Begin typing your search above and press return to search.

విచక్షణారహితంగా కొట్టుకున్న క్లాస్ మెట్స్... వీడియో వైరల్!

సినిమాల ప్రభావమో.. లేక, విజ్ఞతలేని ఆలోచనా విధాన ప్రభావమో తెలియదు కానీ... ప్రాక్టీస్ పేపర్స్ కోసం విద్యార్థులు తీవ్రస్థాయిలో కొట్టుకున్నారు

By:  Tupaki Desk   |   9 Sep 2023 7:55 AM GMT
విచక్షణారహితంగా కొట్టుకున్న క్లాస్ మెట్స్... వీడియో వైరల్!
X

సినిమాల ప్రభావమో.. లేక, విజ్ఞతలేని ఆలోచనా విధాన ప్రభావమో తెలియదు కానీ... ప్రాక్టీస్ పేపర్స్ కోసం విద్యార్థులు తీవ్రస్థాయిలో కొట్టుకున్నారు. కాలేజీ బిల్డింగ్ బేస్ మెంట్ లో దొల్లుకుంటూ కొట్టుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. పరిస్థితి ఆస్పత్రిలో చావుబ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడే వరకూ వచ్చింది!

అవును... కొన్ని పరీక్షలకు సంబంధించిన ప్రాక్టీస్ పేపర్లను పంచుకోలేదనే కారణంతో హైదరాబాద్‌ లోని ఒక జూనియర్ కాలేజీ విద్యార్థిని అతని క్లాస్ మెట్ దారుణంగా కొట్టిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అత్యంత పాశవికంగా అనిపించేలా విచక్షణారహితంగా జరిగిన ఈ గొడవలో ఒక విద్యార్థి ఆస్పత్రిలో సీరియస్ కండిషన్ మధ్య ఉన్నాడంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు.

వివరాళ్లోకి వెళ్తే... హైదరాబాద్‌ లోని నల్గొండ ఎక్స్‌ రోడ్‌ లోని ఒకేషనల్ జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుతున్న ఇద్దరు విద్యార్థులు మధ్య ప్రాక్టీస్ పేపర్ లకు సంబంధించి వాగ్వాదం జరిగింది. అనంతరం వారిలో ఒక విద్యార్థి కైఫ్ తన స్నేహితులతో కాలేజ్ బిల్డింగ్ బేస్ మెంట్ లో కబుర్లు చెప్పుకుంటున్నాడు!

ఈ సమయంలో వారి తోటి విద్యార్థి సయ్యద్ అరీఫ్ అటుగా వచ్చాడు. దీంతో వీడియోలో కనిపిస్తున్నట్లుగా... కైఫ్.. సయ్యద్ ని చెంపపై కొట్టాడు! అనంతరం నేలపై పడేసి తన్నడం ప్రారంభించాడు! ఈ సమయంలో అతడిని విచక్షణారహితంగా కొట్టాడు.!ఈ సమయంలో ఇద్దరు విద్యార్థులు సయ్యద్ కు సాయం చేయడానికి వచ్చారు.

ఇద్దరు విద్యార్థులు కిందపడిన సయ్యద్ ఆరిఫ్ ను పైకి లేపే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే సయ్యద్ సృహతప్పి పడిపోయాడో.. లేక, లేవలేని స్థితికి చేరుకున్నాడో స్పష్టత లేదు కానీ... పరిస్థితి మాత్రం సీరియస్ అని తోటి విద్యార్థులు గమనించారని తెలుస్తుంది. దీంతో వెంటనే సమీప ఆసుపత్రికి అతడిని తరలించారు.

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సయ్యద్ ఆరిఫ్ పరిస్థితి ప్రస్తుతం సీరియస్ గా ఉందని అంటున్నారు. తగలకూడని చోట దెబ్బలు తగలడం వల్ల... చావుబ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి నెలకొందని అంటున్నారు. మరోవైపు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.