Begin typing your search above and press return to search.

కాఫీ చేదు నిజం ఇదే.. తేల్చేసిన సైంటిస్టులు

ఇందులో మొజాంబియోసైడ్ కూడా ఉంది. కెఫీన్ తో పోలిస్తే ఇది పది రెట్లు ఎక్కువ చేదుగా ఉంటుంది.

By:  Tupaki Desk   |   3 Feb 2025 8:30 AM GMT
కాఫీ చేదు నిజం ఇదే.. తేల్చేసిన సైంటిస్టులు
X

కాఫీ చేదుగా ఉంటుందా? కానే కాదు.. కమ్మగా ఉంటుందని కొందరంటారు. అబ్బే.. కాఫీ చేదుగా ఉంటుంది బ్రో అని మరికొందరు అంటారు. ఇంతకూ కాఫీ చేదుగా ఎందుకు ఉంటుంది? అన్న రహస్యాన్ని బట్టబయలు చేశారు జర్మనీ శాస్త్రవేత్తలు. కాఫీ తాగే వ్యక్తి జన్యు లక్షణాల ఆధారంగానే చేదు ఫీలింగ్ ఉంటుందన్నారు. కొద్దికాలంగా తాము చేస్తున్న పరిశోధనలకు తాజాగా వారు పలు విషయాల్ని గుర్తించారు.

తమ రీసెర్చ్ లో భాగంగా కాఫీయా అరబికా మొక్క నుంచి సేకరించిన గింజలను రోస్ట్ చేశారు. వాటిని పొడిగా మార్చి.. కాఫీని తయారు చేశారు. కాఫీలోని కేఫీన్ చాలా చేదుగా ఉంటుందన్న విసయం తెలిసిందే. దీన్ని తొలగించిన కాఫీ కూడా చేదుగా ఉంటోంది. దీంతో రోస్టెడ్ కాఫీలో చేదుకు ఇతర పదార్థాలు కారణంగా గుర్తించారు. ఇందులో మొజాంబియోసైడ్ కూడా ఉంది. కెఫీన్ తో పోలిస్తే ఇది పది రెట్లు ఎక్కువ చేదుగా ఉంటుంది.

మనిషి శరీరంలో చేదుకు సంబంధించిన టీఏెస్2ఆర్43, టీఏఎస్2ఆర్46 అనే రెండు రకాల గ్రాహకాలను క్రియాశీలం చేస్తుంది. అయితే.. కాఫీ గింజలను వేగించేటప్పుడు మొజాంబియోసైడ్ తీవ్రత గణనీయంగా తగ్గుతున్నట్లుగా గుర్తించారు. కాఫీ చేదుగా ఉండటానికి అదో కారణంగా గుర్తించారు.

రోస్టింగ్ కారణంగా మొజాంబియోసైడ్ కు సంబంధించిన ఇతరత్రా పదార్థాలు ఇంకేమైనా ఉత్పత్తి అవుతున్నాయా? అన్నది తేలాల్సి ఉంది. కాఫీ గింజల్ని వేయించే క్రమంలో మొజాంబియోసైడ్ క్షీణించి.. ఏడు విభిన్న ఉత్పత్తులుగా రూపాంతం చెందుతున్నట్లుగా గుర్తించారు. రోస్టింగ్ ఉష్ణోగ్రత.. ఎంతసేపు రోస్ట్ చేశారన్న దానికి అనుగుణంగా వీటి పరిమాణం ఉంటోందని తేల్చారు.

కాఫీగా తయారైన తర్వాత వీటి గాఢత తగ్గుతున్నట్లుగా శాస్త్రవేత్తలు గుర్తించారు. మొజాంబియోసైడ్.. దాని రోస్టింగ్ ఉత్పత్తులకు సంబంధించి ఒక కాంబినేషన్ కలిగిన కాఫీ తాగిన పదకొండు మంది వాలంటీర్లలో ఎనిమిది మంది మాత్రమే చేదు రుచిని అనుభవించారు. జన్యుపరమైన అంశాలు ఈ రుచి భావనను ప్రభావితం చేస్తున్నట్లుగా తేల్చారు. మొత్తంగా జన్యుపరమైన అంశాలు కాఫీ చేదుగా ఉందనే భావనను కలిగిస్తున్న విషయాన్ని తాజాగా శాస్త్రవేత్తలు తేల్చారు.