Begin typing your search above and press return to search.

ఉద్యోగం పేరుతో స్కామ్.. కాంబోడియాలో చిక్కుకున్న 67 మంది భారతీయులు.

న్యూస్ లో జరుగుతున్న ఆన్లైన్ మోసాల గురించి తెలుసుకొని కూడా చాలామంది గుడ్డిగా స్కామ్స్ కి బలైపోతున్నారు

By:  Tupaki Desk   |   5 Oct 2024 7:07 AM GMT
ఉద్యోగం పేరుతో స్కామ్.. కాంబోడియాలో చిక్కుకున్న 67 మంది భారతీయులు.
X

న్యూస్ లో జరుగుతున్న ఆన్లైన్ మోసాల గురించి తెలుసుకొని కూడా చాలామంది గుడ్డిగా స్కామ్స్ కి బలైపోతున్నారు. ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని.. ఫారిన్లో మంచిగా సంపాదించే అవకాశం ఇస్తామని ..పేద మధ్యతరగతి యువతను మభ్యపెట్టి చాలామంది స్కాములు చేస్తున్నారు. బయట దేశాలకు వెళ్తే మంచి సంపాదన ఉంటుంది.. సమాజంలో గౌరవం ఉంటుంది అన్న ఆశతో అమాయకంగా వీరు కూడా బలైపోతున్నారు. తాజాగా ఇటువంటి ఓ స్కాం కాంబోడియాలో వెలుగు చూపింది.

భారతదేశానికి చెందిన 67 మంది కాంబోడియాలో ఉద్యోగం కోసం వెళ్లి స్కామ్ కి బలైపోయారు. కాంబోడియాలోని భారత రాయభార్య కార్యాలయం ,స్థానిక అంతర్గత మంత్రిత్వ శాఖతో కలిసి ఇటీవల నిర్వహించిన రెస్క్యూ ఆపరేషన్లు వీరిని గుర్తించారు. ఫేక్ జాబ్ ఆఫర్ల కారణంగా కాంబోడియాలోని పోయిపేట్‌కు తీసుకువచ్చిన ఈ 67 మంది చేత సైబర్ క్రైమ్ కార్యకర్తలు చేయించేవారు. దీనికోసం వారిపై తీవ్రమైన ఒత్తిడి కూడా తీసుకువచ్చారు. పాస్పోర్ట్ స్కామర్ల చేతిలో పడడంతో ఈ 67 మంది కూడా వారు చెప్పినట్టే చేయాల్సి వచ్చేది.

అయితే రెస్క్యూ ఆపరేషన్ పుణ్యమా అంటూ వీరు ఈ ఇరకటం నుంచి బయటపడ్డారు. ఇప్పటికే 39 మంది స్వదేశానికి పంపబడ్డారు. మిగిలిన వారిని కూడా త్వరలోనే స్వదేశానికి పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు. గత కొద్ది కాలంగా భారతదేశ నుంచి బయట దేశానికి ఉద్యోగాలకు వెళ్లి ఇలా స్కాముల్లో ఇరుక్కున్న వారి సంఖ్య ఎక్కువగానే కనిపిస్తుంది. అందుకే విదేశాలకు వెళ్లే ముందు పాస్పోర్ట్స్ దగ్గర నుంచి ప్రతి డాక్యుమెంట్స్ ను సక్రమంగా ఉండేలా చూసుకోవాలి. విదేశాలలో ఉద్యోగాలపై ఇంకా ప్రజలలో అవగాహన లోపం ఉండటమే ఇటువంటి స్కామర్లకు ఆయుధంగా మారుతుంది. ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపడుతున్న చాలామంది ఇలా దోపిడీలకు బలైపోతున్నారు.

ఇలా నకిలీ ఏజెంట్ల ద్వారా మోసపూరితమైన ఉద్యోగ ఆఫర్ల కారణంగా కాంబోడియాలో చిక్కుకున్న భారత పౌరులను రక్షించి స్వదేశానికి పంపే ప్రయత్నంలో భారత రాయబార కార్యాలయం జోరుగా పనిచేస్తుంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా ప్రకటనల ద్వారా లేక అనుమానాస్పద ఏజెంట్ల ద్వారా ఆగ్నేయ ఆసియా దేశాలలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామంటూ వచ్చే ప్రకటనలను నమ్మవద్దని.. ఇటువంటి విషయంలో జాగ్రత్త వహించమని సూచనలు కూడా జారీచేస్తుంది.