ముహూర్తం ఫిక్స్ ఇక, వెళ్లిపోవడమే!?
వచ్చే నెల డిసెంబరు 8న అక్కడకి సీఎం వెళ్లిపోవడం ఖాయమని అంటున్నారు. భార్యా సమేతంగా జగన్ విశాఖకు డిసెంబరు 8న వెళ్లిపోవడం ఖాయమని మంత్రి సీదిరి అప్పలరాజు కూడా నర్మగర్భంగా వ్యాఖ్యా నించారు.
By: Tupaki Desk | 25 Nov 2023 2:34 PM GMTవైసీపీ ప్రభుత్వం విశాఖను పాలనా రాజధానిని చేయడం ఖాయమైపోయింది. అయితే.. దీనికి సంబంధించి న్యాయపరమైన చిక్కులు , వివాదాలు ఉన్న నేపథ్యంలో నేరుగా రాజధాని అని కాకుండా.. పాలనను మాత్ర మే ముఖ్యమంత్రి ఉన్న చోట నుంచి నిర్వహించేలా ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే విశాఖపట్నంలో మంత్రు లు, ఉన్నతాధికారులకు బిల్డింగులు ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. ఇప్పుడు ఏకంగా ముహూర్తం కూడా ఫిక్స్ చేసింది.
వచ్చే నెల డిసెంబరు 8న అక్కడకి సీఎం వెళ్లిపోవడం ఖాయమని అంటున్నారు. భార్యా సమేతంగా జగన్ విశాఖకు డిసెంబరు 8న వెళ్లిపోవడం ఖాయమని మంత్రి సీదిరి అప్పలరాజు కూడా నర్మగర్భంగా వ్యాఖ్యా నించారు. ఇక, ఇప్పటికే అనేక కార్యాలయాలను కేటాయిస్తూ.. ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. హోం శాఖ నుంచి సాంఘిక సంక్షేమ శాఖ వరకు అన్ని శాఖలను విశాఖకు తరలించేస్తూ.. తాజాగా ఉత్త ర్వులు ఇచ్చింది.
ఇదిలావుంటే, మరోవైపు.. అధికారులకు కూడా నివాసాలను ఖరారు చేస్తూ.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వారికి కూడా భవనాలు సిద్ధం చేసింది. మొత్తంగా చూస్తే.. సీఎం జగన్ విశాఖకు వెళ్లేందుకు మహూర్తం రెడీ అయింది. ఇక, డిసెంబరు 8 ఏకాదశి, హస్తా నక్షత్రం.. (జగన్‌కు కలిసివ చ్చే నక్షత్రం అంటారు) ముహూర్తం ఖరారు చేసుకున్నట్టు సమాచారం. మొత్తానికి ఇప్పటి వరకు రెండు మూడు వాయిదాలు పడినప్పటికీ.. మరోవైపు న్యాయ స్థానాల నుంచి ఇబ్బందులు ఉన్నప్పటికీ.. సీఎం మాత్రం దూకుడు ప్రదర్శించడం గమనార్హం. మరి దీనిపై ఎవరు ఎలాంటి విమర్శలు చేస్తారో చూడాలి.