తెరపైకొచ్చిన స్టాలిన్ పాత వీడియో... తండ్రీకొడుకులకు కొత్త హెడేక్!
హిందూ సంప్రదాయ వివాహ మంత్రాలపై తనకు నమ్మకం లేదని చెబుతున్న ఆయన ప్రసంగం ఉండటంతో.. అది కాస్తా వైరల్ గా మారింది.
By: Tupaki Desk | 5 Sep 2023 1:37 PM GMTడెంగీ, మలేరియా, కరోనాను మనం వ్యతిరేకించడం కాదు వాటిని సమూలంగా నిర్మూలించాలి. అదేవిధంగా... సనాతన ధర్మాన్ని వ్యతిరేకించడం కంటే నిర్మూలించడమే అత్యంత ముఖ్యమైంది అంటూ తమిళనాడు మంత్రి, సీఎం స్టాలిన్ కుమారుడు ఉదయనిది స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా పెనుదుమారమే రేపిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై హిందూ సంస్థలు తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేశాయి!
అయితే... సమానత్వానికి, సామాజిక న్యాయానికి అడ్డుగా నిలుస్తున్నందునే సనాతన ధర్మం అనే దాన్ని పూర్తిగా నిర్మూలించాలని చెప్పినట్లుగా ఉదయనిది స్టాలిన్ వివరణ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని రాజకీయంగా ఫుల్ గా క్యాష్ చేసుకునే పనిలో బీజేపీ ఉందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ సమయంలో స్టాలిన్ పాత వీడియో ఒకటి తెరపైకి వచ్చింది.
అవును... ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్న వేళ... సీఎం స్టాలిన్ పాత వీడియో కూడా బయటకు వచ్చి హల్ చల్ చేస్తుంది. ఆ వీడియోలో... హిందూ సంప్రదాయ వివాహ మంత్రాలపై తనకు నమ్మకం లేదని చెబుతున్న ఆయన ప్రసంగం ఉండటంతో.. అది కాస్తా వైరల్ గా మారింది.
గతంలో ఓ వివాహ వేడుకలో పాల్గొన్న సందర్భంగా డీఎంకే అధ్యక్షుడిగా హోదాలో ఉన్న స్టాలిన్... కన్నీళ్లకు దారితీసే అగ్ని పొగ, పూజారుల గందరగోళంగా అర్థంకాని భాషలో మంత్రాలు పఠించడం వంటి వివాహ సంప్రదాయాలు హాస్యభరితంగా ఉంటాయంటూ ఆయన వ్యాఖ్యానించినట్లు ఆ వీడియోలో ఉంది! ఇదే సమయంలో వాటిపై తనకు అస్సలు నమ్మకం లేదని ఆయన చెప్పడం చూడొచ్చు!
దీంతో... సనాతనధర్మంపై ఉదయనిది స్టాలిన్ చేసిన వ్యాఖ్యలకు తోడు.. స్టాలిన్ గతంలో చేసిన వ్యాఖ్యల వీడియో కూడా తోడవడంతో.. ఇష్యూ మరింత వైరల్ అవుతుంది. దీంతో తండ్రీ కొడుకులపై హిందూ నాయకులు విరుచుకుపడుతున్నారు. మరికొంతమంది రాజకీయంగా క్యాష్ చేసుకునే పనిలో బిజీగా ఉన్నారు.
కాగా... "డెంగీ, మలేరియా, కరోనాను మనం వ్యతిరేకించడం కాదు.. వాటిని సమూలంగా నిర్మూలించాలి. అదేవిధంగా... సనాతన ధర్మాన్ని వ్యతిరేకించడం కంటే నిర్మూలించడమే ముఖ్యం. సనాతనం అనేది సమానత్వానికి, సామాజిక న్యాయానికి వ్యతిరేకం. సనాతనం అంటే మార్చడానికి వీల్లేనిది అని అర్థం" అని ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
దీంతో... బీజేపీ నేతలు, హిందూ సంఘాల నేతలు ఉదయనిధి స్టాలిన్ పై తీవ్ర విమర్శలు చేశారు. చాలా చోట్ల ఫిర్యాదులు కూడా దాఖలయ్యాయి. ఉదయనిధి స్టాలిన్ తల తెచ్చి ఇస్తే పదికోట్ల రూపాయల బహుమతి ఇస్తానంటూ ఉత్తర ప్రదేశ్ లోని తపస్విచావిని ఆలయ ప్రధాన ఆర్చకుడు పరమహంస ఆచార్య శృతిమించిన వ్యాఖ్యలు కూడా చేశారు!