Begin typing your search above and press return to search.

ఇండియన్ మార్కెట్ లో కోకాకోలా ఐస్డ్ గ్రీన్ టీ... ఫ్లేవర్స్ ఇవే!

ఇలా కూల్ డ్రింక్స్ మార్కెట్ ను శాసిస్తున్న కోకాకోలా... తాజాగా భారతదేశంలో కొత్తగా టీ మార్కెట్‌ లోకి ప్రవేశించనుంది.

By:  Tupaki Desk   |   23 Nov 2023 4:30 AM GMT
ఇండియన్  మార్కెట్  లో కోకాకోలా ఐస్డ్  గ్రీన్  టీ... ఫ్లేవర్స్  ఇవే!
X

ప్రపంచ దిగ్గజ కూల్ డ్రింక్ సంస్థ కోకాకోలా గురించి తెలిసిందే. కూల్ డ్రింక్ అంటే కోక్ అనే స్థాయిలో ప్రపంచానికి అలవాటుచేసేసింది. దైనందిన జీవితంలో ఆ సంస్థ తన డ్రింక్ లను ఒక భాగం చేసేసింది! ఇలా కూల్ డ్రింక్స్ మార్కెట్ ను శాసిస్తున్న కోకాకోలా... తాజాగా భారతదేశంలో కొత్తగా టీ మార్కెట్‌ లోకి ప్రవేశించనుంది.

అవును... ప్రపంచ దిగ్గజ కూల్ డ్రింక్ సంస్థ కోకాకోలా.. భారతదేశంలో టీ మార్కెట్‌ లోకి ప్రవేశించనుంది. ఇందులో భాగంగా... దేశంలో కొత్తగా తాము "హానెస్ట్ టీ" పేరిట టీ కూడా అమ్ముతామని కోకాకోలా ఇండియా తాజాగా వెల్లడించింది. ఈ బ్రాండ్ టీని కోకాకోలా అనుబంధ సంస్థ "హానెస్ట్" మార్కెట్ లోకి ప్రవేశపెట్టింది.

తాజాగా కోల్‌ కతా నగరంలో జరిగిన బెంగాల్ గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ (బిజిబిఎస్) ఏడవ ఎడిషన్‌ లో కోకాకోలా కంపెనీ, లక్ష్మీ టీ కో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీల మధ్య దీనికి సంబంధించి ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా... కోల్‌ కతాకు చెందిన లక్ష్మీ టీ కో ప్రైవేట్ లిమిటెడ్ కు చెందిన మకైబారి టీ ఎస్టేట్ నుంచి ఆర్గానిక్ గ్రీన్ టీని కోకాకోలా కంపెనీ తీసుకోనుంది.

ఈ సందర్భంగా కోకా-కోలా ఇండియా, నైరుతి ఆసియా సీనియర్ అధికారి... వినియోగదారులకు విస్తృతంగా టీ పానీయాన్ని అందించడమే తమ లక్ష్యమని తెలిపారు. ఇదే సమయంలో... ఐస్డ్ గ్రీన్ టీ లెమన్, తులసి, మ్యాంగో వేరియంట్‌ లలో వస్తుందని కోకాకోలా తెలిపింది. దీనిని పూర్తిగా ఆర్గానిక్ గ్రీన్ టీతోనే తయారు చేస్తామని వెల్లడించింది.

ఇదే సమయంలో... కోకా కోలా ఇండియా, సౌత్‌ వెస్ట్ ఆసియా మార్కెటింగ్ కాఫీ, టీ కేటగిరీ డైరెక్టర్ కార్తీక్ సుబ్రమణియన్ స్పందించారు. ఇందులో భాగంగా... రెడీ టు డ్రింక్ ఐస్డ్ గ్రీన్ టీని పరిచయం చేయడం చాలా ఆనందంగా ఉందని.. హానెస్ట్ టీ తో కలిసి వినియోగదారులకు అద్భుతమైన గ్రీన్ టీ ఆధారిత పానీయాన్ని అందిస్తున్నామని తెలిపారు!