రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించినవి?
అధికారంలో ఉన్నప్పుడు దర్జా అనుభవించిన వారు అది పోయిన తరువాత కూడా అలాగే ఉండాలి.
By: Tupaki Desk | 21 Dec 2023 9:25 AM GMTఅధికారం శాశ్వతం కాదు. పదవులు ఎల్లప్పుడు ఉండవు. కొంత కాలం మంచి మరికొంత కాలం చెడు ఉన్నట్లే జీవితంలో కూడా పదవులు కూడా దోబూచులాడుతుంటాయి. అధికారం కోసం అర్రులు చాచే వారుంటారు. సీఎం పదవి మీద ఆశతో చాలా మంది ఉంటారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారం దక్కకపోవడంతో నైరాశ్యంలో పడిపోవడం సహజమే. అధికారంలో ఉన్నప్పుడు దర్జా అనుభవించిన వారు అది పోయిన తరువాత కూడా అలాగే ఉండాలి.
అధికార పక్షం నుంచి ప్రతిపక్షంలోకి వెళ్లడం బాధాకరమే. కానీ మనసు కుదుటపరచుకోవాలి. అధికారంలో ఉన్నా లేకున్నా ఒకే తీరుగా వ్వవహరించడం మంచిది. అలాగే అలవాటు చేసుకోవాలి. అధికారం మారినప్పుడు కూడా హుందాగా ఉండటం అలవాటు చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు కేటీఆర్ ను ఉద్దేశించి చేశారనే వాదనలు వస్తున్నాయి.
నెరవేరని కోరికలు ఉంటే వాటిని తీర్చుకోవాలని కలలు కనడం చేస్తూనే ఉంటే ఫలితాలు వేరేలా ఉంటాయి. ప్రస్తుతం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. కేటీఆర్ తీరు వల్ల శాసనసభలో గడ్డు పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అధికార పక్షాన్ని ఇరుకున పెట్టాలని యోచిస్తున్న కేటీఆర్ తీరుతో కాంగ్రెస్ పార్టీ ఘాటైన సమాధానాలు ఇస్తోంది. ఇందులో భాగంగానే కేటీఆర్ పై రేవంత్ రెడ్డి ఉద్దేశపూర్వక వ్యాఖ్యలు చేసినట్లు చెబుతున్నారు.
ఏది జరిగినా సహనంతో ఉండాలి. సహనం నశిస్తే తీవ్ర పరిణామాలుంటాయి. కేటీఆర్ వల్ల కాంగ్రెస్ పార్టీకి తలనొప్పులు వస్తున్నాయి. అధికారం దూరం కావడంతో కేటీఆర్ మాటల్లో నిజాయితీ కొరవడుతోంది. ఇష్టారాజ్యంగా మాట్లాడటంతో కాంగ్రెస్ నేతలకు మింగుడు పడటం లేదు. అందుకే కేటీఆర్ ను ఉద్దేశించి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
అధికారం చేతిలో ఉన్నా లేకపోయినా మంచి మాటలు మాట్లాడాలి. ఎదుటి వారికి గౌరవం ఇవ్వాలి. మనకు అధికారం లేదు కదా అని ఎలా పడితే అలా మాట్లాడకూడదు. అలా మాట్లాడితే పరిణామాలు ఇలాగే ఉంటాయి. ఈనేపథ్యంలో కేటీఆర్ తన మాట తీరు మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే పరిణామాలు దారుణంగా మారుతాయని తెలుసుకుంటే మంచిదనే అభిప్రాయాలు రాజకీయ విశ్లేషకుల్లో వస్తున్నాయి.