Begin typing your search above and press return to search.

స్కూల్‌ లో అడ్మిషన్‌ కావాలంటే.. అడిగేది ఇలాంటి వివాదాస్పద ప్రశ్నలా?

స్టాండప్‌ కమెడియన్‌ శ్రీధర్‌ తన సోషల్‌ మీడియా ఖాతాలో దీన్ని షేర్‌ చేయడంతో ఇది వైరల్‌ అవుతోంది.

By:  Tupaki Desk   |   30 Aug 2024 9:18 AM GMT
స్కూల్‌ లో అడ్మిషన్‌ కావాలంటే.. అడిగేది ఇలాంటి వివాదాస్పద ప్రశ్నలా?
X

పిల్లలను స్కూళ్లో చేర్పించేటప్పుడు ఏ స్కూల్‌ యాజమాన్యమైనా సహజంగా ఎవరినైనా ఏమడుగుతుంది?.. మీ పిల్లల వయసు ఎంత? ఇంతకు ముందు ఏ స్కూల్లో చదివారు? ఎక్కడ ఉంటారు?.. ఇలాంటి ప్రశ్నలు అడుగుతారు. అయితే ముంబైలో ఉన్న ఒక స్కూల్‌ మాత్రం పిల్లల డెలివరీ ఎలా జరిగిందో చెప్పాలంటూ అప్లికేషన్‌ ఫారమ్‌ లో ఒక ప్రశ్న ఇవ్వడం హాట్‌ టాపిక్‌ గా మారింది. అంతేకాకుండా ఆ ప్రశ్న కింద మూడు ఆప్షన్లను కూడా ఇవ్వడం గమనార్హం.

స్టాండప్‌ కమెడియన్‌ శ్రీధర్‌ తన సోషల్‌ మీడియా ఖాతాలో దీన్ని షేర్‌ చేయడంతో ఇది వైరల్‌ అవుతోంది. తల్లిదండ్రులు తమ పిల్లోడిని ముంబైలోని ఒక ప్రీ స్కూల్‌ లో చేయడానికి వెళ్లినప్పుడు దరఖాస్తు ఫారమ్‌ లో ఆ స్కూల్‌.. ‘మీ పిల్లల డెలివరీ ఎలా జరిగింది’ అనే ప్రశ్న ఇచ్చింది. ఆ ప్రశ్న కింద మూడు ఆప్షన్లు కూడా ఇచ్చింది. నార్మల్‌ డెలివరీ, ప్రీ మెచ్యూర్, సర్జరీ.. అంటూ ఆప్షన్లను పేర్కొంది.

ఈ అసంబద్ధమైన ప్రశ్న తీవ్ర వివాదాస్పదమైంది. స్కూళ్లో అడ్మిషన్‌ కు, పిల్లలు ఎలా పుట్టారు అనేదానికి సంబంధం ఏమిటని ప్రశ్నే ఉత్పన్నమైంది. పిల్లలు నేర్చుకునే సామర్థ్యంపై ఎలా పుట్టారనే అంశం ఎటువంటి ప్రభావం చూపదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ప్రీస్కూల్‌ అడ్మిషన్ల సందర్భంలో ఇలాంటి ప్రశ్న అడగడం వెనుక స్కూల్‌ ఉద్దేశం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.

స్టాండప్‌ కమెడియన్‌ శ్రీధర్‌ ఈ దరఖాస్తు ఫారమ్‌ లోని ప్రశ్న, ఆప్షన్లను సోషల్‌ మీడియాలో పోస్టు చేయడంతో నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ‘‘ముంబైలో పాఠశాల విద్య ఎంత పిచ్చిగా ఉందో మీకు తెలియకపోతే, దరఖాస్తు ఫారమ్‌లో అడిగే ప్రశ్నలను చూడండి. ఇది ప్రీస్కూల్‌కి సంబంధించినది’’ అని స్క్రీన్‌ షాట్‌ను శ్రీధర్‌ షేర్‌ చేశారు.

ఈ పోస్టుకు నెటిజన్ల నుంచి మంచి స్పందన వచ్చింది. 3.8 లక్షల మంది దీన్ని చూశారు. 5,900 మంది లైక్‌ చేశారు. అనేక మంది నెటిజన్లు ఈ ప్రీ స్కూల్‌ కు వ్యతిరేకంగా తమ కామెంట్లలో దుమ్మెత్తి పోశారు.

‘ఇది వ్యాపారం కాదు. నా కుటుంబంలోని పిల్లలను అలాంటి పాఠశాలకు పంపడానికి నేను నిరాకరిస్తాను’’ అని డాక్టర్‌ నీలిమా శ్రీవాస్తవ రాశారు. అలాగే ‘వారు (ఆ ప్రీ స్కూల్‌) దానిని ఎలా హ్యాండిల్‌ చేస్తుందో చూడడానికి ’పైన ఉన్నవన్నీ’ అని టిక్‌ చేయాలని నిర్ణయించుకున్నాను’ అని నరసింహ అని వ్యక్తి తెలిపారు.

‘ఇది అప్లికేషన్‌ ప్రాసెస్‌పై ఎలా ప్రభావం చూపుతుందో ఆలోచించడానికి ప్రయత్నిస్తున్నాను‘ అని మరొక నెటిజన్‌ పోస్టు చేశాడు. అలాగో ‘ఏ విద్యా సంస్థకైనా ఇది ఎలా ముఖ్యమైనది? మరి ఎందుకు?’ అని మరో నెటిజన్‌ ప్రశ్నించాడు.