Begin typing your search above and press return to search.

కేటీఆర్ ను రేవంత్.. అండర్ వేర్ సేల్స్ మెన్ తో పోల్చినట్లేనా?

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు అత్యంత రసవత్తరంగా సాగుతున్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   3 Aug 2024 4:02 AM GMT
కేటీఆర్ ను రేవంత్.. అండర్ వేర్ సేల్స్ మెన్ తో పోల్చినట్లేనా?
X

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు అత్యంత రసవత్తరంగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఇక్కడ అధికార, ప్రతిపక్షాల మధ్య ఎంటర్టైన్మెంట్ కామెంట్స్ తో పాటు.. కీలక నేతల మధ్య మాటల యుద్ధాలు, సవాళ్ల పర్వాలు బలంగానే వినిపిస్తున్నాయని అంటున్నారు. ఇక నిత్యం ఉప్పూ - నిప్పుగా ఉండే సీఎం రేవంత్ వర్సెస్ బీఆరెస్స్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మధ్య సాగిన మాటల యుద్ధాలు, వ్యంగ్య పదప్రయోగాలూ పీక్స్ అనే చెప్పాలి.

ఈ నేపథ్యంలోనే... తనకు 18ఏళ్ల క్రితమే రేవంత్ తెలుసని, ఇద్దరం మంచి మిత్రులమని, కాకపోతే 10ఏళ్లుగా చెడిందని కేటీఆర్ కామెంట్ చేశారు. ఈ సమయంలో సబితా ఇంద్రారెడ్డిపై రేవంత్ పరోక్ష కామెంట్లు అని చెబుతున్న ఏపీసోడ్ సీరియస్ గా మారింది.. నిరసనలు, బీఆరెస్స్ ఎమ్మెల్యేల అరెస్టుల వరకూ వెళ్లింది. ఈ క్రమంలో... కేటీఆర్ ను లోదుస్తులు అమ్ముకునే వ్యక్తితో పోల్చారనే విషయం ఇప్పుడు వైరల్ గా మారింది.

తాజా అసెంబ్లీలో హైదరాబాద్ నగర గొప్పతనాన్ని, ఇక్కడున్న అవకాశాల గురించి మాట్లాడుతున్న క్రమంలో... కేటీఆర్ ని ఉద్దేశించి మాట్లాడుతూ.. అమెరికాలో చదువుకుని ఉంటే ఉండొచ్చు కానీ, చదువు మంచికి ఉపయోగపడాలి కానీ, చెడగొట్టేందుకు ఎందుకు అంటూ రేవంత్ మొదలుపెట్టారు. ఆ చదువును మంచికి ఉపయోగించాలని సూచించారు. ఈ సమయంలో ఇన్నర్ వేర్ సేల్స్ మేన్ తో తనకైన అనుభవాన్ని పంచుకుంటూ సెటైర్లు వేశారు.

అవును... ఓ విషయం చెప్పడం మరిచాను అంటూ మొదలుపెట్టిన రేవంత్ రెడ్డి... "మొన్న బట్టల షాపుకు పోయి అండర్ వేర్ కొనుక్కుందామంటే... అవి అమ్మేవాడు ఇంగ్లిష్ లో బాగా మాట్లాడుతున్నాడు" అని చెప్పారు. "ఇంత మంచి ఇంగ్లిష్ మాట్లాడుతూ ఈ అండర్ వేర్లు అమ్మే పని ఎందుకు చేస్తున్నావు?" అని అతడిని అడిగినట్లు తెలిపారు. అందుకు ఆ సేల్స్ మెన్... తాను కూడా కేటీఆర్ కంటే బాగా ఇంగ్లిష్ మాట్లాడగలనని చెప్పినట్లు వెల్లడించారు.

"నేను కూడా కేటీఆర్ కంటే ఇంగ్లిష్ బాగా మాట్లాడగలను సర్.. కానీ లాంగ్వేజ్ వేరు, నాలెడ్జ్ వేరు.. లాంగ్వేజ్ కమ్యునికేషన్ కోసం మాత్రమే ఉండేది.." అని సదరు సేల్స్ మెన్ తనతో చెప్పినట్లు రేవంత్ తెలిపారు. ఇదే క్రమంలో... "ఇక్కడ ఏదైనా హోటల్ కి పోతే ఫుడ్ ఆర్డర్ తీసుకునేవాడూ నీలానే ఇంగ్లిష్ లో మాట్లాడతాడు.. అంత మాత్రాన్న అతడు మంత్రి అవుతాడా..? ప్రజల ఆమోదం ఉంటే నాయకులం అవుతాము.." అని అన్నారు.

దీంతో... ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. కేటీఆర్ అప్పుడప్పుడూ రేవంత్ మాట్లాడే ఇంగ్లిష్ పై వెటకారమాడుతుంటారు. ఈ సమయంలో... నాయకులం అవ్వడం వేరు.. ఇంగ్లిష్ లో మాట్లాడటం వేరు అని చెబుతూ.. హైదరాబాద్ లో అడుక్కి ఒకరు కేటీఆర్ లా ఇంగ్లిష్ మాట్లాడేవారు ఉన్నారన్నట్లుగా రేవంత్ ఇచ్చిన కౌంటర్.. బీఆరెస్స్ నేతలకు షాకింగ్ గా ఉందని చెబుతున్నారు!