Begin typing your search above and press return to search.

మెట్రో రైలు విషయంలో సీఎం రేవంత్ సంచలన నిర్ణయం!

మెట్రో ప్రాజెక్టు, ఫార్మా సిటీని రద్దు చేస్తున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజలకు ప్రయోజనం చేకూర్చే పథకాలను ఎట్టి పరిస్థితుల్లో కూడా దూరం పెట్టే ఆలోచన లేదని ప్రకటించారు.

By:  Tupaki Desk   |   1 Jan 2024 12:23 PM GMT
మెట్రో రైలు విషయంలో సీఎం రేవంత్ సంచలన నిర్ణయం!
X

దేశంలో మెట్రో రైళ్లు విస్తరిస్తున్నాయి. ప్రస్తుతం భాగ్యనగరంలో మెట్రో పరుగులు పెడుతోంది. నగర వ్యాప్తంగా అన్ని చోట్లకు మెట్రో సదుపాయం విస్తరించింది. ఈనేపథ్యంలో మెట్రో రైళ్ల వినియోగంతో ప్రజలకు దూరం మరింత చేరువవుతోంది. మియాపూర్ నుంచి రామచంద్రాపురం, ఎంజీబీఎస్ నుంచి శంషాబాద్ వరకు మెట్రో సౌకర్యం కల్పిస్తున్నారు. దీంతో నగర ప్రజలకు రవాణా మరింత సులభం అయింది. గతంలో నగరం తిరగాలంటే ఇబ్బందులు పడాల్సి వచ్చేది. ఇప్పుడు మెట్రో పరుగులతో ప్రయాణం చౌకగా మారింది.

ఏ నగర చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం సమస్త నగరాలు మెట్రోలమయం. దేశంలోని అన్ని నగరాలు మెట్రో వేగంతో ముందుకు దూసుకెళ్తున్నాయి. ఎటు వెళ్లాలన్నా మెట్రోలే దిక్కవుతున్నాయి. హైదరాబాద్, బెంగుళూరు, కోల్ కత, ముంబయి, ఢిల్లీ వంటి నగరాలు సర్వం మెట్రోలతో నిండిపోయాయి. ఎటు వెళ్లినా మెట్రోలనే ఆశ్రయిస్తున్నారు. దీంతో ప్రయాణం చౌకగా తక్కువ సమయంలో చేరుకుంటున్నారు. ఇలా మెట్రోల పరుగు మనకు సౌకర్యవంతంగా మారనున్నాయి.

మెట్రో ప్రాజెక్టు, ఫార్మా సిటీని రద్దు చేస్తున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజలకు ప్రయోజనం చేకూర్చే పథకాలను ఎట్టి పరిస్థితుల్లో కూడా దూరం పెట్టే ఆలోచన లేదని ప్రకటించారు. సీబీఎస్ నుంచి పాతబస్తీ మీదుగా శంషాబాద్ ఎయిర్ పోర్టుకు మెట్రోను పొడిగించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు.

కొత్తగా లైన్లు ప్రతిపాదించి తక్కువ ఖర్చుతో పూర్తి చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్నారు. మెట్రో రైళ్ల వినియోగంతో ప్రజలకు ప్రయోజనం చేకూరుతోంది. ఈ క్రమంలో మెట్రో వాడకంతో ప్రయాణికులకు మరింత లాభాలు కలుగుతున్నాయి. ఇంతకు ముందున్న పరిస్థితి లేదు. దీంతో సీఎం తీసుకున్న నిర్ణయం ప్రజలకు మరింత ప్రయోజనకరంగా ఉందని చెబుతున్నారు.