్ సంకల్పం అనేది తెలిసిన విషయమే. ఈ విషయాన్ని ఆయన పలుమార్లు చెప్పారు. చెప్పడమే కాదు చేతల్లోనూ పనులు ప్రారంభించారు. ప్రతి చెల్లీ, ప్రతి అక్కా తన పిల్లాపాపలతో సొంత ఇంటిలో ఉండాలని, దానికి తనవంతుగా గొప్ప సాయం అందించాలని అయన తలపోశారు. అందులో భాగంగా 30.75 లక్షల మందికి రూ.76,000 కోట్ల విలువైన ఇళ్ళ స్థలాలకు సంబంధించి పట్టాలను జగన్ అందజేశారు.

ఇదే క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా పేదలకు ఏకంగా 21.76 లక్షల గృహాలు నిర్మించాలని నిర్ణయించుకున్న వైఎస్ జగన్.. అందుకోసం రూ.56,700 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా కూడా వేశారు. అయితే ప్రస్తుతం ఆర్ధికంగా ఇబ్బందులు ఉన్నాయని చెబుతున్న రాష్ట్రానికి ఇది పెద్ద మొత్తమే! కానీ ఇవ్వాలన్న తలంపు.. ఇచ్చి తీరాలన్న దృఢచిత్తం ముందు అలాంటి అడ్డంకులు ఆయన్ను ఆపలేకపోయాయి.

కోవిడ్ సమయంలోనే ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా ఆపకుండా అందించిన జగన్ కు ఇది చిన్న విషయమనే పలువురు భావించారు కూడా. దీంతో రాష్ట్రవ్యాప్తంగా వేలాదిగా జగనన్న కాలనీల కోసం స్థలసేకరణ జరిగింది. అక్కడ ఇళ్ళు నిర్మించేందుకు వీలుగా రోడ్లు, నీళ్లు, డ్రైనేజ్, విద్యుత్, పార్కులు, వంటి మౌలిక సదుపాయాలు సమకూర్చారు. దీంతో మెల్లగా ఇళ్ల నిర్మాణం మొదలవుతోంది.

ఇందులో భాంగంగా ఒక్కొక్కరూ తమకు ఇచ్చిన జాగాలో ప్రభుత్వ సాయంతో ఇల్లు కట్టుకుంటున్నారు. ఎంత తక్కువగా లెక్కేసినా ఒక్కో ఇంటి ధర ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం రూ.15 లక్షలు ఉంటుందని అంచనా! అంటే సీఎం వైఎస్ జగన్ ఆలోచనలు వాస్తవరూపం దాలుస్తుండడంతో రాష్ట్రంలో పేదల జీవన స్వరూపమే మారుతోందని చెప్పాలి. ఫలితంగా ఇళ్లులేని పేదలు ఇక మీదట ఆత్మగౌరవంతో సొంత ఇంట్లో ఉండొచ్చన్నమాట.

నేడు సామర్లకోటలో సామూహిక గృహ ప్రవేశాలు:

రాష్ట్రంలో ఉద్యమం మాదిరిగా ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్న అధికారులు.. అటు లబ్ధిదారులకు అన్నిరకాలుగా తోడ్పాటును అందిస్తున్నారు. ఇటుక, సిమెంట్, కంకర, ఐరన్, తలుపులు, గుమ్మాలు, కిటికీలను సైతం సమకూరుస్తూ నిర్మాణం త్వరగా అయ్యేలా సహకరిస్తున్నారు. ఇప్పటికే ఈ పథకం కింద 5.24 లక్షల గృహాలు పూర్తవగా.. వాటిని నేడు లబ్ధిదారులకు అందజేస్తున్నారు జగన్.

ఈ క్రమంలో దాదాపు 2,412 ఇళ్లను పూర్తి చేసుకున్న సామర్లకోట పట్టణంలో లబ్ధిదారుల సామూహిక గృహప్రవేశాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హాజరు అవుతున్నారు.

ఆ కాలనీల్లో ఇప్పటికే పార్కులు, రోడ్లు, తాగునీరు, డ్రైనేజీలు, విద్యుత్, కమ్యూనిటీ హాలు వంటి మౌలిక సదుపాయాలు కల్పించిన ప్రభుత్వం అక్కడ నివాసానికి సమస్తం సమకూర్చింది. ఈ సందర్భంగా లబ్దిదారులతోబాటు జగన్ మోహన్ రెడ్డి సైతం వారి సంతోషాల్లో భాగం పంచుకుంటున్నారు. పేదల ఇళ్లలో చిరునవ్వులు పూయించేందుకు జగన్ చేస్తున్న కృషి ఫలవంతం అవుతున్నందుకు లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.